
ప్రతి ఒక్కరికీ ఉదయం కళ్లు తెరిచినప్పటి నుంచి రాత్రి నిద్రలోకి జారుకునే వరకు సెల్‌ఫోన్‌తోనే సహవాసం. వీధి వ్యాపారి నుంచి బహుళజాతి సంస్థల అధినేతల వరకు అందరి సమయాన్ని డిజిటల్ ప్రపంచం శాసిస్తోంది... ఈ వివరాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య దాదాపు 5.24 నుంచి 5.66 బిలియన్లు. యువతలో డిజిటల్ వ్యసనం ఒక నిశ్శబ్ద సంక్షోభంగా మారుతోందని 2026 ఆర్థిక సర్వే హెచ్చరించింది. సోషల్ మీడియాకు బానిసవ్వడం వల్ల 65% మంది భారతీయ యువత నిద్ర సమయం గణనీయంగా తగ్గిపోయింది. విపరీతమైన స్క్రోలింగ్‌ల వల్ల 32% మంది అలసటను, ఏకాగ్రత లోపాన్ని ఎదుర్కొని మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. 2024లో భారతీయులు స్మార్ట్ఫోన్లపై ఏకంగా 1.1 లక్షల కోట్ల గంటలు గడిపినట్లు వార్షిక నివేదిక వెల్లడించడం విపరీత ధోరణికి నిదర్శనం. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.