టాలీవుడ్లో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్‌గా, పబ్లిసిటీ డిజైనర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు శ్రీనివాస్ కుమార్ (ఎస్కేఎన్). కెరీర్ ప్రారంభంలో జర్నలిస్ట్‌గా ప్రస్థానాన్ని మొదలుపెట్టి..
ఆ తర్వాత పీఆర్వోగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అల్లు అరవింద్, బన్నీ వాస్ వంటి దిగ్గజాల వద్ద ఎంతో అనుభవాన్ని గడించారు. ఆ నమ్మకంతోనే 'మాస్ మూవీ మేకర్స్' బ్యానర్‌ను స్థాపించి ‘టాక్సీవాలా’, ‘3 రోజెస్’ (వెబ్ సిరీస్), ‘బేబీ’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో అభిరుచి గల నిర్మాతగా ఎదిగారు. ఇప్పటివరకు తెర వెనుక ఉండి సినిమాలను నడిపించిన ఈ క్రేజీ ప్రొడ్యూసర్, ఇప్పుడు మొదటిసారి కెమెరా ముందుకు వచ్చి నటుడిగా సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు.‘మసూద’ వంటి చిత్రాలతో వర్సటైల్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ , కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కాంబినేషన్లో ఒక రూరల్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. ప్రముఖ డైలాగ్ రైటర్ కృష్ణ చేపూరి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో ఎస్కేఎన్ ఒక కీలకమైన, హిలేరియస్ పాత్రను పోషిస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. కథను మలుపు తిప్పే ఈ వినోదాత్మక క్యారెక్టర్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం.* లెనిన్’ వర్సెస్ ‘శ్రీనివాస మంగాపురం’ క్లాష్ క్లోజ్.. ఘట్టమనేని వారసుడి తొలి చిత్రం వాయిదా? కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను నమ్ముకొని భారీ లాభాలను ఆర్జించడంలో ఎస్కేఎన్ రూటే వేరు. ‘ఈ రోజుల్లో’, ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’, ‘ప్రతిరోజూ పండగ’ వంటి చిత్రాలకు కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఆయన, ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ చిత్రాలను ప్లాన్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అయిన ఎస్కేఎన్, పరిశ్రమలోని సమస్యలపై కూడా సోషల్ మీడియాలో నిలదీస్తూ యాక్టివ్‌గా ఉంటారు. అలాంటి పవర్ఫుల్ పర్సనాలిటీ, ఇప్పుడు నటుడిగా మారి ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారోనని ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. స్క్రీన్ వెనుక సంచలనాలు సృష్టించే ఎస్కేఎన్ స్క్రీన్ పైన కూడా నటుడిగా తన మార్క్ చూపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.ఎస్కేఎన్ నిర్మాతగా తన చిత్రాలతోనే కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలతోనూ తరుచూ వార్తల్లో నిలుస్తుంటారు. 'సింగిల్' సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరోయిన్ కేతిక శర్మపై ఆయన చేసిన బాత్రూమ్ కామెంట్స్ అప్పట్లో తీవ్ర విమర్శలకు గురయ్యాయి. తాము తెలుగు రాని హీరోయిన్లను అభిమానిస్తామని, తెలుగు వచ్చిన అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏమవుతుందో ఈమధ్యనే తమకు అర్థమయ్యిందని, ఇక నుంచి తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించకూడదని తాను, డైరెక్టర్ సాయిరాజేశ్ నిర్ణయించుకున్నామని ‘రిటర్న్ ఆఫ్ డ్రాగన్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.