. వాళ్లలో కొందరు తిరుగుబాటు చేసి భూమికి వస్తే, వాళ్లను వేటాడేందుకు Rick Deckard అనే Blade Runner రంగంలోకి దిగుతాడు.
పైన చూస్తే ఇది ఒక futuristic detective thriller. కానీ Ridley Scott అక్కడితో ఆగలేదు. ఆ ప్రపంచం వెనుక మరో ఇంట్రస్టింగ్ విషయాన్ని తీసుకున్నాడు. మనిషిలా కనిపించే వ్యక్తిని మనిషి కాదని ఎలా నిర్ణయిస్తాం? జ్ఞాపకాలు ఉంటే? భావోద్వేగాలు ఉంటే? ప్రేమిస్తే? చావడానికి భయపడితే? అప్పుడు అతను యంత్రం మాత్రమేనా? Blade Runner ఈ ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పదు. అదే దాని గొప్పతనం.
Ridley Scott ఆలోచించిన vision, ప్రేక్షకుల ముందుకు వచ్చిన version ఒకటైతే కాదు. స్టూడియో మాత్రం ఈ సినిమా చూసి చాలా complexగా ఉందనే భావనతో, ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేయడానికి Deckard voice-over narrationను జోడించింది. చివర్లో ఒక జానపద తరహా happier endingను కూడా పెట్టింది.
Scott కోరుకున్నది మాత్రం వేరే. అతనికి mystery కావాలి, అస్పష్టత కావాలి. ప్రేక్షకుడు చూస్తూ ప్రశ్నించాలి. Deckard నిజంగా ఎవరు? Replicants ఎంతవరకు మనుషులు? ఈ ప్రపంచంలో అసలు మానవత్వం ఎవరిలో ఉంది? అని ఆలోచనలో పడాలి.
ఒక దర్శకుడి కళాత్మకతకి, ఒక స్టూడియో business logicకి మధ్య వచ్చిన తేడా అది. సినిమా విడుదలైంది కానీ, Ridley Scott మనసులో మాత్రం మరో వర్షన్ తిరుగుతూనే ఉంది.
సాధారణంగా దర్శకుడు ఒక సినిమా ముగిశాక కొత్త కథ, కొత్త నటీనటులతో ముందుకు వెళ్తాడు. కానీ Ridley Scott విషయంలో Blade Runner ఒక unfinished thoughtలా ఉండిపోయింది. 1992లో Director’s Cut వచ్చినా, అది కూడా Scott పూర్తిస్థాయిలో అనుకున్న definitive version కాదు. మరో 15 ఏళ్ల తర్వాత, 2007లో Absolute Creative Controlతో ‘The Final Cut’ వచ్చింది.
అంటే 1982లో మొదలైన ప్రయాణం 2007లో ముగిసింది. ఇది సాధారణ filmmaking కాదు, ఒక రకమైన creative obsession!
ఈ 25 ఏళ్లలో ఆయన ఊరికే కూర్చోలేదు, ఎన్నో ఇతర గొప్ప చిత్రాలు తీశారు. కానీ టెక్నాలిజీ పెరిగి Image & Sound Restoration అందుబాటులోకి రాగానే, తన సినిమాలోని లోపాలను సరిదిద్ది original visionకు రూపమిచ్చారు.
ముఖ్యంగా Deckard voice-over narration తీసేశారు. దీనివల్ల కథలోని గందరగోళం, ఆ మైమరిపించే mystery పెరిగాయి. అలాగే Unicorn Dream sequenceను చేర్చడం వల్ల Deckard కూడా ఒక Replicant ఏమో? అనే ఆలోచనకు బలం చేకూరింది.
చివరికి Ridley Scott కథ మనకు చెప్పేది Blade Runner గురించి మాత్రమే కాదు. గొప్ప దర్శకులు ఎవరూ గొప్ప దర్శకులుగా పుట్టరు. తమ తలలో కనిపిస్తున్న దృశ్యాన్ని తెరపైకి తీసుకురావడానికి ఎంత దూరమైనా వెళ్లేవాళ్లు గొప్ప దర్శకులవుతారు.
ఒక scene సరిపోలేదంటే మళ్లీ తీసేవాళ్లు. ఒక edit సరిపోలేదంటే మార్చేవాళ్లు. ఒక ముగింపు తమ మనసుకు నచ్చకపోతే దాన్ని మళ్లీ ఆలోచించేవాళ్లు. ప్రపంచం “ఇది ఇప్పటికే బాగుంది” అని చెప్పినా… “కానీ నేను అనుకున్నంత బాగోలేదు” అని చెప్పగలిగేవాళ్లు.
ఇది perfectionismనా? లేక creative obsessionనా?
Ridley Scott చేసినదాన్ని ఏమని పిలవాలి? Perfectionism?, Obsession?, Creative stubbornness? లేక ఒక గొప్ప దర్శకుడి గొప్పతనమా?. గొప్ప క్రియేటర్స్ తమ పనిని ఇతరుల కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. అదే సమయంలో దాని లోపాలను కూడా ఇతరుల కంటే ఎక్కువగా చూస్తారు. ఒక సాధారణ ప్రేక్షకుడు “బాగుంది” అనగానే వెళ్లిపోతాడు. ఒక filmmaker మాత్రం అక్కడే ఆగడు. “నేను అనుకున్నది ఇది కాదు.” ఆ ఒక్క వాక్యం అతన్ని మళ్లీ మళ్లీ work table దగ్గరకు తీసుకెళ్తుంది. కొన్నిసార్లు అది perfectionism. కొన్నిసార్లు అది obsession. కానీ అదే obsession ఒక ordinary workను extraordinary workగా మార్చే fuel కూడా కావచ్చు.
ఇది Ridley Scott చేసిన అతి పెద్ద prediction అని చెప్పాలి. Blade Runnerలో corporations artificial beingsను సృష్టిస్తాయి. వాటికి memories ఇస్తాయి. వాటిని పని చేయిస్తాయి. వాటిని control చేస్తాయి. ఒక దశలో ఆ artificial beings తమ సృష్టికర్తలను ప్రశ్నిస్తాయి.
ఈరోజు AI గురించి ప్రపంచం అడుగుతున్న ప్రశ్నలు వింటూంటే ఆ premise ఇప్పటికాలానికి కరెక్ట్ గా సరిపోతుంది. AI మనుషుల ఉద్యోగాలను ఎంతవరకు మార్చుతుంది? ఒక machine మనిషిలా ఆలోచిస్తే? మనిషిలా మాట్లాడితే? మనిషిలా emotional responses ఇస్తే? అది కేవలం machineగానే మిగులుతుందా? లేక మనం దానికి మరో definition ఇవ్వాల్సి వస్తుందా? 1982లో Ridley Scott వీటికి సమాధానం ఇవ్వలేదు.
ఆయన కేవలం ప్రశ్నలు వేశాడు. అందుకే ఆ సినిమా వయసు పెరుగుతున్న కొద్దీ పాతబడటం లేదు. మరింత కొత్తగా కనిపిస్తోంది.
ఏదైమైనా నాలుగు దశాబ్దాల క్రితం తీసిన ఒక సినిమా. 25 ఏళ్ల పాటు చెక్కిన ఒక vision అవటం చాలా చాలా గొప్ప విషయం.