
1959లో రష్యాలోని ఉరల్ పర్వత ప్రాంతంలో స్కీయింగ్‌కు వెళ్లిన తొమ్మిది మంది యువకులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. వారి టెంట్ లోపలి నుంచి చిరిగిపోయి ఉంటుంది. కొందరు తీవ్రమైన గాయాలతో కనిపించడం అప్పట్లో పెద్ద మిస్టరీగా మారింది. మంచు కొండలు, భయంకర వాతావరణం, ఇతర అనేక కారణాలు చర్చల్లోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన ప్రతి అంశానికి ఇప్పటికీ ఒకే ఒక్క సమాధానం లేదు. శతాబ్దాల నాటి ఓ వింత పుస్తకం ఇప్పటికీ భాషా నిపుణులకు సవాలుగా నిలుస్తోంది. దీనినే వోయ్నిచ్ మాన్యుస్క్రిప్ట్ అంటారు. ఇందులో గుర్తుపట్టలేని లిపితో పాటు మొక్కలు, ఖగోళ వస్తువులు, వింత ఆకృతులు ఉన్నాయి. ఈ పుస్తకం ఏ భాషలో రాశారు? ఎవరు రాశారు? అసలు అందులో ఉన్న సమాచారానికి అర్థం ఏమిటి? అనే ప్రశ్నలకు ఇప్పటికీ కచ్చితమైన సమాధానం లేదు. 1872లో అట్లాంటిక్ మహాసముద్రంలో మేరీ సెలెస్టే అనే నౌక కనిపించింది. నౌక పెద్దగా దెబ్బతినలేదు. సరుకు కూడా ఉంది. కానీ అందులో ప్రయాణిస్తున్న సిబ్బంది, ప్రయాణికులు మాత్రం కనిపించలేదు. ఎందుకు నౌకలో ఎవరూ లేరు? ఆ తర్వాత ఏమైంది? అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. సముద్రపు తుపాను నుంచి నౌకలో ఏర్పడిన ప్రమాదం వరకు అనేక రీజన్స్ ఉన్నప్పటికీ.. అసలు కారణం మాత్రం మిస్టరీగానే మిగిలింది. ప్రపంచ ప్రఖ్యాత పైలట్ అమీలియా ఇయర్హార్ట్ 1937లో ప్రపంచాన్ని చుట్టివచ్చే ప్రయత్నంలో భాగంగా విమానంలో ప్రయాణిస్తూ అదృశ్యమయ్యారు. ఆమె విమానం ఎక్కడ కూలింది? ఆమెకు ఏమైంది? అనే ప్రశ్నలకు దశాబ్దాలుగా అన్వేషణ జరుగుతోంది. సముద్రంలో విమానం కూలిపోయి ఉండొచ్చనే అనుమానంతో పాటు ఆమె వేరే ప్రాంతంలో ల్యాండ్ అయి ఉండొచ్చనే వాదనలు కూడా ఉన్నాయి. కానీ కచ్చితమైన ఆధారం ఇప్పటికీ దొరకలేదు. పెరూలోని నాజ్కా ఎడారిలో నేలపై గీసిన భారీ ఆకృతులు ప్రపంచాన్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్నాయి. పక్షులు, జంతువులు, మనుషుల ఆకారాలు, రేఖాగణిత నమూనాలు.. ఇలా వందలాది