
ప్రముఖ నటుడు, దర్శకుడు కె,.భాగ్యరాజ్ మరణం పట్ల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు నటి రాధిక. భాగ్యరాజ్ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి ఆమె దగ్గరుండి అన్ని కార్యక్రమాలను...
ప్రముఖ నటుడు, దర్శకుడు కె,.భాగ్యరాజ్ మరణం పట్ల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు నటి రాధిక. భాగ్యరాజ్ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి ఆమె దగ్గరుండి అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించారు.
ప్రముఖ నటుడు, దర్శకుడు కె,.భాగ్యరాజ్ మరణం పట్ల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు నటి రాధిక. భాగ్యరాజ్ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి ఆమె దగ్గరుండి అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అలాగే భాగ్యరాజ్ ఇంటి దగ్గర, తుది వీడ్కోలు సమయంలో ఎదురైన సంఘటనలపై ఆమె మండిపడ్డారు. మనిషి మరణించి బాధలో ఉన్న ఇంటి ముందు చూడటానికి వచ్చిన కొందరు చేసిన హంగామాపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం రాధిక భావోద్వేగంగా ఓ పోస్ట్ చేశారు.
‘యాభై ఏళ్లుగా కొనసాగిన ప్రత్యేకమైన స్నేహానికి ఇదే నా చివరి వీడ్కోలు. గ్రేట్ క్రియేటర్, పరిణతి చెందిన రచయితకు, సినిమాకు అద్భుతమైన హద్దులు గీసిన వ్యక్తికి కన్నీటి వీడ్కోలు. ఎన్నో నవ్వులు, అద్భుతమైన క్షణాలు, షూటింగ్ మెమోరీస్ పంచుకున్న వ్యక్తి ఆయన. నా కుటుంబానికి ఎప్పుడూ అండగా నిలిచారు. మా పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నారు. భాగ్యరాజ్ మరణం ఆయన కుటుంబానికి, ేస్నహితులకు, సహచరులకు, అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది’ అని అన్నారు.
భాగ్యరాజ్ ఇంటి ముందు చోటు చేసుకున్న ఓ సంఘటన విషయంలో రాధిక మండిపడ్డారు. 'భాగ్యరాజ్ మరణంతో కుటుంబం అంతా దుఃఖసాగరంలో మునిగిపోతే ఆ బాధలో ఉన్నవారిని ఓదార్చాల్సింది పోయి ఫొటోలు, వీడియోలు అంటూ గందరగోళం సృష్టించారు. నిశబ్ధంగా నివాళులు అర్పించాల్సిన ప్రాంతాన్ని ఒక సర్కస్‌లా మార్చేశారు. ఆ క్షణంలో అక్కడ ఉన్నవారిని చూస్తే జనాల్లో సున్నితత్వం పోయిందా? మానవత్వం అనుమరుగైపోయిందా.. ఎక్కడికి వచ్చి ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నది అర్థం కాలేదు. ఇలాంటి సందర్భాల్లో మరణించినవారికి తగిన గౌరవం దక్కాలి. దీని కోసం ప్రభుత్వం, సినీ పరిశ్రమ సరైన మార్గదర్శకాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలా చేస్తేనే దివంగత ఆత్మకు తగిన గౌరవం దక్కుతుంది’ అని రాధిక పేర్కొన్నారు.