
మోదీఫ్రెండ్స్ అదుర్స్.. డైలీ తిండి పెడుతున్నప్రధాని.. క్యూట్ లవింగ్స్టోరీ..వీడియో వైరల్
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. PM Modi's video: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఒక ఇంట్రెస్టింగ్.. గుండెను హత్తుకునే సన్నివేశం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి.. జాతిని ఉద్దేశించి ప్రసంగించే ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ తన లోక్ కల్యాణ్ మార్గ్ నివాసంలో నెలకున్న ఒక ఆహ్లాదకరమైన ఘట్టాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రతిరోజూ ఉదయాన్నే తన నివాసంలోని మూగజీవాలు, పశువులకు మేత వేయడం ప్రధాని మోదీకి అలవాటు. అయితే ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట దగ్గర వేడుకల కోసం ఆయన ఉదయాన్నే బయలు దేరాల్సి వచ్చింది. ఈ క్రమంలో జరిగిన అనుభవాన్ని ప్రధాని ఇన్ స్టాగ్రామ్ లో గుర్తు చేసుకుంటూ.. రోజూ ఉదయం నా మిత్రులకు మేత పెట్టడం నా దినచర్య. కానీ నిన్న ఉదయం నేను తొందరగా బయలుదేరుతున్నానని గ్రహించి కావచ్చు..నేను ఎర్రకోటకు వెళ్లే ముందు నన్ను కలిసేందుకు వచ్చాయి అని పేర్కొన్నారు. ఈ ఫొటోలను షేర్ చేస్తే స్పెషల్ యాస్ ఆల్ వేస్ అని ముగించారు. ఇక మోదీ ఎర్రకోట వేడుకల కోసం ప్రత్యేకంగా ధరించిన సాంప్రదాయ ఆఫ్ వైట్ కుర్తా పైజామా, బ్రౌన్ కలర్ జాకెట్, రెడ్ కలర్ బాంధానీ స్టైల్ తలపాగాతో మోదీ ఆకట్టుకున్నారు. పండగ వాతావరణంలో ప్రసంగానికి వెళ్లే ముందు ఎంతో ప్రశాంతంగా ఆవులకు గడ్డి, నెమళ్లకు గింజలు వేస్తూ గడిపిన ద్రుశ్యాలు ఆయన ప్రక్రుతి ప్రేమికుడనే విషయాన్ని మరోసారి చాటిచెప్పాయి. ప్రధాని నివాసంలో ఆంధ్రాకు చెందిన అరుదైన పుంగనూరు జాతి ఆవులు కూడా ఉన్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ తన సోషల్