
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాట తప్పం మడమ తిప్పం’ అనే మాయ మాటలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘరానా మోసగాడు జగన్ అని...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాట తప్పం మడమ తిప్పం’ అనే మాయ మాటలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘరానా మోసగాడు జగన్ అని ఎద్దేవా చేశారు.
విజయనగరం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (AP Minister Kondapalli Srinivas) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాట తప్పం మడమ తిప్పం’ అనే మాయ మాటలతో ప్రజలను మోసం చేసిన ఘరానా మోసగాడు జగన్ అని ఎద్దేవా చేశారు. ఈరోజు(ఆదివారం) విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
సీఆర్ర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ పేరుతో మరో పొలిటికల్ డ్రామాకు గొడ్డలి పార్టీ తెరలేపిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సెటైర్లు గుప్పించారు. వైసీపీ నాయకుల కుట్రలకు ఆ ప్రాంత అన్నదాతలు బుద్ధి చెప్పారని అన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు వైఖరీ మార్చుకోవాలని హితవు పలికారు. రాజధాని ప్రాంత రైతులను అధికారంలో ఉండగా ముప్పు తిప్పలు పెట్టిన ఆ పార్టీకి ఊసరవెల్లిలా రంగులు మార్చటం అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు.
రాజధాని ప్రారంభమైతే కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందనే ఉద్దేశంతో కుట్ర పన్ని అల్లర్లు సృష్టించడానికి గొడ్డలి పార్టీ కొత్త ప్రయత్నాలు చేస్తోందని మంత్రి ధ్వజమెత్తారు. అమరావతిని వైసీపీ నాయకులు అధికారంలో ఉండగా మోసం చేశారని ఆగ్రహించారు. ఈ నేపథ్యంలో అన్నదాతలు గొడ్డలి పార్టీ నేతలను అడ్డుకుంటే ఆ వివాదాన్ని కూటమి ప్రభుత్వానికి ఆపాదించడం ఏంటి ? అని ప్రశ్నించారు. ప్రజల్లో సానుభూతి కోసం తెరలేపిన వైసీపీ బూటకపు పర్యటనలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
తప్పు ఎవరు చేసినా తప్పే.. కులం ఆధారంగా చూడొద్దు: పవన్ కల్యాణ్
‘రాజధాని ద్రోహి జగన్, గో బ్యాక్’ అంటూ అమరావతి రైతుల నినాదాలు
Read Latest AP News And Telangana News And National News