Yeshanagula Song: ‘ఏష నాగుల కట్టమీద’ మరో రికార్డ్.. కేవలం 17 రోజుల్లోనే ఆ ఫీట్ సాధించిన తొలి తెలుగు పాట
నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఇందులోని ‘ఏష నాగుల’ పాట సరికొత్త రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ తెలంగాణ ఫోక్ రీమిక్స్.. కేవలం 17 రోజుల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న తొలి తెలుగు పాటగా ఆల్టైమ్ రికార్డ్ నెలకొల్పింది.

