
పనీర్, బంగాళాదుంప, పచ్చిమిర్చి, కార్న్ ఫ్లోర్, టొమాటో, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీడిపప్పు, గరం మసాలా, ధనియాల పొడి, క్రీమ్, ఉప్పు తగినంత, నూనె కావాల్సినంత
ముందుగా ఒక గిన్నెలో తరిగిన పనీర్, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, కార్న్ ఫ్లోర్, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోండి.
ఈ పిండిని చిన్న ఉండల్లా (కోఫ్తా) చుట్టుకుని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి సరిపడా నూనె వేసి వేడి చేయండి.
నూనె వేడి అయ్యాక అందులో కోఫ్తాలు వేసి రంగు మారే వరకు బాగా వేయించుకోండి.
ఇప్పుడు మరో కడాయిలో నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి.
అవి వేగాక అందులో టొమాటో పేస్ట్ కూడా వేసి నూనె పైకి తేలే వరకు ఉంచండి. తర్వాత కారం, ఉప్పు వేసి కలపండి.
ఇందులో ధనియాల పొడి, జీడిపప్పు పేస్ట్, సరిపడా నీళ్లు వేసి కలపండి. గ్రేవీ బాగా ఉడికాక ఇందులో గరం మసాలా, కోఫ్తాలు వేసి నిమిషం ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి.
అంతే.. రుచికరమైన పనీర్ కోఫ్తా కూర రెడీ అయినట్లే. వేడి వేడిగా అన్నంలో తింటే రుచి బాగుంటుంది.





