
పాడేరు: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు ఈ నెల 18న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సత్యనారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ అప్లికేషన్, కామర్స్, బోటనీ, జువాలజీ, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఇంగ్లీష్, లైబ్రరీ సైన్స్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు హాజరు కావాలని సూచించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.