కోల్కతాలో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ హోటల్లో ఏసీ పేలుడు కారణంగా మంటలు చెలరేగి చిన్నారి సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున 2 గంటల ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడటంతో అనేక మంది లోపల చిక్కుకున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో మృతిచెందినవారిని బంగ్లాదేశ్ పౌరులుగా గుర్తించారు. వీరు వైద్య చికిత్స కోసం కోల్కతాకు వచ్చినట్టు అధికారులు తెలిపారు.ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఎయిర్ కండిషనర్ పేలుడు కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. అయితే కచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. నగరంలో అత్యంత రద్దీగా, జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాలలో ఒకటైన న్యూ మార్కెట్ సమీపంలోని ఫ్రీ స్కూల్ స్ట్రీట్లో ఉన్న హోటల్లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విపత్తు నిర్వహణ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలలో పాలుపంచుకుంది.అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి, చివరకు మంటలను అదుపులోకి తెచ్చారు. ‘‘దట్టమైన పొగ కారణంగా అగ్నిమాపక సిబ్బంది మెట్లు ఎక్కి పై అంతస్తులకు చేరుకోవడం కష్టమైంది... తొమ్మిది మంది మరణించగా, ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని భయపడుతున్నాం’’ అని ఒక పోలీసు అధికారి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ‘‘లోపల చిక్కుకున్న వారిని రక్షించడం, మాదానికి గల కారణాలను కనుక్కోవడం మా ప్రాధాన్యత. మంటలను అదుపుచేశాం.. చల్లార్చే ప్రక్రియ కొనసాగుతోంది’’ అని ఆయన తెలిపారు.బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో హోటల్లో ఘోర అగ్నిప్రమాదం జరిగిన రెండు రోజుల్లోనే ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆగస్టు 17 తెల్లవారుజామున తారాపీఠ్లోని హోటల్ బిదేశినిలో జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం ఎనిమిది మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఐదంతస్తుల ఈ హోటల్లోని గ్రౌండ్ ఫ్లోర్లో తెల్లవారుజామున 4:30