
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ చీఫ్, ఎస్పీ సీహెచ్.భద్రయ్య ప్రెసిడెంట్ పోలీసు మెడల్ సాధించారు. స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భద్రయ్యకు ప్రెసిడెంట్ పోలీసు మెడల్ ప్రధానం చేయనున్నారు. అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సెక్యూరిటీ చీఫ్, ఎస్పీ సీహెచ్.భద్రయ్య (Bhadrayya) ప్రెసిడెంట్ పోలీసు మెడల్ (President Police Medal) సాధించారు. స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రెసిడెంట్ పోలీసు మెడల్‌ను భద్రయ్యకు ప్రదానం చేయనున్నారు. 35 ఏళ్లకు పైగా పోలీసు సేవలో వివిధ హోదాల్లో పనిచేస్తూ.. ప్రస్తుతం ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఎస్పీ/కమాండెంట్‌గా భద్రయ్య కొనసాగుతున్నారు. వీవీఐపీల భద్రతా విభాగంలో ఆయన పనిచేస్తున్నారు. గతంలో ఇండియన్ పోలీసు మెడల్‌ను భద్రయ్య సాధించిన విషయం తెలిసిందే. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ప్రెసిడెంట్ పోలీసు మెడల్ రావడంపై భద్రయ్యకు పలువురు అధికారులు అభినందనలు తెలిపారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలి: సీఎం చంద్రబాబు అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
Read Latest AP News And Telangana News And National News