
కొందరు చిన్న చిన్న శబ్దాలకే చిరాకుపడుతుంటారు. కోపంతో అక్కడ్నుంచి వెళ్లిపోతుంటారు. ఇలా చేయడం కూడా ఓ రకమైన రుగ్మతే. దీన్నే ‘మిసోఫోనియా’ అని పిలుస్తారు. ఈ సమస్య సాధారణంగా బాల్యం లేదా కౌమార దశలో ప్రారంభమవుతుంది. మిసోఫోనియా ఓ ప్రత్యేకమైన మానసిక, నరాల సంబంధిత రుగ్మత. ఇది గ్రీకు పదం. మిసోస్ అంటే ‘ద్వేషం’, ఫోనోస్ అంటే ‘ధ్వని’ అని అర్థం. దీన్ని సాధారణంగా శబ్దాల పట్ల విపరీతమైన ద్వేషం అని పిలుస్తారు. ఇది ఉన్నవారికి కొన్ని రోజువారీ శబ్దాలు కూడా కోపం, ఆందోళన, అసహ్యం లేదా పారిపోవాలనే భావనను కలిగిస్తాయి. ఇది వినికిడి సమస్య కాదు. ఆ శబ్దాలను మెదడు విశ్లేషించే విధానంలో తేడా వల్ల ఇలా జరుగుతుంది. ఆహారాన్ని శబ్దం చేస్తూ నమలడం, చప్పరించడం, గుటకలు వేయడం, గాలి పీల్చడం, గురక, ముక్కు చీదడం, ఆవలింతలు, ఊపిరి పీల్చడం, పెన్సిల్ కొట్టడం, పెన్ క్లిక్ చేయడం, కీబోర్డ్ టైపింగ్, టేబుల్‌పైన వేళ్లతో డ్రమ్ చేయడం, గొంతు సవరించుకోవడం, గడియారం టిక్-టిక్ శబ్దం, చెంచాలు, ప్లేట్ల శబ్దం, అడుగుల శబ్దాలు. కుక్కలు మొరగడం, పిల్లులు నాకడం, పక్షుల అరుపులు వంటివీ వీరికి చిరాకు తెప్పిస్తాయి. మిసోఫోనియాకు ఖచ్చితమైన కారణాల్లేవు. మెదడులోని ఇన్సులా ప్రాంతం అధికంగా క్రియాశీలం కావడం వల్ల ఏర్పడొచ్చని వైద్యులు చెబుతున్నారు. మెదడులోని యాంటీరియర్ ఇన్సులర్ కార్టెక్స్(ఏఐసీ) అనే భాగం భావోద్వేగాలను, ఇంద్రియ జ్ఞానాన్ని నియంత్రిస్తుంది. మిసోఫోనియా బాధితుల్లో ఈ భాగం ట్రిగ్గర్ శబ్దాలు విన్నప్పుడు అతిగా స్పందిస్తుంది. దీనివల్ల మెదడు ఆ సాధారణ శబ్దాలను ఓ ప్రమాదకరమైన సంకేతంగా భావించి, రక్షణ చర్యగా కోపాన్ని లేదా భయాన్ని ప్రేరేపిస్తుంది. మిసోఫోనియాను నిర్ధారించడానికి ప్రస్తుతం ఏ పరీక్ష లేదు. కానీ, రోగి లక్షణాలు, శబ్దాలకు సంబంధించిన ప్రతిచర్యల ద్వారా తెలుసుకోవచ్చని పరిశోధనల్లో తేలింది. ఆడియలాజికల్ మూల్యాంకనం కూడా అవసరం. మిసోఫోనియా యాక్టివేషన్ స్కేల్(ఎంఏఎస్-1) ద్వారా వ్యక్తి స్వయంగా నివేదించే లక్షణాల తీవ్రతను