
ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ దేశంలోని ఆహార భద్రత, నాణ్యతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మనమంతా మనకు తెలియకుండానే ఒక సమాంతర భ్రమల్లో బతుకుతున్నామని, దేశంలో ఆహార కల్తీ, భద్రతకు సంబంధించిన వాస్తవాలు అత్యంత...
ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ దేశంలోని ఆహార భద్రత, నాణ్యతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మనమంతా మనకు తెలియకుండానే ఒక సమాంతర భ్రమల్లో బతుకుతున్నామని, దేశంలో ఆహార కల్తీ, భద్రతకు సంబంధించిన వాస్తవాలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఆమె తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరీ’ప్రమోషన్స్ సందర్భంగా ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కాజల్ ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ సినిమా కథ, దానికి సంబంధించిన పరిశోధనా పత్రాలు తన వద్దకు వచ్చినప్పుడు దేశంలోని నిజా నిజాలు చూసి తాను షాక్కు గురయ్యానని కాజల్ చెప్పారు. "మన చుట్టూ ఉన్న వాస్తవాలను పట్టించుకోకుండా, మనకు నచ్చిన చిన్న ప్రపంచంలో (బబుల్లో) మనం ఎంతో సౌకర్యవంతంగా బతికేస్తున్నాం. కానీ, నిజానికి ఇది ముమ్మాటికీ కపటత్వమే అవుతుంది. ఈ భయంకరమైన నిజాన్ని సమాజానికి చూపించాల్సిన, దీనిపై మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావించాను. ప్రజల్లో అవగాహన కల్పించడమే ఇందులో మొదటి అడుగు. ఏదైనా ఒక సమస్య గురించి తెలిసినప్పుడే కదా, దానిని పరిష్కరించడానికి మనం ముందడుగు వేస్తాం. ఈ కథ నా కళ్లు తెరిపించింది. అయితే, సమాజంలోని ఈ చేదు నిజం నన్ను తీవ్రంగా కలచివేసింది" అని కాజల్ ఆవేదన వ్యక్తం చేశారు.నిద్ర లేకుండా ఎన్నో రాత్రులుఈ సినిమా పరిశోధనల్లో తెలిసిన విషయాల వల్ల తాను ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపానని కాజల్ అగర్వాల్ వెల్లడించారు. "నేను షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లాక కూడా ఈ సినిమా కథ గురించే ఆలోచించేదాన్ని.