
Vijay Sethupathi | కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న తాజా చిత్రం ‘బత్తా’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
© 2026 nimisham.in

Vijay Sethupathi | కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న తాజా చిత్రం ‘బత్తా’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
Vijay Sethupathi | కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న తాజా చిత్రం ‘బత్తా’ (Baththa). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘నడువుల కొంచెం పక్కతా కానుము్’, ‘సీతకాతి’ వంటి విభిన్న చిత్రాల తర్వాత విజయ్ సేతుపతి, దర్శకుడు బాలాజీ తరుణీధరన్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూర్తిగా 1960ల నాటి వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ మరియు ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన ‘జై భీమ్’ ఫేమ్ లిజో మోల్ జోస్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఇటీవల విడుదలైన ‘మగలే’ అనే తండ్రీకూతుళ్ల భావోద్వేగ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రముఖ దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తుండటం విశేషం. విజయ్ సేతుపతి వింటేజ్ లుక్‌లో బీడీ కాలుస్తూ చాలా డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తున్న ఈ సినిమా టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.








