
YogAndhra-2026: భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతమైన జీవన శైలి యోగా అని, దానిని ఒక ప్రజా ఉద్యమంగా మలిచి ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలో నిర్వహించిన ప్రెస్ మీట్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ (జూన్ 21) ప్రణాళికలను ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి మందిని భాగస్వాములను చేస్తూ ఈ ఏడాది ‘యోగాంధ్ర-2026’ను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. Read also: YS Jagan: డీఎస్సీ అభ్యర్థులకు అండగా ఉంటామంటూ వైఎస్ జగన్ భరోసా వృద్ధాప్యంలోనూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే సందేశాన్ని ఇచ్చేలా ఈ సంవత్సరం ‘యోగా ఫర్ హెల్తీ ఏజింగ్’ అనే థీమ్‌తో కార్యక్రమాలను రూపొందించారు. యోగా అనేది కేవలం ఒక్కరోజుకే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జూన్ నెలను ‘యోగా మాసం’గా ప్రకటిస్తూ.. జూన్ 7 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రమంతటా విస్తృతంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. మెగా ఈవెంట్ అమరావతిలోని కృష్ణానది పశ్చిమ బైపాస్ వంతెనపై 25 వేల మందితో ప్రధాన కార్యక్రమం జరగనుంది. ప్రతి జిల్లా కేంద్రంలో 2 వేల నుంచి 3 వేల మంది భాగస్వామ్యంతో వేడుకలు ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లాలో పోలీస్ సిబ్బంది, కోనసీమలో రైతులు వంటి ప్రత్యేక వర్గాలతో యోగా సెషన్స్ ఉంటాయి. ఉండవల్లి గుహలు, శ్రీశైలం వంటి రాష్ట్రంలోని 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో యోగా ప్రదర్శనలు ఏర్పాటు చేసి టూరిజంను ప్రమోట్ చేయనున్నారు. ఈ భారీ కార్యక్రమ నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 10 కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించింది. ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్యాల్లో భాగంగా రాష్ట్రంలో 10 లక్షల మంది సర్టిఫైడ్ యోగా సాధకులను, 2.50 లక్షల మంది ప్రత్యేక యోగా శిక్షకులను (ట్రైనర్స్) తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని
సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మహత్కార్యం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇషా ఫౌండేషన్, బ్రహ్మకుమారీస్ వంటి ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సంస్థల మద్దతు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు సలహాలతో రూపొందించిన 168కి పైగా యోగా శిక్షణ వీడియోలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
ఉచిత వీడియోల కోసం ప్రజలు 81424 04888 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ పంపి ఈ వీడియోలను పొందవచ్చు. ఈ కార్యక్రమాల సమాచారం, రిజిస్ట్రేషన్ల కోసం ప్రత్యేకంగా yogandhra.ap.gov.in అనే పోర్టల్‌ను ప్రారంభించారు. గతేడాది యోగాంధ్ర కార్యక్రమానికి దాదాపు 2.44 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారని, అదే ఉత్సాహంతో ఈసారి కూడా ప్రజలంతా భాగస్వాములై ఈ 365 రోజుల నిరంతర ఆరోగ్య ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
Amaravati : తెలంగాణ లో నా అనే ఉనికి ఉంటె.. ఆంధ్ర లో నా అనే ఉనికి లేదు – పవన్
Adulterated Ghee Case : కల్తీ నెయ్యి కేసులో పలు ప్రాంతాలలో ఈడీ సోదాలు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Jagan Mavigun : జగన్ ‘మావిగన్’పై పవన్ సెటైర్లు
Kunamneni Sambasiva rao: పవన్ వ్యాఖ్యలపై సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు విమర్శలు
YS Jagan: డీఎస్సీ అభ్యర్థులకు అండగా ఉంటామంటూ వైఎస్ జగన్ భరోసా
Telangana: తెలంగాణ మా అయ్యల జాగీరు.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై గద్దర్ కూతురు వెన్నెల ఫైర్
Andhra Pradesh Rains: రానున్న ఐదు రోజులు ఏపీకి వర్ష సూచన
ఎల్‌నినో ఎఫెక్ట్ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ...
మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు పరిసర జిల్లాల్లో గత ఆదివారం నుండి రుతుపవన పూర్వ (Pre-Monsoon)...
తెలంగాణ రాజకీయాల్లో కాంట్రాక్టులు, ప్రాంతీయ అంశాలపై సరికొత్త వివాదం రాజుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టర్లకు తెలంగాణలో...
హైదరాబాద్‌లో లోన్ యాప్ వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. నగరంలోని ఐటీ హబ్ ఐకాన్...
ముదివర్తిపాలెంలో ఘోరం, తిరునాళ్ల ముగించుకొని వస్తుండగా ఇద్దరు యువకులపై విచక్షణారహితంగా దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు,...
హైదరాబాద్‌లో జనసేన అంతర్గత సభకు అనుమతి నిరాకరణ, ఆపై హైకోర్టులోనూ హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణకు...
బుధవారం ఉదయం ఢిల్లీలోని మాల్వీయా నగర్ ప్రాంతంలో ఒక రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో కనీసం...
ఇంగ్లాండ్ వేసవి సీజన్‌కు ముహూర్తం ఖరారైంది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత...
తిరుమల యాత్రికులకు స్వచ్ఛమైన ఆహారం అందించడమే లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది....
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ (Sambhal) జిల్లాలో జరిగిన ఒక అత్యంత క్రూరమైన, సంచలనమైన యాసిడ్ దాడి కేసులో...
© 1997–2026 AGA Publications Limited. All rights reserved.