Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రెండో రోజుకు సంబంధించిన ఫస్ట్ ప్రొమో వచ్చేసింది. బ్లూ టీమ్ సభ్యులను ఓ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్.. రెడ్ టీమ్‌లో హౌస్‌మేట్‌గా మారడానికి మీరు అనర్హులుగా భావిస్తున్న 5 గురు సభ్యులు ఎవరో స్పష్టమైన కారణాలు చెప్పి వారి ఫోటోలపై పిన్‌తో గుచ్చాలని సూచించాడు.

రోహిత్, చరణ్, షాలిని, అమన్, శివ సృష్టి లను నామినేట్ చేస్తారు. ఆ తరువాత రెడ్ టీమ్ సభ్యులను పిలిచిన బిగ్‌బాస్.. బ్లూటీమ్లో హౌస్‌మేట్‌గా మారడానికి అనర్హులుగా భావిస్తున్న 5 గురిని టీమ్ అంతా కలిసి సెలక్ట్ చేయాలని చెబుతాడు.

Supritha : మోడ్రన్ డ్రెస్‌లో సురేఖ వాణీ కూతురు.. సుప్రీత స్టైలిష్ ఫోటోలు..

త్రిగుణ్, రామ్‌ప్రసాద్, దేబ్జానీ మోదక్, వర్షిణి, కృష్ణుడులను నామినేట్ చేస్తారు. రోహిత్ మాట్లాడుతూ.. త్రిగుణ్‌కు ఓపిక లేదని చెబుతాడు, రామ్‌ప్రసాద్ రూల్స్ బ్రేక్ చేశాడని అంటాడు. వర్షిణి ని నటిస్తున్నట్లుగా అనిపిస్తుందని చెప్పాడు. టాస్క్‌లో కృష్ణుడు గివ్ అప్ ఇచ్చేశాడని అంటాడు.

వెంటనే కృష్ణుడు మాట్లాడుతూ.. నేను 100 శాతం ఇవ్వలేదని అంటావా? నీకు లీడర్ అయ్యే లక్షణాలు లేవని, నువ్వు నాకు ఎలా ఆడాలో చెబుతావా? నువ్వు రాజు మేము నీ సైనికులమా ? అంటూ మండిపడ్డాడు. ఇంకా వీరిద్దరి మధ్య డిస్కషన్స్ ఎలా నడిచింది ఎంత దూరం వెళ్లిందో పూర్తి ఎపిసోడ్ వచ్చే ఆగాల్సిందే.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రెండో రోజుకు (Bigg Boss Telugu 10) సంబంధించిన ఫస్ట్ ప్రొమో వచ్చేసింది.