
Saikrishna : విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ (23) అనే యువకుడి అనుమానాస్పద మృతి ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణలంకలోని సాయికృష్ణ నివాసానికి స్వయంగా వెళ్లి, అతని తల్లి విజయలక్ష్మిని పరామర్శించారు.
పుత్రశోకంతో అల్లాడిపోతున్న ఆమెను జగన్ ఓదార్చి, పార్టీ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని కొండంత ధైర్యాన్ని చెప్పారు. ఈ సందర్భంగా అసలు పోలీసులు సాయికృష్ణను ఏ సమయంలో స్టేషన్‌కు తీసుకెళ్లారు? ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది? అనే పూర్తి వివరాలను జగన్ అడిగి తెలుసుకున్నారు.
తన కొడుకు మరణానికి పోలీసుల వేధింపులే కారణమని, వారే తీసుకెళ్లి చంపేశారంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి జగన్ ఎదుట కన్నీరుమున్నీరై ఆరోపించారు. Read Also : సాయికృష్ణను హత్య చేసి..కృష్ణానదిలో అస్థికలు కలిపేశారు:కేశినేని నాని యువకుడి మృతి వెనుక పోలీసుల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ ఉదంతం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఉండాల్సిన పోలీసులే ఒక యువకుడి ప్రాణం పోవడానికి కారణమయ్యారనే విమర్శలు రావడంతో ప్రభుత్వం కూడా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై స్పందిస్తూ, సాయికృష్ణ మృతికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
బాధ్యులెవరైనా సరే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒకవైపు ప్రతిపక్ష నేత జగన్ పరామర్శ, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు దర్యాప్తు ఆదేశాలతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. DMK సపోర్ట్ కోసం పవన్ కళ్యాణ్ ను NDA దింపబోతుందా ?
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Raghu Rama Krishna Raju
: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు..సునీల్ నాయక్‌పై హైకోర్టు ఆగ్రహం
JSS Mahavidyapeetha Tirupati: తిరుపతిలో జేఎస్ఎస్ మహావిద్యాపీఠం ఆఫ్-క్యాంపస్ ఏర్పాటు
Chandrababu Naidu: ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
AP Inter Supplementary Results: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు.. విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు
Kesineni Nani: సాయికృష్ణను హత్య చేసి..కృష్ణానదిలో అస్థికలు కలిపేశారు:కేశినేని నాని