
తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ వారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఎలా ఉండబోతోంది, వర్షాలు పడతాయా లేదా అనే విషయాలపై స్పష్టమైన సూచనలు విడుదల చేసింది. అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ఈ మేరకు 7 రోజుల వెదర్ రిపోర్టును అధికారికంగా అందించాయి. ప్రస్తుతం ఉన్న రిపోర్టుల ప్రకారం ఈ వారం తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు సంబంధించి పెద్ద ప్రమాదకర హెచ్చరికలేవీ లేవు. అయితే, కొన్ని రోజులు ఉపరితల గాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాల్లో వాతావరణం కాస్త భిన్నంగా ఉండబోతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలతో పాటు యానాం ప్రాంతంలో ఆగస్టు 31 రాత్రి నుండి సెప్టెంబర్ 1 ఉదయం వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 5 వరకు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. ఈ రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో 40-50 kmph వేగంతో గాలులు వీస్తాయి. సెప్టెంబర్ 5 తర్వాత వర్షాలు ఉన్నప్పటికీ గాలుల హెచ్చరికలు ఏమీ ఉండవు. దక్షిణ కోస్తా ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో ఈ వారం మొత్తంలో ఒక్కటి లేదా రెండు చోట్ల మాత్రమే తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమ పరిధిలోని చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో