ఇరుముడి (Irumudi)

Bigg Boss 10 Day 2 Episode : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండో రోజుకు వచ్చింది. నిన్న కీస్ గెలుచుకున్న పదిమందికి పవర్స్ ఇచ్చారు. అలాగే మహాపరీక్ష మొదలుపెట్టి కంటెస్టెంట్స్ రోహిత్, రామ్ ప్రసాద్ ని లీడర్స్ గా ఎంచుకున్నారు. రోహిత్ రెడ్ కలర్, రామ్ ప్రసాద్ బ్లూ కలర్ అని కర్చీఫ్స్ తో బిగ్ బాస్ ఫిక్స్ చేసారు. నేడు కంటెస్టెంట్స్ కొన్ని బ్యాగులు సెలెక్ట్ చేయాలి. ఆ బ్యాగులు తీసుకెళ్లి లీడర్స్ కి ఇస్తే అందులో ఉన్న రెడ్, బ్లూ కలర్స్ బ్యాండ్స్ తో వాళ్లకు నచ్చిన వాళ్లకు ఆ బ్యాండ్స్ వేసి తమ టీమ్ మేట్స్ ని ఎంచుకుంటారు. వేరే కలర్ బ్యాండ్స్ వస్తే వాళ్ళను వేరే టీమ్ కి పంపిస్తారు. అలా రామ్ ప్రసాద్ టీమ్ లోకి త్రిగుణ, ముకేశ్ , సుధీర్ , నరేష్ , దేబ్జానీ , వర్షిణి, కృష్ణుడు వచ్చారు. ఇక రోహిత్ టీమ్ లోకి అమన్ , వంశీ, షాలిని , సృష్టి, చరణ్ , ఝాన్సీ, చైత్ర రాయ్ వచ్చారు.

అయితే వర్షిణి రోహిత్ వల్ల రామ్ ప్రసాద్ టీమ్ లోకి వచ్చింది కాబట్టి వర్షిణి నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అని రామ్ ప్రసాద్ తో కాసేపు గొడవ పెట్టుకుంది. ఈ టీమ్స్ తో మళ్ళీ అగ్నిపరీక్ష మెంబర్స్ వర్సెస్ సెలబ్రిటీల టీమ్ అనే నడిచింది. అనంతరం బిగ్ బాస్ ఒక టీమ్ ఇంకో టీమ్ లోని మెంబర్స్ పై అభిప్రాయాలు చెప్పాలి. వేరే టీమ్ లోని వాళ్లలో హౌస్ మెట్ గా మారడానికి అనర్హులు ఎవరో 5 గురి పేర్లు చెప్పాలి టీమ్ అంతా కలిసి అనే టాస్క్ ఇచ్చారు. అలా హౌస్ మేట్స్ ని నామినేట్ చేయొచ్చు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరిపై అభిప్రాయాలు చెప్పారు. రామ్ ప్రసాద్ టీమ్.. చరణ్, అమన్, రోహిత్, సృష్టి, షాలిని పటేల్ లను హౌస్ మేట్స్ గా అర్హత లేదు అని సెలెక్ట్ చేసారు. రోహిత్ టీమ్.. కృష్ణుడు, రామ్ ప్రసాద్ , వర్షిణి, త్రిగుణ, దేబ్జానీ లను హౌస్ మేట్స్ గా అర్హత లేదు అని సెలెక్ట్ చేసారు.

Also Read : Bigg Boss 10 Day 2 Promo : బిగ్ బాస్ ప్రోమో.. ఏడ్చేసిన చరణ్.. ఓదార్చిన దేబ్జానీ అక్క.. ఇవాళ ఎపిసోడ్ లో ఏం అవుతుందో..

దీని తర్వాత రోహిత్ తో దేబ్జానీ గొడవ పెట్టుకుంది. రోహిత్ పై కృష్ణుడు ఫైర్ అయ్యాడు. నీకు లీడర్ అయ్యే ఛాన్స్ లేదు, నన్ను తక్కువ అంచనా వేయకు అని ఫైర్ అయ్యాడు. రామ్ ప్రసాద్ కూడా సిల్లీ రీజన్స్ చెప్పావని రోహిత్ పై ఫైర్ అయ్యాడు. వర్షిణి మాట్లాడతా అంటే ఎవరూ వినలేదు.