
గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ వన్‌టౌన్ ఎస్ఐ వై.వి.వి.సత్యనారాయణను వీఆర్‌కి పంపుతూ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. డీఎస్సీలో అక్రమాల పేరుతో ఈనెల 10న గుడివాడ పట్టణంలో వైకాపా నిర్వహించిన ర్యాలీకి అనుమతి నిరాకరిస్తూ నోటీసును మాజీ మంత్రి కొడాలి నానికి ఎస్ఐ సత్యనారాయణ అందించారు. అయినా.. కొడాలి నాని పోలీసుల ఆదేశాలు ధిక్కరించి వైకాపా శిబిరం వద్దకు వెళ్లారు. ఈక్రమంలో జరిగిన పరిమాణాల్లో కొడాలి నానితో ఎస్ఐ చనువుగా మెలిగారనే ఆరోపణతో వీఆర్‌కి పంపినట్లుగా సమాచారం. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.