© 2026 nimisham.in
ఇంటి దొంగలను ఈశ్వరుడు కనిపెట్టలేకున్నా.. అయోధ్య రాముడైనా కనిపెట్టేస్తాడా? అయోధ్య రామమందిరం గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అత్యంత వైభవంగా ప్రారంభమైన రామాలయంలో.. భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల విరాళాలు పక్కదారి పట్టాయి. ఈ విరాళాల దుర్వినియోగం కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఏటా దాదాపు 5 కోట్ల మంది భక్తులు సందర్శించే ఈ పవిత్ర క్షేత్రంలో... భక్తులు హుండీల్లో వేసిన నగదు, బంగారం, వెండి కానుకలను పక్కదారి పట్టించారనే ఆరోపణలు వచ్చాయి. ఇవి రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపాయి. సుమారు 7 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు మాయమయ్యాయని.. మాజీ స్థానిక ఎమ్మెల్యే ఆరోపించడంతో.. ఈ వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆలయంలో నగదు లెక్కింపు పర్యవేక్షించే బృందానికి చెందిన ఎనిమిది మంది నిందితులను పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేసి.. విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటి దొంగలను ఈశ్వరుడు కనిపట్టలేడు కానీ, అయోధ్య రాముడైనా కనిపెడతాడా? అని చర్చించుకుంటున్నారు ఈ వార్తకు సంబంధించిన