
టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) జంటగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story).
విభిన్నమైన ప్రేమకథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ రవి నంబూరి (Ravi Namburii) సరికొత్త కాన్సెప్ట్‌తో ఎంతో అద్భుతంగా రూపొందిస్తున్నాడు.
టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) జంటగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story). విభిన్నమైన ప్రేమకథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ రవి నంబూరి (Ravi Namburii) సరికొత్త కాన్సెప్ట్‌తో ఎంతో అద్భుతంగా రూపొందిస్తున్నాడు. బేబీ చిత్రంతో ఇండస్ట్రీని షేక్ చేసిన ట్రెండ్ సెట్టింగ్ ప్రొడ్యూసర్స్ సాయి రాజేష్, ఎస్కేఎన్ ఈ చిత్రాన్ని అమృతా మాస్ జేవీ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై టాలీవుడ్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా చెన్నై లవ్ స్టోరీ నుంచి జిగితార అంటూ సాగే సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనదైన శైలిలో అద్భుతమైన క్లాసిక్, మెలోడియస్ స్వరాలను అందించారు. టాలీవుడ్ స్టార్ సింగర్ కార్తీక్ తన మధురమైన గొంతుతో ఈ పాటను పాడటంతో, ఇది వినే ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటోంది. పాటలో వినిపించే సాహిత్యం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉన్నాయి. విజువల్స్ పరంగా ఎంతో బ్యూటిఫుల్‌గా సాగుతూ మ్యూజిక్ లవర్స్‌ను లూప్ మోడ్‌లో పడేస్తోంది.
సాధారణంగా ప్రతి సినిమాలో అబ్బాయి బ్రేకప్ బాధలో తాగుతూ ఉంటే అతనిని ప్రేమించే మరో అమ్మాయి ఓదారుస్తుంది. కానీ, ఇక్కడ రివర్స్. అమ్మాయి బ్రేకప్ బాధలో తాగుతూ ఉంటే.. ఆమెను ప్రేమించే హీరో.. ఆమెను ఓదారుస్తూ ఆ బాధ నుంచి బయట పడేయడానికి ప్రయత్నిస్తుంటాడు. అందుకు తగ్గట్టుగా అనంత్ శ్రీరామ్ అందించిన లిరిక్స్ నెక్స్ట్ లెవెల్. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.