
Air India | దిల్లీ: ఎయిరిండియా విమానం తీవ్రమైన కుదుపులకు గురైన ఘటన అనంతరం నిర్వహించిన డోప్ టెస్టులో పైలట్ విఫలమయ్యాడు. పైలట్ గంజాయి సేవించినట్లు డ్రగ్ టెస్టులో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. థాయ్లాండ్ నుంచి దిల్లీకి వస్తున్న విమానం ఆగస్టు 4న తీవ్ర కుదుపులకు లోనైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారు. ఆ సమయంలో ప్రయణికులు, సిబ్బంది కలిపి 145 మంది విమానంలో ఉన్నారు. ఈ ఘటన అనంతరం పైలట్లు ఇద్దరికీ డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. తొలి పరీక్షలోనే పైలట్-ఇన్-కమాండ్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. దీని తర్వాత సైకోయాక్టివ్ పరీక్షను నిర్వహించగా.. దాని ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆగస్టు 9న ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలోనే డ్రగ్ టెస్టులో గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయ్యిందని విశ్వసనీయ వర్గాలు వెల్లంచినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. మరోవైపు విచారణ నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు పైలట్లను డీజీసీఏ రోస్టర్ నుంచి తప్పించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు