
కోలీవుడ్ స్టార్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా 'బత్తా' టీజర్ అధికారికంగా విడుదలైంది. దర్శకుడు బాలాజీ తరుణీధరన్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ఇది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు అట్లీ సమర్పిస్తున్నారు. టీజర్లో విజయ్ సేతుపతి వింటేజ్ లుక్, యాక్షన్, ఎమోషన్ కలగలిసి కనిపించాయి. బీడీ కాలుస్తూ డిఫరెంట్ మాస్ అవతార్‌లో ఆయన కనిపించిన తీరు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 1960ల నాటి పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో పక్కా యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన లిజోమోల్ జోస్ కథానాయికగా నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 'మగలే' పాట ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందింది. సంగీతం, పీరియడ్ విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, దర్శకుడు బాలాజీ తరుణీధరన్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకులలో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. ఇప్పుడు మూడోసారి వీరి కాంబో పునరావృతం కావడం, దానికి అట్లీ సమర్పకుడిగా తోడవడంతో 'బత్తా' ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. 1960ల కాలాన్ని ప్రతిబింబించేలా ఈ చిత్ర విజువల్స్, ఆర్ట్ వర్క్ రూపొందించారు. టీజర్లో కనిపించిన యాక్షన్ సీన్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ సినిమా కథా తీవ్రతను సూచిస్తున్నాయి. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మాస్ ఎలిమెంట్స్‌ను సరికొత్తగా చూపించే ప్రయత్నం చేశారని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. విజయ్ సేతుపతి సరికొత్త లుక్, నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. 'బత్తా' చిత్రాన్ని అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్బంగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసి ప్రమోషన్లను వేగవంతం చేసింది. పీరియడ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి. విజయ్ సేతుపతి అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Found this helpful?
Share this story with your network










