
టాలీవుడ్ నటుడు రఘువరన్, రోహిణి విడాకుల నేపథ్యం, వారి వ్యక్తిగత జీవితం, రఘువరన్ మరణం వెనుక గల కారణాలపై నటుడు బాలాజీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే సంబంధాలను కలిపి ఉంచడంలో తాను నమ్ముతానని, విడదీయడాన్ని కాదని బాలాజీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “దారాన్ని తెంపడం చాలా సులభం, కానీ అతికించడం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు” అని ఆయన చెప్పుకొచ్చారు. జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని, సామరస్యంగా ఉండాల్సిన అవసరాన్ని చెప్పారు. ఈ విషయంలో మహిళల పాత్ర, బాధ్యత చాలా ముఖ్యమని ఆయన అన్నారు. రఘువరన్, రోహిణిల విడాకులు, విడిపోవడం కేవలం డ్రగ్స్ వ్యసనం వల్లేనా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నకు, రఘువరన్కు వ్యసనం ఉన్నప్పటికీ, తాను ప్రత్యక్షంగా చూడలేదని, ఇతరుల ద్వారా తెలిసిన విషయమని బాలాజీ స్పష్టం చేశారు. అయితే, రఘువరన్ విషయంలో రోహిణి ఇంకాస్త ఆలోచించి ఉంటే, ఆయన నేటికీ బ్రతికి ఉండేవారని బాలాజీ తెలిపారు. రఘువరన్ మరణానికి ప్రధాన కారణం తన కొడుకు దూరం అవ్వడమేనని బాలాజీ లోతైన కారణాన్ని వెల్లడించారు. “నా రక్తం, నా కొడుకు నా దగ్గర లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి?” అనే ఆలోచనతో రఘువరన్ తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయాడని వివరించారు. ఎక్కువ మంది చదివినవి : Tollywood : పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నాం.. అప్పుడే విడిపోవాలని అనుకున్నాం.. టాలీవుడ్ నటి.. రఘువరన్ తన వ్యక్తిగత జీవితంలో చాలా మంచి వ్యక్తి అని, ఎదుటివారిని అమితంగా ప్రేమించేవాడని, తన దగ్గర ఉన్నదానిని పట్టించుకోడని, మంచి మనసున్న మనిషి అని బాలాజీ అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని, చనిపోయే సమయానికి ఆయన పరిస్థితి బాగా లేదని తెలిపారు. అయితే, ఈ కష్టసమయంలో రోహిణి వెనుకబడి నిలబడ్డారని, రఘువరన్ మరణానంతరం ఆయన ఆర్థిక బాధ్యతలను తనపై వేసుకుని, అన్నీ సరిదిద్దుకుని మళ్ళీ సున్నా నుండి తన జీవితాన్ని మొదలుపెట్టారని బాలాజీ వెల్లడించారు. రోహిణి