డబ్బులు తీసుకోకుండా ఓటు వేసే చైతన్యం ప్రజల్లో రావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశించారు. రాజకీయ నాయకులు ఇచ్చే డబ్బంతా లంచాల సొమ్మే అని.. ఎన్నికల్లో రూ. 2 వేలు ఇస్తే, దానికి రూ. 2 లక్షలు సంపాదించుకుంటారు అని సీఎం చెప్పారు. స్త్రీ శక్తి పథకం అమలు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా స్త్రీ శక్తికి ఏడాది - రెట్టింపయిన ఆత్మగౌరవం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటు విలువతో పాటు ప్రతిపక్షాల అరాచకాలపై ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాజధానిలోని పరేడ్ గ్రౌండ్ నుంచి ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయం వదరకు ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు."ఏ రాజకీయ నాయకుడూ ఇంటిలో నుంచి డబ్బులు తీసుకురారు. వాళ్లు ఇచ్చేదంతా లంచాల సొమ్మే.. ఎన్నికల్లో డబ్బులు తీసుకోవడం మనం ఎందుకు మానేయలేం? ఎన్నికల్లో రూ. 2 వేలు ఇస్తే, దానికి రూ. 2 లక్షలు సంపాదించుకుంటారు. అంటే వాళ్లు సంపాదించుకునే దానిలో మీకు చిల్లర విదిలిస్తారు. ఓటు కోసం మీకు రూ. 2 వేలు ఇచ్చాక వీళ్ల కోసం ఎందుకు పని చేయాలి, వీళ్ల దగ్గరకు ఎందుకు వెళ్లాలని అనే చులకన భావం నేతల్లో వస్తుందని" ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుల మనస్సులో ఉండే భావనను ప్రజలకు తెలియజేశారు.READ ALSO AP స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్.. 2025 నాటి ఓటర్ల జాబితాతోనే ఎలక్షన్స్!ఓటర్లు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని, నేతలు డబ్బులు ఇస్తుంటే, తమకు నీతి ఉందని చెప్పండని.. డబ్బులు తీసుకోకుండా ఓటేయ్యాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఎన్నికల్లో పది రూపాయలు ఎవరు ఎక్కువ ఇస్తామంటే వాళ్లకు ఓటేస్తున్నారని.. ఇది సరైన పద్ధతి కాదన్నారు. డబ్బులు తీసుకోకుండా ఓటేయ్యాలని, అవగాహన కల్పించాలని సూచించారు.ఆడవారిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టేవారిని ఎవ్వర్నీ వదిలిపెట్టమని ముఖ్యమంత్రి అన్నారు. శాంతిభద్రతలు నియంత్రణలు ఉంటేనే పెట్టుబడులు