Chiranjeevi
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక విప్లవం, ఒక ప్రభంజనం. సామాన్య కుటుంబంలో జన్మించి, తన కష్టం, అంకితభావం, అద్భుతమైన నటన, డ్యాన్సులతో ఇండస్ట్రీలో ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు లాంటి వారు ఇండస్ట్రీని ఏలుతున్న కాలంలో ఒక సామాన్యుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన తనదైన స్టైల్, మాస్ అప్పీల్, బ్రేక్ డ్యాన్సులతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో 'మెగాస్టార్'గా నిలిచిపోయారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ కొత్త తరానికి ఆదర్శంగా నిలిచారు.ఈ నెల 22న చిరంజీవి 71వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా అభిమానులు దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ పుట్టినరోజును మరింత స్పెషల్ చేసేందుకు ఆయన లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోషూట్‌లో బ్లాక్ టీషర్ట్, స్టైలిష్ గాగుల్స్‌తో చిరంజీవి సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. 71 ఏళ్ల వయసులోనూ చిరంజీవి ఎనర్జీ, గ్రేస్ చూసి అభిమానులు, సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఆయన లేటెస్ట్ ఫోటోలు చూస్తుంటే ఆయనకు వయసు పెరగడం లేదని, తగ్గిపోతోందని నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. ఆయన ఎనర్జీ, డైనమిజం చూసి అభిమానులు మురిసిపోతున్నారు.* నాగార్జున బర్త్‌డే స్పెషల్… 4K హంగులతో మళ్లీ మురిపించనున్న ‘గీతాంజలి’‘ మెగా 158 ’ బిగ్ అప్డేట్'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న 'మెగా 158' చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక అదిరిపోయే బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. ఆగస్టు 22న సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో కూడిన గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇటీవల ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్లో చిరంజీవి లీక్ చేసిన సంగతి తెలిసిందే. పుట్టినరోజుకు టీజర్ ఉంటుందని చెబుతూనే.. టైటిల్‌కి సంబంధించి