
బీసీ రిజర్వేషన్ల అంశంపై శాసనసభలో ఏపీ సీఎం చంద్రబాబు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం మేయర్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలి అక్టోబర్ లోగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం 13 జడ్పీలను 28 జిల్లా పరిషత్‌లుగా ఏర్పాటుకు ఆమోదం BC Reservations : బీసీ రిజర్వేషన్ల అంశంపై జరిగిన చర్చలో ఏపీ శాసనసభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచే దిశగా రిజర్వేషన్లపై కూడా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.1 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్‌లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా కార్యాచరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు : బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రక నిర్ణయమని సీఎం చంద్రబాబు అన్నారు. బీసీల సంక్షేమం, సామాజిక న్యాయానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కేవలం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మాత్రమే కాదన్నారు. టీడీపీ రాజకీయ సిద్ధాంతంలో భాగమని స్పష్టం చేశారు. నిర్ణయాధికారంలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. బీసీలను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని చంద్రబాబు గుర్తుచేశారు. స్థానిక సంస్థల్లో తొలిసారిగా బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్దేనని పేర్కొన్నారు. 1995లో బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 34 శాతానికి పెంచినట్టు తెలిపారు. టీడీపీకి, బీసీలకు అవినాభావ సంబంధం ఉందని, బలమైన బీసీ నాయకత్వాన్ని పార్టీ ప్రోత్సహించిందని అన్నారు. Read Also : Telangana Farmers Alert : తెలంగాణ రైతులకు