
Peddi : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న భారీగా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ తోనే సినిమాపై హైప్ నెలకొంది.
Telugu » Movies » Ram Charan Peddi Movie Theatrical Business Details Here
Peddi : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న భారీగా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ తోనే సినిమాపై హైప్ నెలకొంది. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నేడు జూన్ 1న విజయవాడలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా జరగనుంది. జూన్ 3 రాత్రి నుంచి ప్రీమియర్స్ పడనున్నాయి.
ఇక పెద్ది సినిమాకు భారీగానే ఖర్చుపెట్టారు. ఈ సినిమాకు దాదాపు 350 కోట్ల వరకు బడ్జెట్ అయిందని సమాచారం. ఇప్పటికే ఓటీటీ బిజినెస్ కూడా అయిపోయిందని, నెట్ ఫ్లిక్స్ సంస్థ పెద్ది సినిమాను దాదాపు 130 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. ఇక పెద్ది సినిమాకున్న హైప్ తో థియేటరికల్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది.
Also Read : Femina George : అల్లు అర్జున్ ‘రాకా’లో మలయాళీ భామ.. తనెప్పుడో హింట్ ఇచ్చింది..
పెద్ది సినిమా థియేట్రికల్ బిజినెస్ వివరాలు..
నైజాం – 48 కోట్లు ఆంద్ర – 63.25 కోట్లు సీడెడ్ – 24 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు దాదాపు 135.25 కోట్ల బిజినెస్ జరిగింది.
ఇక హిందీ, నార్త్ లో – 25 కోట్లు తమిళనాడు – 5.25 కోట్లు కేరళ – 2 కోట్లు కర్ణాటక – 17 కోట్లు బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ లో దాదాపు 34 కోట్లకు పెద్ది సినిమా అమ్ముడయింది.
ప్రపంచవ్యాప్తంగా పెద్ది సినిమాకు దాదాపు 218.50 కోట్ల థియేటరికల్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 220 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. అంటే కనీసం 440 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. కేవలం తెలుగులోనే పెద్ది సినిమా కనీసం 270 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాలి. మొత్తంగా హిట్ టాక్ తెచ్చుకోవాలంటే పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా కనీసం 450 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. మరి పెద్ది సినిమా ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఇక ఆడియో రైట్స్ కూడా మంచి ధరకే అమ్ముడయినట్టు తెలుస్తుంది. శాటిలైట్ హక్కులు అమ్ముడవ్వాల్సి ఉంది.
Also Read : మరి కాసేపట్లో ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ ఇక్కడ చూసేయండి..
10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states.
Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd.