
సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న పనులు ఇప్పుడు సమాజంలో చర్చకు దారి తీస్తున్నాయి. అనేక ప్రమాదాల దారిపడుతున్నాయి. ఇటీవల హైదరాబాద్కు చెంది
సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు చేస్తున్న పనులు ఇప్పుడు సమాజంలో చర్చకు దారి తీస్తున్నాయి. అనేక ప్రమాదాల దారిపడుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఉప్పల్ బాలు అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనంతగిరి అడవి ప్రాంతంలో చేసిన వెర్రి చేష్టలు తీవ్ర వివాదానికి దారితీశాయి.కార్ టాప్ పై స్టంట్స్ చేసిన ఉప్పల్ బాలు ప్రముఖ పుణ్యక్షేత్రం అనంతగిరి ఘాట్ రోడ్డులో వేగంగా వెళ్తున్న మహీంద్రా థార్ కారు బానెట్ మీద, టాప్ మీద కూర్చొని ప్రమాదకర స్టంట్లు చేస్తూ రీల్స్ వీడియోలు తీశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు, దేవాలయ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర ప్రాంతంలో, దట్టమైన అటవీ ప్రాంత రోడ్డులపై ఇలాంటి విన్యాసాలు చేయడం పర్యావరణానికి, వన్యప్రాణులకు, ప్రయాణికుల భద్రతకు ముప్పు తెస్తోందని మండిపడ్డారు.కేసు నమోదు చేసిన అటవీ అధికారులు ఈ విషయం గుర్తించిన వికారాబాద్ అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించారు.అనంతగిరి ప్రాంతం అటవీ చట్టాల పరిధిలోకి వస్తుందని, ఇక్కడ ప్రమాదకర చర్యలు, శబ్ద కాలుష్యం చేయడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. ఉప్పల్ బాలు మరియు అతని సహచరులపై అటవీ నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. ఈ స్టంట్ల కోసం వాడిన థార్ కారును నంబర్ ప్లేట్ ఆధారంగా గుర్తించి, వాహన యజమాని, డ్రైవర్‌ను విచారించనున్నారు.అటవీ ప్రాంతాల్లో పర్యాటకులకు గట్టి వార్నింగ్ అవసరమైతే వాహనాన్ని సీజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలో అటవీ అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కేవలం వ్యూస్, ఫాలోవర్ల కోసం పర్యావరణానికి, అటవీ జంతువులకు ముప్పు తెచ్చే పనులు చేస్తే ఎవరైనా కఠినంగా శిక్షించబడతారని స్పష్టం చేశారు. అనంతగిరి ఘాట్ రోడ్డు ప్రయాణికుల భద్రత, పర్యాటకులు, భక్తులు సురక్షితంగా తిరగడానికి అనువైన వాతావరణం కాపాడటం తమ బాధ్యత అని అధికారులు తెలిపారు.బంజారాహిల్స్ పీఎస్ కు వింత పంచాయితీ.. వాట్సప్ గ్రూప్లో యాడ్ చేయట్లేదని మహిళ ఫిర్యాదు!సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కంటెంట్ క్రియేషన్ లో జాగ్రత్త ఈ ఘటన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ కంటెంట్ క్రియేషన్ లో జాగ్రత్తగా ఉండాలని మరోసారి గుర్తు చేస్తోంది. వైరల్ అవ్వాలనే ఆతృతలో చట్టాలు, నిబంధనలు, పర్యావరణ రక్షణను పక్కనబెట్టకూడదని ఈ సంఘటన గుర్తు చేస్తోంది.ఈ వ్యవహారంపై అటవీ శాఖ చర్యలు తీసుకోవడంతో స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.