© 2026 nimisham.in

Medigadda Barrage : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని అంబటిపల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజ్కి వరద ప్రవాహం పోటెత్తుతుంది. శనివారం కురిసిన వర్షం కారణంగా బ్యారేజీకి వరద నీరు భారీగా చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో 62,700 క్యూసెక్కులుగా నమోదైంది. పైనుంచి భారీగా వరద నీరు వస్తున్నందున అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీకి వరద పోటెత్తుతున్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. ఇన్ఫ్లో 62,700 క్యూసెక్కులు కాగా.. అంతేమొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 85 గేట్లు ఎత్తి 62,700 క్యూసెక్కులను అధికారులు దిగువకు పంపిస్తున్నారు. 26,500 క్యూసెక్కులకు పెరిగిన ఇన్ ఫ్లో .#Medigadda#KaleshwaramProject — Telangana First (@TelanganaFirst_) July 4, 2026