© 2026 nimisham.in

ఎటు చూసినా తుపాకులతో కాపలా కాసే బలగాలు.. రెప్పపాటు కాలం కూడా కన్ను మూయని నిఘా నేత్రాలు.. సాధారణ పౌరుడు అడుగు పెట్టాలన్నా వేల ప్రశ్నలు ఎదురయ్యే అత్యంత కట్టుదిట్టమైన మిలిటరీ జోన్! అలాంటి హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్ స్థావరంలో ఎవరూ ఊహించని దిగ్భ్రాంతికర ఘటన వెలుగు చూసింది. శత్రువుల గుండెల్లో నిద్రపోయే ఆర్మీ అధికారుల స్థావరంలో చొరబడిన కొందరు కళ్లుచేదిరే చోరీకి ఒడిగట్టారు. పకడ్బందీ భద్రత ఉండే ఆయుధాగారంలోకే జొరబడి ఏకంగా 12 ప్రమాదకర తుపాకులను మాయం చేయడం ఇప్పుడు రక్షణ రంగాన్ని షాక్కు గురిచేస్తోంది.ఏకే-47లతో సహా ఆయుధాలు గాయబ్!ఈ చోరీ సాదాసీదాగా జరగలేదు. అతికొద్ది మందికి మాత్రమే ప్రవేశం ఉండే వెపన్స్ స్టోర్ రూమ్ తలుపుల తాళాలను అత్యంత చాకచక్యంగా పగలగొట్టారు. క్షణాల వ్యవధిలో 4 అత్యాధునిక ఏకే-47 రైఫిళ్లు, 6 పిస్టళ్లు, ఒక ఇన్సాస్ (INSAS) రైఫిల్తో పాటు మరో కీలక తుపాకీని ఊడ్చేశారు. వాటితో పాటు వాటిలోకి వాడే బుల్లెట్లను కూడా పట్టుకెళ్లారు. పొద్దున్నే డిపో తెరిచి చూసిన సైనిక సిబ్బందికి ఖాళీగా ఉన్న స్టాండ్లను చూసి దిమ్మతిరిగిపోయింది. ఆర్మీ స్థావరంలోనే ఈ స్థాయిలో ఆయుధాలు మాయమవ్వడం జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపుతోంది.AK 203: ఆర్మీని శాసించబోతున్న షేర్ గన్, నిమిషానికి 700 రౌండ్ల ఫైరింగ్లోపలి స్కెచ్ లేకపోతే సాధ్యమేనా?ఈ దారుణం వెనుక అసలు మాస్టర్మైండ్ ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు ప్రతీ ఒక్కరిని వేధిస్తోంది. ఆర్మీ కాంపౌండ్ చుట్టూ ఉండే ఎత్తైన గోడలు, భద్రతా గేట్లు, నిరంతరం తిరిగే పెట్రోలింగ్ టీమ్లను దాటుకుని బయటి వ్యక్తులు రావడం దాదాపు అసాధ్యం. అసలు ఆయుధాల గది ఎక్కడ ఉంది? తాళాలు ఎవరి వద్ద ఉంటాయి? సిబ్బంది ఏ సమయంలో మారతారు? అనే పక్కా సమాచారం ఉన్న లోపలి వ్యక్తుల హస్తం లేకుండా ఈ ఆపరేషన్ సాధ్యం కాదని విచారణ అధికారులు బలంగా అనుమానిస్తున్నారు
ఎటు చూసినా తుపాకులతో కాపలా కాసే బలగాలు.. రెప్పపాటు కాలం కూడా కన్ను మూయని నిఘా నేత్రాలు.. సాధారణ పౌరుడు అడుగు పెట్టాలన్నా వేల ప్రశ్నలు ఎదురయ్యే అత్యంత కట్టుదిట్టమైన మిలిటరీ జోన్! అలాంటి హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్ స్థావరంలో ఎవరూ ఊహించని దిగ్భ్రాంతికర ఘటన వెలుగు చూసింది. శత్రువుల గుండెల్లో నిద్రపోయే ఆర్మీ అధికారుల స్థావరంలో చొరబడిన కొందరు కళ్లుచేదిరే చోరీకి ఒడిగట్టారు. పకడ్బందీ భద్రత ఉండే ఆయుధాగారంలోకే జొరబడి ఏకంగా 12 ప్రమాదకర తుపాకులను మాయం చేయడం ఇప్పుడు రక్షణ రంగాన్ని షాక్‌కు గురిచేస్తోంది.ఏకే-47లతో సహా ఆయుధాలు గాయబ్!ఈ చోరీ సాదాసీదాగా జరగలేదు. అతికొద్ది మందికి మాత్రమే ప్రవేశం ఉండే వెపన్స్ స్టోర్ రూమ్ తలుపుల తాళాలను అత్యంత చాకచక్యంగా పగలగొట్టారు. క్షణాల వ్యవధిలో 4 అత్యాధునిక ఏకే-47 రైఫిళ్లు, 6 పిస్టళ్లు, ఒక ఇన్సాస్ (INSAS) రైఫిల్‌తో పాటు మరో కీలక తుపాకీని ఊడ్చేశారు. వాటితో పాటు వాటిలోకి వాడే బుల్లెట్లను కూడా పట్టుకెళ్లారు. పొద్దున్నే డిపో తెరిచి చూసిన సైనిక సిబ్బందికి ఖాళీగా ఉన్న స్టాండ్లను చూసి దిమ్మతిరిగిపోయింది. ఆర్మీ స్థావరంలోనే ఈ స్థాయిలో ఆయుధాలు మాయమవ్వడం జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపుతోంది.AK 203: ఆర్మీని శాసించబోతున్న షేర్ గన్, నిమిషానికి 700 రౌండ్ల ఫైరింగ్లోపలి స్కెచ్ లేకపోతే సాధ్యమేనా?ఈ దారుణం వెనుక అసలు మాస్టర్‌మైండ్ ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు ప్రతీ ఒక్కరిని వేధిస్తోంది. ఆర్మీ కాంపౌండ్ చుట్టూ ఉండే ఎత్తైన గోడలు, భద్రతా గేట్లు, నిరంతరం తిరిగే పెట్రోలింగ్ టీమ్‌లను దాటుకుని బయటి వ్యక్తులు రావడం దాదాపు అసాధ్యం. అసలు ఆయుధాల గది ఎక్కడ ఉంది? తాళాలు ఎవరి వద్ద ఉంటాయి? సిబ్బంది ఏ సమయంలో మారతారు? అనే పక్కా సమాచారం ఉన్న లోపలి వ్యక్తుల హస్తం లేకుండా ఈ ఆపరేషన్ సాధ్యం కాదని విచారణ అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. సైన్యంలోనే బ్లాక్ షీప్స్ ఉన్నాయా లేదా వారిని వాడుకుని బయటి ముఠాలు ఈ ప్లాన్ అమలు చేశాయా అనే కోణంలో విచారణ ముమ్మరమైంది.ఊహకందని అస్త్రం: చైనా వినాశకర వ్యూహం! అమెరికానే టార్గెట్..రంగంలోకి ఇంటెలిజెన్స్!ఈ ఘోర భద్రతా లోపంపై ఆర్మీ అధికారులు వెంటనే సికింద్రాబాద్‌లోని బోల్లారం పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు, ఆర్మీ ఇంటెలిజెన్స్ బృందాలు ఉమ్మడిగా దర్యాప్తు ప్రారంభించాయి. కంటోన్మెంట్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలన్నింటినీ జల్లెడ పడుతున్నారు. ఈ ఆయుధాలు గనక బయట నేరస్థులు లేదా తీవ్రవాద ముఠాల చేతుల్లోకి వెళ్తే జరిగే వినాశనం ఊహకే అందదు. దీంతో నగరంలో హైఅలర్ట్ ప్రకటించి, అణువణువూ గాలిస్తున్నారు.