
రోజువారీ ఒత్తిడి, పనిభారం, నిరంతర ఆలోచనలు.. ఇవన్నీ మనసుపై ప్రభావం చూపుతాయి. ఆందోళన పెరిగినప్పుడు ప్రశాంతంగా ఉండలేకపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఏకాగ్రత తగ్గడం, నిద్ర సరిగా పట్టకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో ఖరీదైన పరికరాలు లేదా జిమ్ అవసరం లేకుండానే ఓ సాధారణ అలవాటు ఉపకరిస్తుంది. అదే నడక. రోజూ కొంతసేపు నడవడం శరీరాన్ని చురుగ్గా ఉంచడంతో పాటు మనసుకు ప్రశాంతతనిస్తుంది.నడక వల్ల ఒత్తిడి ప్రభావాలు కొంత తగ్గొచ్చు. ఆందోళనలో ఉన్నప్పుడు శరీరం అప్రమత్త స్థితిలో ఉంటుంది. నడక వంటి శారీరక కదలిక శరీరంలో పేరుకుపోయిన టెన్షన్‌ను తగ్గించేందుకు తోడ్పడుతుంది. క్రమం తప్పకుండా నడవడం వల్ల రోజువారీ ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం మెరుగుపడొచ్చు. వేగంగా నడవాల్సిన అవసరం లేదు. మన శక్తికి తగ్గట్టుగా నడిస్తే సరిపోతుంది.నడక మూడ్‌ను కూడా మెరుగుపరిచే అవకాశం ఉంది. శారీరక వ్యాయామం మెదడులో మానసిక స్థితికి మేలు చేసే రసాయనాల విడుదలకు దోహదపడుతుంది. ముఖ్యంగా ఒకే విషయంపై పదేపదే ఆలోచించే వారికి నడక ఓ చిన్న విరామంలా పనిచేయొచ్చు. చుట్టూ ఉన్న పరిసరాలను గమనించడం, అడుగుల కదలికపై దృష్టి పెట్టడం, శ్వాసను గమనించడం ద్వారా ఆందోళన కలిగించే ఆలోచనల నుంచి కాసేపు దృష్టి మళ్లించవచ్చు.బయట నడవడం వల్ల మరింత ప్రయోజనం ఉండొచ్చు. సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలి, పచ్చదనం, మారుతున్న పరిసరాలు మనసుకు కొత్త అనుభూతిని ఇస్తాయి. పార్కులు లేదా ప్రశాంతమైన ప్రదేశాల్లో నడవడం రోజువారీ ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడొచ్చు. అదే సమయంలో క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం





