
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అరుదైన కాంబో మరోసారి రిపీట్ కానుంది. యంగ్ టైగర్ జూనయిర్ ఎన్టీఆర్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో సినిమా రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.
Jun 29 2026 5:35 PM | Updated on Jun 29 2026 5:46 PM
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అరుదైన కాంబో మరోసారి రిపీట్ కానుంది. యంగ్ టైగర్ జూనయిర్ ఎన్టీఆర్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో సినిమా రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్‌గా ప్రకటించారు. త్రిశూలంతో ఉన్న ప్రత్యేక పోస్టర్‌ను షేర్ చేశారు. ది సన్ ఆఫ్ శివ, ది ప్రైడ్ ఆఫ్ పార్వతి, ది ఎటర్నల్ కమాండర్.. త్రివిక్రమ్‌తో మరోసారి అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ మూవీని పురాణాల ఆధారంగా తెరకెక్కించనున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కార్తికేయుడిగా కనిపించనున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించనున్నారు.
కాగా.. గతంలో వీరిద్దరి కాంబోలో అరవింద సమేత వీరరాఘవ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. 2018లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.165 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. తాజాగా వీరిద్దరు మరోసారి జతకట్టడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ అరుదైన కాంబోలో మరో హిట్ కొడతారా టాలీవుడ్లో చర్చ మొదలైంది.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ (ఫోటోలు)
రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 ఫైనల్.. ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)
హ్యాపీ జర్నీ అంటున్న...నటి రూప శ్రీనివాస్ (ఫొటోలు)
#RAPO23 : సందడిగా రామ్ కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)
"ఇది అంతా కావాలనే చేస్తున్నారు" అంటే అర్థం ఇదే.. వైరల్ కామెంట్స్!
"పవన్ కళ్యాణ్.. నిద్ర పోయావా? రైతులకు అన్యాయం జరిగితే మాట్లాడవా?"
పేరుపాలెం బీచ్‌లో విషాదం.. అసలు ఏం జరిగింది?
ఉద్యోగుల కష్టాలు తీరతాయి అనుకున్నాం.. మమ్మల్ని నట్టేట ముంచారు