వివరాల్లోకి వెళితే.. హనుమకొండకు చెందిన ఒక యువతి 2018లో బీ ఫార్మసీ చదువుతున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప జన్మించింది. అయితే కొద్దిరోజుల తర్వాత భార్యాభర్తల మధ్య తీవ్రమైన కుటుంబ కలహాలు ప్రారంభమవడంతో 2022 మార్చిలో బాధిత వివాహిత న్యాయం కోసం హనుమకొండ పోలీస్ స్టేషన్లో తన భర్తపై ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో సదరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ గోదారి రాజ్ కుమార్ ఆమెకు పరిచయమయ్యాడు. నీకు పూర్తి న్యాయం చేస్తానని నమ్మబలికిన ఎస్ఐ.. ఆ వివాహితను పూర్తిగా తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. తనకు తెలిసిన ఒక న్యాయవాదితో మాట్లాడించి ఆమె భర్త నుండి చట్టబద్ధంగా విడాకులు ఇప్పించాడు.విడాకుల అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ వివాహితను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆపై పెళ్లి పేరుతో పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె రెండు సార్లు గర్భం దాల్చగా.. బలవంతంగా అబార్షన్ చేయించాడు. రోజులు గడుస్తున్నా పెళ్లి ఊసు ఎత్తకపోవడంతో బాధిత వివాహిత ఎస్ఐ రాజ్‌కుమార్‌ను గట్టిగా నిలదీసింది. దీంతో అతనిలోని అసలు రంగు బయటపడింది. తాను గతంలో రికార్డ్ చేసిన ఆమెకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ భయపెట్టి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. అంతటితో ఆగకుండా ఆమె పని చేసే కార్యాలయానికి ఫోన్ చేసి ఆమె మొబైల్ నంబర్, లొకేషన్‌ను అక్రమంగా ట్రాక్ చేస్తూ నిరంతరం నిఘా పెట్టాడు. అనుమానంతో మానసిక వేధింపులకు గురిచేస్తూ, బలవంతంగా పలు హోటళ్లకు తీసుకెళ్లి లైంగిక దాడిని కొనసాగించాడు.ఈ నెల మొదటి వారంలో కూడా ఎస్ఐ రాజ్‌కుమార్ బాధితురాలిని హనుమకొండలోని ఒక హోటల్‌కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 'నువ్వు జీవితాంతం నాతోనే లైంగిక సంబంధం కొనసాగించాలి.. లేదంటే నీ నగ్న చిత్రాలను ఇంటర్నెట్లో అప్లోడ్ చేసి నీ జీవితాన్ని నాశనం చేస్తా' అని బెదిరించాడు
. ఎస్ఐ చేస్తున్న ఈ అరాచకాలను, వేధింపులను భరించలేకపోయిన బాధితురాలు.. రెండు రోజుల క్రితం నేరుగా హైదరాబాద్‌లోని ఐజీని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు వరంగల్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించడంతో శనివారం వరంగల్ భరోసా సెంటర్లో పోలీస్ అధికారులు బాధితురాలి నుండి సమగ్రమైన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అనంతరం ఈ కేసును తదుపరి చర్యల నిమిత్తం హనుమకొండ పోలీస్ స్టేషన్‌కు రిఫర్ చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా ఎస్ఐ రాజ్‌కుమార్‌పై లైంగిక దాడి, ప్రాణభీతి కలిగించడం, చీటింగ్, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివ కుమార్ వెల్లడించారు. నిందితుడైన ఎస్ఐపై శాఖాపరమైన చర్యలకు కూడా ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.