
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 13న అమరావతి అభివృద్ధిలో కీలక ఘట్టాన్ని ఆవిష్కరించారు. ఉండవల్లి వద్ద జరిగిన కార్యక్రమంలో సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశతో పాటు రెండు స్టీల్ బ్రిడ్జిలను ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన సీఎం అమరావతి రాజధాని నిర్మాణం ఇక అన్‌స్టాపబుల్ అని స్పష్టం చేశారు. 2047 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా ఈ మౌలిక వసతుల కల్పన ముందంజలో ఉందని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి వేసిన ప్రతి అడుగు రాబోయే తరాల భవిష్యత్తుకు బలమైన పునాది అని ఆయన ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అనుసంధానించే అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు (ఈ-3) నిర్మాణాన్ని మూడు దశల్లో చేపట్టారు. దొండపాడు నుంచి ప్రారంభమై రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా జాతీయ రహదారి-16కి ఇది కలుస్తుంది. మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవునా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ 1520 కోట్లు. రాజధాని ప్రాంతంలో ప్రజా రవాణాతో పాటు నగర అనుసంధానాన్ని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ మౌలిక వసతుల కల్పనకు రూపుకల్పన చేశారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన రెండో దశతో పాటు 110 మీటర్లు, 280 మీటర్ల పొడవున్న రెండు స్టీల్ బ్రిడ్జిలు ప్రారంభం కావడం విశేషం. దీంతో విజయవాడ, మంగళగిరి ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగవడమే కాకుండా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. 60 మీటర్ల వెడల్పుతో తొమ్మిది వరుసల రహదారిగా రూపుదిద్దుకున్న ఈ మార్గంలో సెంట్రల్ బీఆర్టీఎస్ కారిడార్, సర్వీస్ రోడ్లు, సైకిల్ ట్రాక్, ఫుట్‌పాత్‌లను అత్యాధునిక ప్రమాణాలతో తీర్చిదిద్దారు. మూడో దశలో తాడేపల్లి వద్ద ఎన్‌హెచ్-16కు ఎలివేటెడ్ కనెక్షన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల కోసం నెలపాడులో రూపుదిద్దుకున్న 216 క్వార్టర్లను కూడా సీఎం చంద్రబాబు అప్పగించారు. ఫలితంగా తొమ్మిది