
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు
సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ తాను చాలా ఏళ్లుగా విశ్వక్ సేన్‌తో సినిమా చేయాలని అనుకుంటున్నానని చెప్పారు. దీనికి స్పందించిన విశ్వక్ సేన్ సరదాగా, "ఏంటి సార్.. నేనంటే పగనా? గీతా ఆర్ట్స్ ఆడిషన్ ఎక్కడ? ఫస్ట్ సినిమా లాగా ఆడిషన్ ఇస్తాను" అని అన్నాడు.
విశ్వక్ సేన్ మాటలకు సభలో నవ్వులు పూశాయి. వెంటనే అల్లు అరవింద్ కూడా సరదాగా స్పందిస్తూ, "నువ్వు డబ్బులు ఎక్కువ అడుగుతావ్" అని అన్నారు. దీంతో హాల్ మొత్తం నవ్వులతో మార్మోగిపోయింది.
ఇంతలో యాంకర్ కూడా ఈ సరదా సంభాషణలో జాయిన్ అవుతూ, “ఇదిగో థంబ్‌నెయిల్ వచ్చేసింది. డబ్బులు ఎక్కువ అడుగుతున్న విశ్వక్ సేన్ అని పెట్టొచ్చు" అంటూ జోక్ వేసింది.
దీనికి విశ్వక్ సేన్ తనదైన స్టైల్లో మరో సరదా కౌంటర్ ఇచ్చాడు. అల్లు అరవింద్ వైపు చూస్తూ, "సార్ మీకేం సార్.. మీకు థియేటర్లు ఉన్నాయి. మీరు కూర్చున్న సీట్ కూడా మీదే. డబ్బులు నాలాంటి వాళ్లకు పంచితేనే ఇండస్ట్రీ బాగుంటుంది" అని నవ్వుతూ అన్నాడు.
విశ్వక్ వ్యాఖ్యలకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే తన మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోకూడదని భావించిన విశ్వక్ సేన్, వెంటనే "నేను కేవలం జోక్‌గా అన్నాను" అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఇక దీవానా ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. భావోద్వేగాలు, ప్రేమ, ఫ్యామిలీ డ్రామా కలగలిపిన ఈ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.