
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు..
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది.
తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం.
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు.
వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�...
బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�...
మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�...
సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�...
లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ...
కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �...
సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�...
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున...
లక్నో: సమాజ్వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద...
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు.
భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.
ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్!
ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
Jun 1 2026 10:46 AM | Updated on Jun 1 2026 10:54 AM
మొదట అది సాధారణ మరణం అనుకున్నారు. తినేటప్పుడు ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని స్వయంగా తల్లే చెప్పడంతో అంతా అదే నిజమనుకున్నారు. కానీ పోస్టుమార్టం నివేదిక వెన్నులో వణుకు పుట్టించే విషయాల్ని బయటపెట్టింది. పోలీసులు సైతం ఆ నివేదిక చూసి షాక్కు గురయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. అలా ఆ చిన్నారి కేసు యావత్ సమాజాన్ని కుదిపేసిన ఘటనగా మారింది. పట్టరాని కోపంతో.. అదీ పోలీసుల సమక్షంలోనే జనాలు నిందితుల మీద దాడి చేసే దాకా తీసుకెళ్లింది..
కేరళలోని తిరువనంతపురం జిల్లా నెడుమంగాడ్లో.. ఏడాదిన్నర వయసున్న అర్షిద్ మరణం అందరితో ‘అయ్యో పాపం’ అనిపిస్తోంది. భోజనం చేస్తుండగా.. దగ్గు, వాంతులు చేసుకుంటూ ఆ చిన్నారి అస్వస్థతకు గురయ్యాడని.. ఆస్పత్రికి తరలిస్తే చికిత్స పొందుతూ కన్నుమూశాడని తల్లి అఖిల(24) మీడియా ముందు వాపోయింది. అయితే ఆమె కన్నీళ్లంతా కట్టుకథ అని తేలడానికి 24 గంటలు కూడా పట్టలేదు.
అర్షిద్ మాములు చిన్నారేం కాదు. కొన్ని నెలల కిందట.. రెండు చేతులకు బ్యాండ్లతో తల్లి చంకలో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాడు. ఆడుకుంటుండగా సైకిల్ మీద నుంచి పడిపోయాడని చెబుతూ.. ఆమె పలువురి సాయం కోరడం నెట్టింట వైరల్ అయ్యింది. అలా ఆ తల్లికి చాలామంది డబ్బు కూడా పంపించారు. కట్ చేస్తే.. మే 29వ తేదీన ఆ చిన్నారి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు.
Tragic incident from God’s own country Here is a 2-week-old video of 1-and-a-half-year-old Arshad with both hands fractured. In the video, his mother Akhila lies, claiming he broke his hands by falling off a bicycle. Tragically, little Arshad passed away 2 days ago at the… pic.twitter.com/j1WnUTE2fU
— Revolutionary Monk (@RevolutionMonk) May 31, 2026
అన్నం తింటుండగా ఆ చిన్నారి అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో అఖిల, ఆమె స్నేహితుడు అష్కర్ అర్షిద్ను హుటాహుటిన పనవూర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో తిరువనంతపురంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం అయ్యింది. ఈలోపు ఒంటిపై గాయాలు కనిపించడంతో పోలీసులు అనుమానంతో పోస్టుమార్టం నిర్వహించారు. అందులో షాకింగ్ విషయాలు బయటపెట్టాయి.
అర్షిద్ ఒంటిపై సుమారు 50కి పైగా గాయాల గుర్తులు ఉన్నట్లు ప్రాథమిక నివేదిక వెల్లడించింది. తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో అంతర్గత రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. అంతేకాదు.. సిగరెట్లతో ఒంటి నిండా కాల్చిన గాయాలు ఉండడం వైద్యుల్ని విస్మయానికి గురిచేసింది. పైగా ఈ గాయాలు ఒక్కరోజులో జరిగినవి కావని.. చాలా కాలంగా కొనసాగుతున్న హింసకు సంబంధించినవని తేల్చారు.
నెలల వయసు నుంచే.. అఖిల కడుపుతో ఉన్నప్పుడు ఆమె భర్త అఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమె అష్కర్(31) అనే వ్యక్తితో సహజీవనం మొదలుపెట్టింది. ఈ సంబంధం కారణంగానే ఆమె పుట్టిన బిడ్డను తల్లికి అప్పగించింది. అయితే అఖిల భర్త తరఫున బంధువుల అభ్యంతరాలతో తిరిగి చిన్నారిని తన దగ్గరకు తెచ్చుకుంది. అప్పటి నుంచే చిన్నారి అర్షిద్కు వేధింపులు మొదలయ్యాయి. ఆ సమయంలోనూ శరీరంపై తరచూ గాయాలు కనిపించేవని.. అడిగితే గాయాలపాలవుతున్నాడని చెప్పేదని అఖిల తల్లి పోలీసులకు చెబుతోంది.
అంతేకాదు.. మే నెలలో వైరల్ అయిన వీడియోను కూడా అర్షిద్ అమ్మమ్మ గుర్తు చేసింది. మనవడి చేతులు విరిగిన సందర్భంలోనూ కూతురు, ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది. ఇక.. చుట్టుపక్కల వాళ్లు చిన్నారి గుక్కపట్టి ఏడ్వడంపై చాలాసార్లు అఖిలను నిలదీసినట్లు చెబుతున్నారు.
ఆగ్రహంతో దంచి కొట్టారు! పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత పోలీసులు కేసును అనుమానాస్పద మృతి నుంచి హత్య కేసుగా మార్చారు. కేసు తీవ్రత దృష్ట్యా మే 30న అఖిల, అష్కర్లను అరెస్ట్ చేశారు. చిన్నారిపై నిరంతరం హింస కొనసాగుతున్న విషయం తెలిసినా తల్లి అడ్డుకోలేదని, అధికారులకు సమాచారం ఇవ్వలేదని స్పష్టమైంది. అందుకే ఆమెపైనా హత్య కేసు నమోదు చేశారు. అంతేకాదు.. గతంలో చేతులు విరిగిన ఘటనలోనూ ఆమె ప్రమేయం ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇక ఆదివారం అష్కర్ను ఘటనాస్థలికి తీసుకెళ్లి సాక్ష్యాలు సేకరిస్తుండగా.. స్థానికులు ఆగ్రహంతో అతనిపై దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు కూడా వాళ్లను నిలువరించలేపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితులిద్దరినీ కఠినంగా శిక్షించాలని అర్షిద్ అమ్మమ్మ, నాన్నమ్మ, తాతలు.. స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ అర్షిద్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
തിരുവനന്തപുരം നെടുമങ്ങാട് ഒന്നര വയസ്സുകാരൻ കൊല്ലപ്പെട്ട സംഭവത്തിൽ പ്രതികളിൽ ഒരാളായ അഷ്കറുമായി തെളിവെടുപ്പ് നടത്തുന്നതിനിടെ പ്രതിയെ കയ്യേറ്റം ചെയ്ത് നാട്ടുകാർ #nedumangad #ashkar #crime #kerala pic.twitter.com/4MEuPTbAXl
— DD News Malayalam (@DDNewsMalayalam) May 31, 2026
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్.. అవతరణ అదిరేలా (ఫొటోలు)
‘శ్రీనివాస మంగాపురం’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
రాయల్ ఛాలెంజర్స్ రాజసం.. ఫైనల్లో దుమ్మురేపిన బెంగళూరు (ఫొటోలు)
చైతూ 'మై లేడీ'.. శోభిత 'బంగారం'.. బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
ముగిసిన శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
కోడి చెరువు భూ కబ్జా.. నాగార్జునకు ఒక రూల్.. పవన్ కు ఒక రూలా..?
వివాహమయి ఒకరోజైనా గడవకముందే హెలికాప్టర్ ప్రమాదం.. పెళ్లికొడుకు దుర్మరణం
సుగాలి ప్రీతి తల్లిపై హైపర్ ఆది వ్యాఖ్యలు.. పోతిన మహేష్ వార్నింగ్
IPL మ్యాచ్ చూస్తూ.. డ్రైవింగ్.. బావిలోకి కారు..