
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Monkey repairing bicycle funny video: సోషల్ మీడియాలో ప్రతిరోజు బోలేడు వీడియోలు కుప్పలు తెప్పలుగా వైరల్‌గా మారుతాయి. కొన్ని వీడియోలు చూసేందుకు ఆశ్చర్యకరంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు చాలా నవ్వులు తెప్పించేవిగాను ఉంటాయి. ఈ క్రమంలో కోతులు చాలా ఫన్నీగా ప్రవర్తిస్తాయి. ముఖ్యంగా ఒకప్పుడు గ్రామాల్లోనే ఎక్కువగా కన్పించే కోతులు ప్రస్తుతం పట్టణాల్లోను దర్శనమిస్తున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న కోతులు తమ ప్రతాపం చూపిస్తాయి. ముఖ్యంగా కోతులు గుంపులు, గుంపులుగా దాడులు చేస్తాయి. ఇంట్లో డోర్ పెట్టడం ఏ మాత్రం మర్చిపోయిన వెంటనే అవి దాడి చేసి తినేపదార్థాలు నోట్లో వేసుకుని , చేతిలో పట్టుకుని రెప్పపాటులో మాయమౌతాయి. కనీసం పట్టుకొవడానికి కూడా కన్పించవు.
చాలా సార్లు కోతులు మనుషులపై కూడా దాడులు చేస్తాయి. అయితే.. కొంత మంది కోతుల్ని మచ్చిక చేసుకుని తమ ఇళ్లలోని పనుల్ని చేయిస్తారు. ఈ క్రమంలో కోతులు కొన్ని చోట్ల పేపర్లు తెవడం, కూరగాయలు తీసుకొని రావడం, ఇంట్లోని పనులు చేయడం వంటి ఘటనలు చూశారు.
ఈ క్రమంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక వానరం ఏంచక్కా సైకిల్ కు పంక్చర్ వేస్తుంది. అది చాలా సీరియస్ గా తన నోటితో టైర్ ను బైటకు తీసి మరీ పంక్చర్ చేస్తుంది. అక్కడున్నవారు కొంత మంది దీన్ని జాగ్రత్తగా చూస్తున్నారు. సైకిల్ ను కొంత పడుకొబెట్టి వెనుక టైర్ కు కోతి పంక్చర్ చేస్తుంది.
Read more: Snake Video: ఓర్నీ.. ఇదెక్కడి విడ్డూరం.. చనిపోయినట్లు నటిస్తున్న పాము.!. అసలు మ్యాటర్ తెలిస్తే షాక్.. అరుదైన వీడియో..
ఈ వింత ఘటనను అక్కడున్న వారు చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కోతి మెకానిక్ లా మారిందని కొంత మంది ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.