సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ కామెడీ డ్రామా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో యాంకర్ శ్రీముఖితో పాటుగా బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య, దిగంత్, సీనియర్ నటి గౌతమి, మంజుషా, శ్రీలక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ప్రచారంలో భాగంగా టీమంతా గత కొన్ని రోజులుగా ప్రమోషనల్ ఈవెంట్స్ తో సందడి చేస్తున్నారు. తాజాగా 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' టీవీ షోలో పాల్గొన్నారు. బుల్లితెరపై విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న టీవీ షో 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం'.
ఈ కార్యక్రమానికి శ్రీముఖి హోస్టుగా వ్యవహరిస్తోంది. ఇందులో శ్రీముఖి చేసే సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమెతో కలిసి ముక్కు అవినాష్, హరి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఇప్పుడు శ్రీముఖి పరివారంతో సమంత టీమ్ జట్టు కట్టింది.
‘మా ఇంటి బంగారం’ సెలబ్రేషన్స్ పేరుతో దీనికి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఆడవాళ్లంతా ఒక్క చోట చేరి అల్లరల్లరి చేసినట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.* ‘ప్రభాస్ చేయి పడితే చాలు రూ.100 కోట్లు వస్తాయి’.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలుశ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం'లో సమంత, శ్రీలక్ష్మి, గౌతమీ, డైరెక్టర్ నందినీ రెడ్డితో పాటుగా ‘మా ఇంటి బంగారం’ సినిమాలో నటించిన మరికొంతమంది పాల్గొన్నారు.
సాంప్రదాయ పట్టుచీరలో కనిపించిన యాంకర్ శ్రీముఖి .. ''నేను ఈరోజు ఇంత పద్ధతిగా ఉన్నానంటే మా అత్తమ్మే కారణం'' అంటూ గౌతమి కాళ్లకు నమస్కరించి నవ్వులు పూయించింది. సినిమాలో తాను కోడలి పాత్రలో నటించిన విషయాన్ని ప్రేక్షకులకు గుర్తు చేసింది.
సినిమాలో తనకు చాలా పెద్ద జడ ఉందని, కానీ ప్రమోషన్స్ కి వచ్చేసరికి ఇంతే మిగిలింది అంటూ తనదైన శైలిలో
నవ్వులు పంచింది. "మా పరివారానికి సమంత బంగారం వచ్చారు" అంటూ శ్రీముఖి పెద్దగా అరుస్తూ ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. "ఇది మీ కింగ్డమ్ కదా.. బాబోయ్" అని సామ్ అనడంతో, శ్రీముఖి సిగ్గు పడిపోయింది. ‘మా ఇంటి బంగారం’ సినిమాలో సమంతని ఏదో ఒకటి అనడం, ఆ తర్వాత సారీ చెప్పే క్యారక్టర్ తనదని శ్రీముఖి తెలిపింది. సమంతను ఉద్దేశించి అవినాష్ కామెంట్ చేయడం.. దాంతో ఆమె తన చేతికున్న గాజులు తీయడం వంటివి నవ్విస్తున్నాయి. ఇక యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా ఈ షోలో ఎంట్రీ ఇచ్చి, అందరినీ కాసేపు ఆడుకున్నాడు.* నాగార్జున ‘కింగ్ 100’ మూవీలో రియల్ స్టార్అలానే మా పరివారం, సమంత ‘మా ఇంటి బంగారం’ టీమ్ అందరూ కలిసి డ్యాన్స్ చేసి అలరించారు. సుహాసిని, ప్రియాంక జైన్, శ్రీ సత్యతో సహా పలువురు సీరియల్ నటీమణులు.. సమంత సినిమాల్లోని పాటలకు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ వేళ చిత్ర బృందంతో కలిసి శ్రీముఖి గ్యాంగ్ చేసిన సందడితో కూడిన ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. ఫుల్ ఎపిసోడ్ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు 'స్టార్ మా' ఛానల్ లో టెలికాస్ట్ కానుంది.