ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లా పరిషత్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నెలాఖరు నాటికి ప్రస్తుత జిల్లాపరిషత్ సభ్యుల పదవీకాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో పదవీకాలం పూర్తి అయిన తర్వాత కొత్త జిల్లాపరిషత్‌లు ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటుపై రాష్టంలోని అన్ని జిల్లా పరిషత్ సీఈవోలతో ప్రభుత్వం సమావేశం కానుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే, రాబోయే నెలల్లో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కొత్త జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. వైసీపీ ప్రభుత్వం జిల్లా పరిషత్ ఎన్నికల తర్వాత, 2022 ఏప్రిల్‌లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే, పరిపాలనాపరమైన ఇబ్బందులను నివారించడానికి, అప్పటికే ఎన్నికైన జిల్లా పరిషత్ మండళ్లు.. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన తమ కార్యకలాపాలను కొనసాగించాయి. కొత్తగా ఏర్పడిన జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు ఇప్పటికీ ఉమ్మడి జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరవుతున్నారు.మరోవైపు కొత్త జిల్లాల కోసం ప్రత్యేక జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేసి, వాటికి ప్రత్యేక కార్యాలయ భవనాలను సమకూర్చాలని ప్రస్తుత ప్రభుత్వం ఆలోచిస్తోంది. విశాఖపట్నం జిల్లా పరిషత్ మూడు జిల్లా పరిషత్‌లుగా.. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజుగా విభజించనున్నారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొత్త జిల్లా పరిషత్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. విశాఖపట్నం జిల్లా పరిషత్ కార్యాలయం మాత్రం ప్రస్తుతం ఉన్న భవనం నుంచే తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది.విశాఖపట్నం జిల్లా పరిషత్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులలో సుమారు 60 శాతం మందిని 24 మండలాలు కలిగిన అనకాపల్లి జిల్లాకు, 30 శాతం మందిని 11 మండలాలు కలిగిన అల్లూరి సీతారామరాజు జిల్లాకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన 10 శాతం మందిని కేవలం నాలుగు మండలాలు మాత్రమే ఉన్న విశాఖపట్నం జిల్లాకు కేటాయించే అవకాశాలు