
ఖతర్ దేశ భద్రత, దాని అపారమైన గ్యాస్ సంపదతో వచ్చే ఆదాయంపై ఇరాన్ దాడులు, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం పెనుప్రభావం చూపుతున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ సంక్షోభం ఖతర్ యొక్క ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా
దెబ్బతీసింది. ఇది ప్రపంచ ఇంధన మార్కెట్లలో భయాందోళనలు సృష్టిస్తూ, ఆసియా, యూరప్ దేశాలకు గ్యాస్ కొరతను సృష్టిస్తున్నది. ఖతర్ యొక్క అతిపెద్ద ధృవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) హబ్ అయిన రాస్ లాఫాన్ పై ఇరాన్ క్షిపణి దాడులు జరిగాయి. దాంతో ఆ దేశం మొత్తం ఎగువ ఉత్పత్తి సామర్థ్యంలో దాదాపు 17శాతం వరకు దెబ్బతింది. ఖతర్ , ఇరాన్‌లు ప్రపంచంలోనే అతిపెద్దదైన సహజ వాయువు క్షేత్రాన్ని పంచుకుంటున్నాయి . ఖతర్ లో నార్త్ ఫీల్డ్, ఇరాన్ లో సౌత్ పార్స్ సహజవాయువు ఉత్పత్తిలో కీలకం. ఖతర్ తన గ్యాస్ సంపదను ఆ క్షేత్రం నుండి వెలికితీసినప్పటికీ, రవాణాకు భౌగోళికంగా ఇరాన్ నియంత్రణలో ఉన్న హార్ముజ్ జలసంధిపై ఆధారడాల్సి వస్తోంది. ఆ క్రమంలో ముడిసరుకు ఎగువ సరఫరాలు నిలిచిపోవడంతో ఖతర్ ఎనర్జీ 'ఫోర్స్ మేజ్యూర్' ప్రకటించింది. దీని ఫలితంగా ఏర్పడిన గ్యాస్ కొరత కారణంగా ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆసియా దేశాలలో గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. భారత్ ఏటా దిగుమతి చేసుకునే 2.7 కోట్ల టన్నుల ఎల్ఎన్జీలో ఖతర్ వాటా 40 శాతం ఉంది. ఖతర్ నుంచి దిగుమతులకు ఆటంకం భారత్‌పై గట్టిగానే పడుతోంది. దశాబ్దాలుగా అమెరికా మద్దతుతో మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొల్పిన భద్రతా వ్యవస్థకు ఈ సంక్షోభం పెద్ద సవాలుగా నిలిచింది. ఖతర్ లో అమెరికన్ అల్-ఉదీద్ వైమానిక స్థావరం ఉన్నప్పటికీ, ఆ దేశంపై ప్రత్యక్ష దాడులను నివారించడంలో విఫలమైంది. 2026 మార్చిలో ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి ఇరాన్ దక్షిణ పార్స్ గ్యాస్ ఫీల్డ్స్‌పై దాడి చేయడం, దాని ప్రత్యక్ష ప్రభావం ఖతర్‌పై పడటం, గల్ఫ్ ప్రాంత భద్రతా సమీకరణాన్ని పూర్తిగా మార్చేసింది. ఖతర్ ఒక చిన్న, ఎడారి ద్వీపకల్పం. 1961లో దాని జనాభా కేవలం 36,000. హైడ్రోకార్బన్ లభించకపోతే ఖతర్ నేటి రూపంలో ఉండేది కాదు.1940లో డుఖాన్లో చమురు, 1971లో నార్త్ ఫీల్డ్ ఖతర్‌ను ఒక్కసారిగా ప్రపం. ఇరాన్–ఖతర్ మధ్య జాయింట్ రిజర్వాయర్ ఉండటంతో ఒక దేశం చర్యలు మరొకదానిపై ప్రభావం చూపుతాయి. అదే ఇప్పుడు ఖతర్‌కు శాపమైంది.
ఏఐ ఆధారిత స్మార్ట్ బోర్డర్.. భారత్ సరిహద్దు భద్రతలో సరి కొత్త అధ్యాయం
తృణమూల్‌లో చారిత్రక తిరుగుబాటు సంకేతం ఏంటి?
.