
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ సర్జా. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీకే పరిమితమైన ఆయన.. ఇటీవలే తమిళంలో నటించిన బ్లాస్ట్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది.
పెద్దగా బజ్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద అదగొడుతోంది. కేవలం మౌత్ టాక్‌తోనే బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంతో సుభాష్ కె రాజ్ అనే కుర్రాడు దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ థియేటర్లలో ఉండగానే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వైరలవుతోంది.
ఈనెల 25 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుందని పోస్టర్స్ సందడి చేస్తున్నాయి. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే ఓటీటీ సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషించారు. 'బ్లాస్ట్' విషయానికొస్తే.. నీల(ప్రీతి ముకుందన్), ఆమె తండ్రి రాజారామ్ (అర్జున్), తల్లి (అభిరామి) ఈ ముగ్గురూ కరాటే మాస్టర్లే.
వీళ్లకు కరాటే ట్రైనింగ్ సెంటర్‌తో పాటు ఓ మెడికల్ షాప్ ఉంటుంది. నీల ఓ రోజు షాప్‌లో ఉన్నప్పుడు కృపాకర్ (పవన్) గ్యాంగ్‌కి చెందిన ఓ రౌడీ ఆమెను బెదిరించి కొన్ని మందులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే ఆమె చేతిలో చావు దెబ్బలు తిని జైలుపాలవుతాడు.
కానీ ఈ అరెస్ట్ తర్వాత కృపాకర్ గ్యాంగ్‌తో పాటు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అబ్రహం (అర్జున్ చిదంబరం).. నీల కుటుంబాన్ని అంతం చేయాలని ప్రయత్నిస్తారు. తర్వాత ఏమైంది? తమని నాశనం చేసేందుకు వచ్చిన శత్రువుల్ని నీల కుటుంబం ఎలా ఎదుర్కొంది?
అనేది మిగతా సినిమా. RRR చిన్నారి మల్లి ఇప్పుడు ఎలా మారిందో చూడండి (ఫోటోలు) చరిత్ర సృష్టించిన లియోనల్ మెస్సీ
Jun 17 2026 11:50 AM | Updated on Jun 17 2026 11:50 AM
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ సర్జా. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీకే పరిమితమైన ఆయన.. ఇటీవలే తమిళంలో నటించిన బ్లాస్ట్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. పెద్దగా బజ్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద అదగొడుతోంది. కేవలం మౌత్ టాక్‌తోనే బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంతో సుభాష్ కె రాజ్ అనే కుర్రాడు దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.
ఈ మూవీ థియేటర్లలో ఉండగానే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వైరలవుతోంది. ఈనెల 25 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుందని పోస్టర్స్ సందడి చేస్తున్నాయి. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే ఓటీటీ సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషించారు.
'బ్లాస్ట్' విషయానికొస్తే.. నీల(ప్రీతి ముకుందన్), ఆమె తండ్రి రాజారామ్ (అర్జున్), తల్లి (అభిరామి) ఈ ముగ్గురూ కరాటే మాస్టర్లే. వీళ్లకు కరాటే ట్రైనింగ్ సెంటర్‌తో పాటు ఓ మెడికల్ షాప్ ఉంటుంది. నీల ఓ రోజు షాప్‌లో ఉన్నప్పుడు కృపాకర్ (పవన్) గ్యాంగ్‌కి చెందిన ఓ రౌడీ ఆమెను బెదిరించి కొన్ని మందులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే ఆమె చేతిలో చావు దెబ్బలు తిని జైలుపాలవుతాడు. కానీ ఈ అరెస్ట్ తర్వాత కృపాకర్ గ్యాంగ్‌తో పాటు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అబ్రహం (అర్జున్ చిదంబరం).. నీల కుటుంబాన్ని అంతం చేయాలని ప్రయత్నిస్తారు. తర్వాత ఏమైంది? తమని నాశనం చేసేందుకు వచ్చిన శత్రువుల్ని నీల కుటుంబం ఎలా ఎదుర్కొంది? అనేది మిగతా సినిమా.
RRR చిన్నారి మల్లి ఇప్పుడు ఎలా మారిందో చూడండి (ఫోటోలు)
చరిత్ర సృష్టించిన లియోనల్ మెస్సీ (ఫోటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో రగ్బీ సందడి..శ్రుతి హాసన్ ఆటా.. పాట (ఫోటోలు)
వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)
బర్త్ డే స్పెషల్.. లంగా ఓణీలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)
కులం పేరుతో నీచపు రాజకీయాలు.. చిత్రహింసలు పెట్టి చంపాల్సిన అవసరం ఏం ఉంది..?
Watch Live: సాయి కృష్ణ ఘటనపై కుటుంబ సభ్యుల ప్రెస్ మీట్
రీతూ- డీమాన్ పవన్ కి ఎప్పుడు అదే పని..! షూటింగ్ లో ఏం జరిగిందంటే.?
ఇంత ఎలా దోచుకున్నావయ్యా సామీ.. ఏసీబీ వలలో అవినీతి తిమింగలం
మీరు నమ్మలేరు!! రష్యాలో ఉన్న ఆ రంధ్రం నరకానికి ద్వారం, ఇది నిజం!