
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Snake Acting as death funny video: పాముల రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. నెటిజన్లు కూడా కోబ్రా వీడియోలను చాలా ఎగబడి చూస్తున్నారు. ఒకప్పుడు కోబ్రా కన్పిస్తే భయంతో కిలోమీటర్ దూరం పారిపోయే వారు కూడా ఇప్పుడు వాటితో రీల్స్, స్టంట్ లు చేస్తున్నారు. ప్రతిరోజు పాములు ఎక్కడ కన్పించిన వెంటనే తమ ఫోన్ లతో షూట్ లు చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల్లో కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు ఉన్నాయి.
ఈ క్రమంలో ప్రస్తుతం ఒక కోబ్రా చాలావిచిత్రంగా ప్రవర్తించింది. అది కింద పడిపోయి చనిపోయినట్లు నటించింది. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి పాక్కుంటూ అక్కడి నుంచి పారిపోయేందుకు కూడా ప్రయత్నించింది. ఈ ఘటనను చూసి అక్కడి వారు అవాక్కయ్యారు. దాని వంక చూడకుండా వదలేయగానే ఆ పాము చెట్లలోనికి వెళ్లి పారిపోయేందుకు ప్రయత్నించింది.
తోక పట్టుకుని ఆపగానే చనిపోయినట్లు డ్రామాలు ఆడింది. మరీ ఈ వెరైటీ కోబ్రా ఎక్కడ నుంచి ఆ ఇంట్లోకి వచ్చిందో కానీ ఈ ఘటనను అక్కడి వారు రికార్డు చేయంతో అది కాస్త వెలుగులోకి వచ్చింది. మొత్తంగా పాము అప్పుడు చనిపోయినట్లు డ్రామాలు ఆడుతుంది. ఆతర్వాత మరల అక్కడి నుంచి పాక్కుంటూ పారిపోయేందుకు ప్రయత్నించింది. అక్కడున్న స్నేక్ క్యాచర్ మాట్లాడుతూ కొన్ని పాములు తమకు డెంజర్ అన్పించినప్పుడు ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ఈవిధంగా చనిపోయినట్లు మెలికలు తిరిగి కింద పడిపోతాయని చెప్పాడు.
Read more: Snake Video: వావ్ అద్బుతం.. పూజ గదిలో కృష్ణుడి విగ్రహం ముందు పడగ విప్పిన నాగుపాము.. అరుదైన వీడియో..
ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదెక్కడి మాస్ రా మావా అంటూ ఆశ్చర్యపోతున్నారు. దీనికి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే నంటూ మరికొంత మంది సెటైరికల్ కామెంట్స్ వేస్తున్నారు.