
పంటల బీమా విషయంలో ఆలస్యం చేయకుండా రైతులు త్వరపడాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ వేదికగా పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు వెంటనే బీమా చేసుకోవాలన్నారు. ఈ నెలాఖరు వరకు సమయం ఉందని తెలిపారు. ‘‘రాష్ట్రంలోని రైతులందరినీ చేతులెత్తి కోరుతున్నా. ప్రతిపంటకీ వెంటనే బీమా చేసుకోండి. దీనికి కట్టాల్సిన నగదు కూడా తక్కువ మొత్తంలోనే ఉంది. ఎమ్మెల్యేలు ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలి’’ అని మంత్రి కోరారు. ఈ వార్త చదివారా: సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు.. గాలింపు ముమ్మరం చేయాలని హోం మంత్రి ఆదేశం