
Miyapur Explosion: మియాపూర్ జీఎస్ఎం మాల్ వద్ద పేలుడు సంభవించింది. జీఎస్ఎం మాల్ సమీపంలో ఒక్కసారిగా బెలూన్లలో గ్యాస్ నింపే చిన్న సిలిండర్ పేలిపోవడంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఐస్క్రీమ్ బండి నడిపే ఓ యువకుడి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు
.