
ఆయ్.! నేను వెజిటేరియన్.. కుక్క పిల్లను పట్టుకుని చంపకుండా వదిలేసిన చిరుత.. వీడియో వైరల్
Viral Video: ఆయ్.! నేను వెజిటేరియన్.. కుక్క పిల్లను పట్టుకుని చంపకుండా వదిలేసిన చిరుత.. వీడియో వైరల్ ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Viral Video: ఆయ్.! నేను వెజిటేరియన్.. కుక్క పిల్లను పట్టుకుని చంపకుండా వదిలేసిన చిరుత.. వీడియో వైరల్ ఈ వార్తకు సంబంధించిన

Huawei సంచలనం - నేడే ఒకేసారి 5 కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ - Watch GT 7 నుండి MatePad Pro వరకు - Munich లో Chase The Wild ఈవెంట్ లైవ్!

వర్షాకాలంలో లభించే అతి ముఖ్యమైన కూరగాయల్లో బోడ కాకరకాయ ఒకటి.. దీనిని అడవి కాకరకాయ అని కూడా పిలుస్తారు. ఈ సీజనల్ కూరగాయ జూన్ నుండి సెప్టెంబర్ మాసం వరకు ఎక్కువగా లభిస్తుంది. నగర మార్కెట్లలో, ముఖ్యంగా రైతు బజార్లలో బోడ కాకరకాయలు విస్తృతంగా విక్రయిస్తారు. ఈ కూరగాయకు ప్రస్తుతం అసాధారణమైన డిమాండ్ ఉంది.. ప్రధానంగా దాని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల వల్ల ఎంతో మంది దీనిని తినేందుకు ఇష్టపడతారు. బోడ కాకరకాయలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ (కరోటిన్), విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్ తోపాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్ లభిస్తాయి. దీనిలోని డైటరీ ఫైబర్ (ఫైబర్) జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. బోడ కాకరకాయలో అనేక పోషక విలువలు దాగి ఉన్నాయి. ఇది ముఖ్యంగా షుగర్ (మధుమేహం) స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే షుగర్ వ్యాధితో బాధపడేవారు దీన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉండటం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు బోడ కాకరకాయలో పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల ఇది బరువు తగ్గాలనుకునే వారికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఎంపిక. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పండే బోడ కాకరకాయ ఇప్పుడు నగర ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తోంది. రైతులు తమ పొలాల నుండి తాజా బోడ కాకరకాయలను నేరుగా రైతు బజార్లకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఈ కాయలు చాలా తాజాగా, మంచి ఆకృతితో కనిపిస్తాయి. ఇవి కొంత బొడిపెలుగా, గుండ్రంగా ఉంటాయి. బోడ కాకరకాయ రుచి కూడా ఎంతో బాగుంటుంది. దీన్ని కూరగా వండుకోవచ్చు

చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంత పరిధిలోని పాపిరెడ్డిగారిపల్లె వద్ద ఓ మామిడి తోటలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మగ ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. అమరావతి, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంత పరిధిలోని పాపిరెడ్డిగారిపల్లె వద్ద ఓ మామిడి తోటలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మగ ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోర్వెల్ మోటార్‌కు అనుసంధానించిన తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగ ఏనుగుకు తగలడం, ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండటంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చనేది ప్రాథమికంగా అంచనా వేశామని అధికారులు చెప్పారని అన్నారు. ఈ మేరకు ఎక్స్(X)లో పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు. విద్యుత్ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.. ఏనుగు మృతి ఘటనపై విచారణ చేపట్టి, నివేదికను సమర్పించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. వన్యప్రాణి నిబంధనలు, నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఏనుగును ఖననం చేయాలని సూచించారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టింది: సీఎం చంద్రబాబు పవన్ కల్యాణ్ ఆదేశాలు.. ఏపీలో పర్యావరణ పరిరక్షణకు స్పెషల్ డ్రైవ్ రోశయ్య స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేశ్

ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన వరదల్లో కొట్టుకుపోయి తీవ్రంగా గాయపడిన 53 ఏళ్ల ‘జాయ్మతి’ అనే ఆడ ఏనుగుకు అత్యవసర వైద్యం అందించేందుకు వంతారా రంగంలోకి దిగింది. నాగాలాండ్‌లోని నామ్‌సాంగ్ ప్రాంతంలో దికో నదిలో వరద ఉధృతికి కొట్టుకుపోయి, అస్సాంలోని శివసాగర్ జిల్లా బిహుబోర్ వద్ద ఒడ్డుకు చేరిన ఈ ఏనుగును అధికారులు, స్థానికులు కాపాడారు. అయితే, వరద ఉధృతి కారణంగా జాయ్మతి శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. వరద నీటిలో కొట్టుకుపోవడం వల్ల జాయ్మతి నుదురు, చెవులు, పొత్తికడుపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. కొన్ని అవయవాల వద్ద తీవ్రమైన పుండ్లు ఏర్పడగా, కుడి కన్ను దెబ్బతిని దృష్టి కోల్పోయింది. అంతేకాకుండా, గతంలో ఎడమ కాలు విరగడం వల్ల నడవలేక ఇబ్బంది పడుతోంది. వయసు పైబడటం, తీవ్రమైన గాయాల నేపథ్యంలో రోడ్డు మార్గంలో సుదీర్ఘ ప్రయాణం ఏనుగుకు మరింత శ్రమ కలిగిస్తుందని నిపుణులు భావించారు. దాంతో అత్యవసర వైద్యం కోసం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న వంతారా ఏనుగుల ఆస్పత్రికి ఎయిర్‌లిఫ్ట్ ద్వారా తరలించాలని నిర్ణయించారు. అస్సాంలో వైద్య కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదన వంతారా ప్రతినిధులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. జాయ్మతి తరలింపు కేవలం తాత్కాలిక అత్యవసర వైద్యం కోసమేనని, కోలుకున్నాక తాన భద్రతను పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఈశాన్య ప్రాంతంలో ఇటువంటి అత్యవసర పరిస్థితులను స్థానికంగానే ఎదుర్కొనేందుకు అస్సాం అటవీ శాఖ ఆధ్వర్యంలో స్వతంత్రంగా పనిచేసేలా మూడు ప్రత్యేక వన్యప్రాణి వైద్య కేంద్రాలను (ప్రత్యేకంగా ఏనుగుల కోసం ఒక కేంద్రాన్ని) ఏర్పాటు చేయడానికి వంతారా ముందుకు వచ్చింది. ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్‌టాప్‌ల్లో కొత్త టూల్ వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు..ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు) 20

ఈశాన్య భారతంలో ప్రకృతి కోపానికి, పొంగిపొర్లిన వరద రాకాసికి జీవితం అల్లకల్లోలమైన వేళ.. ఓ మూగజీవం మరణపు అంచుల దాకా వెళ్లి నిలబడింది. 53 ఏళ్ల వయసున్న జాయ్మతి అనే ఆడ ఏనుగు వరద ఉధృతిలో కొట్టుకుపోయి సాయం కోసం దిక్కుతోచని స్థితిలో అలమటించింది.అయితే, మానవత్వం ఇంకా చావలేదని నిరూపిస్తూ అటవీ శాఖ, స్థానిక ప్రజలు దాన్ని ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. తీవ్ర గాయాలతో రోదిస్తున్న ఆ ఐరావతానికి ఇప్పుడు ఊహించని రీతిలో పునర్జన్మ లభించబోతోంది. అత్యవసర శస్త్రచికిత్సల కోసం ఈ ఏనుగును ఏకంగా ప్రత్యేక విమానంలో గుజరాత్‌లోని అత్యంత ప్రాచుర్యం పొందిన వంతారా ఆసుపత్రికి తరలిస్తున్నారు. దేశ చరిత్రలోనే ఒక ఏనుగును విమానంలో తరలించడం ఇదే తొలిసారి!గత జులై నెలలో నాగాలాండ్, అస్సాం ప్రాంతాలను ముంచెత్తిన వరదల్లో జాయ్మతి కొట్టుకుపోయింది. ఉద్ధృతంగా పారే నీటి ప్రవాహంలో రాళ్లు, రప్పలు గుద్దుకోవడంతో దాని దేహమంతా క్షతగాత్రమైంది. నడుము, చెవులు, తోక, పొత్తికడుపు భాగాల్లో లోతైన గాయాలయ్యాయి.అంతకుముందే కలప మోసే పనుల్లో ఒక కాలు విరిగిపోవడంతో నడవలేని స్థితిలో ఉన్న ఈ ఏనుగు, వరద దెబ్బకు ఒక కంటి చూపును కూడా శాశ్వతంగా కోల్పోయింది. కంటి నుంచి నిరంతరం నీరు కారుతున్నా, అడుగు తీసి అడుగు వేయలేక నరకయాతన అనుభవిస్తున్నా.. ఆ మూగజీవి కళ్లలో జీవించాలనే ఆశ మాత్రం చావలేదు. ఏనుగు కోసం సుప్రీంకోర్టు తీర్పు! కస్టడీకి ఇస్తూ కామెంట్స్రోడ్డు ప్రయాణపు నరకం వద్దు.. ఆకాశ మార్గాన వంతారాకు!గాయపడిన ఏనుగును రోడ్డు మార్గాన వందల కిలోమీటర్లు తీసుకెళ్తే, ఆ ప్రయాణపు నొప్పులను తట్టుకోవడం దాని వల్ల కాదు. ఈ పరిస్థితిని గమనించిన వెటర్నరీ వైద్యులు దాని ప్రయాణ భారాన్ని తగ్గించేందుకు విమానంలో తరలించడమే సరైన మార్గమని నిర్ణయించారు. అనంత్ అంబానీ నేతృత్వంలోని వంతారా సంస్థ వెంటనే స్పందించి, నిపుణులైన వైద్య బృందం సంరక్షణలో జాయ్‌మతికి ఎలాంటి శ్రమ కలగకుండా ప్రత్యేకంగా సిద్ధం చేసిన విమానంలో గుజరాత్‌లోని

అది అట్లాంటిక్ మహాసముద్రపు తీరం.. చుట్టూ దట్టమైన అడవి, పక్షుల కిలకిలా రావాలు, నీటి అలల సప్పుడు తప్ప మనుషుల అలికిడే ఉండదు. వినడానికి ఏదో హర్రర్ సినిమాలో సైలెంట్ ఐలాండ్ లా అనిపించినా.. ఇది అమెరికాలోని మైనే తీరంలో ఉన్న విచ్ ఐలాండ్ (Witch Island) కథ! సరిగ్గా 18 ఎకరాల వైశాల్యం ఉన్న ఈ చిన్న దీవి వెనుక నమ్మశక్యం కాని ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. ఒకప్పుడు సముద్రపు దొంగలు దాక్కునే స్థలంగా, ఆ తర్వాత దెయ్యాల దీవిగా ప్రచారంలోకి వచ్చి.. చివరకు ఒక రహస్య మహిళ చేతి నుంచి పక్షులు, వన్యప్రాణుల రక్షణ కేంద్రంగా ఎలా మారిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.1630ల కాలంలో డిక్సీ బుల్ అనే ప్రసిద్ధ సముద్రపు దొంగ తన దోపిడీ సొత్తును దాచడానికి ఈ దీవిని ఒక సీక్రెట్ స్థావరంగా వాడుకునేవాడని ఇక్కడ ప్రచారంలో ఉన్న పాత కథ. ఆ తర్వాత ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ఓడలు ఇక్కడే దాక్కునేవట. కాలక్రమేణా ఈ దీవి పలువురి చేతులు మారింది. అయితే 1887లో డానియల్, అన్నా చిట్టెండెన్ అనే దంపతులు వేలంలో ఈ దీవిని కొనుగోలు చేయడంతో దీని అసలు కథ ప్రారంభమైంది.ఎవరీ విచ్ ఆఫ్ వాల్ స్ట్రీట్?అన్నా అనే మహిళ జీవితం ఒక హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. చిన్నతనంలోనే కష్టాలు అనుభవించి, నాటకరంగంలో రాణించి, ఒక భారీ ఓడ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు ఎలా పెరుగుతాయో ముందుగానే ఊహించి చెప్పే విచిత్ర శక్తి తన వద్ద ఉందంటూ వాల్ స్ట్రీట్‌లో అడుగుపెట్టింది. పెద్ద పెద్ద బ్యాంకర్లు, స్టాక్ బ్రోకర్లు ఆమె జోస్యాలు విని పెట్టుబడులు పెట్టేవారు. దీంతో ప్రతిఒక్కరూ ఆమెను ప్రేమగా, భయంగా విచ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ (వాల్ స్ట్రీట్ మంత్రగత్తె) అని పిలవడం

అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే కాలినడక మార్గానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నాలుగు కాళ్లతో నడిచే క్వాడ్రుపెడ్ రోబోట్ డాగ్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించింది. సాధారణ నిఘా కెమెరాలు, ఫుట్ పెట్రోలింగ్ ద్వారా చేరుకోవడం కష్టమైన ప్రాంతాల్లోకి వెళ్లి పరిస్థితులను పరిశీలించే సామర్థ్యం ఈ రోబోట్‌కు ఉంది. తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద నిర్వహించిన ట్రయల్‌లో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు రోబో పనితీరును పరిశీలించారు. తిరుమల కొండల్లోని కొన్ని అటవీ ప్రాంతాలు సాధారణ సిబ్బంది నిరంతరం పర్యటించేందుకు అనుకూలంగా ఉండవు. ఎత్తుపల్లాలు, రాళ్లు, మెట్లు, గుట్టలు, దట్టమైన వృక్ష సంపద ఉన్న ప్రాంతాల్లో మానవ నిఘాకు పరిమితులు ఉంటాయి. ఇలాంటి ప్రదేశాల్లో రోబో డాగ్‌ను మోహరించడం ద్వారా మరింత విస్తృతంగా పర్యవేక్షణ చేపట్టే అవకాశం ఉంటుంది. నాలుగు కాళ్ల నిర్మాణం కారణంగా సమానంగా లేని నేలపైనా ఇది సమతుల్యతను కాపాడుకుంటూ ముందుకు కదలగలదు. అవసరాన్ని బట్టి వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు దీనిని త్వరగా తరలించవచ్చు. దీంతో సిబ్బంది నేరుగా ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లాల్సిన అవసరం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. రోబో డాగ్లో సాధారణ కెమెరాలతో పాటు థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 360 డిగ్రీల లైడార్, వివిధ సెన్సర్లు అమర్చినట్లు అధికారులు తెలిపారు. వీటి సాయంతో పరిసరాలను వివిధ కోణాల్లో పరిశీలించవచ్చు. ముఖ్యంగా వెలుతురు తక్కువగా ఉన్న సమయంలో థర్మల్ కెమెరా ద్వారా ఉష్ణోగ్రత ఆధారిత చిత్రాలను సేకరించే అవకాశం ఉంటుంది. దట్టమైన పొగమంచు, చీకటి వంటి పరిస్థితుల్లోనూ పరిసరాల్లో కదులుతున్న జీవులను గుర్తించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. సేకరించిన సమాచారం ఆధారంగా అటవీ ప్రాంతంలో ఏ సమయంలో, ఏ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉంటున్నాయనే అంశంపై టీటీడీకి మరింత స్పష్టమైన సమాచారం లభించే అవకాశం

రైల్వే ట్రాక్‌ను భారీ ఏనుగుల గుంపు దాటుతోంది. అంతలో ట్రాక్‌పై దూసుకు వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు కొంత దూరంలో ఆగిపోయింది. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ డెస్క్: రైల్వే ట్రాక్‌ను భారీ ఏనుగుల గుంపు దాటుతోంది. అంతలో ట్రాక్‌పై దూసుకు వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు కొంత దూరంలో ఆగిపోయింది. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఏనుగుల గుంపు ట్రాక్ వైపు రావడాన్ని అటవీ శాఖ అధికారి గుర్తించారు. వెంటనే ఆయన స్పందించారు. ట్రాక్‌పై వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆపాలంటూ ఆయన సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఆ ఏనుగుల గుంపు ట్రాక్ దాటే వరకు రైలును ఆపేశారు. ఈ వీడియోను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అటవీ ప్రాంతంలో రైల్వే ట్రాక్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్న ఫలితం మాత్రం దారుణంగా ఉంటుందని అంటున్నారు. అయితే అస్సాంలో ఇది సర్వ సాధారణం అని పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై అధికారులు నిఘా ఉంచుతారు. అటవీ ప్రాంతంలో నుంచి వచ్చే ఏనుగుల గుంపును గమనించిన వెంటనే.. వారు రైల్వే అధికారులను లేదా ఎక్స్‌ప్రెస్ రైలులోని లోకో పైలట్‌ను అప్రమత్తం చేస్తారు. దీంతో ఆ జీవులు ట్రాక్ దాటే వరకు రైలును నిలిపివేస్తారు. మమ్మల్ని అలా పిలవద్దు.. నెటిజన్లను కదిలిస్తున్న చిన్నారి ఆవేదన మృత్యువు అంచుల దాకా వెళ్లి తప్పించుకున్నాడు.. వీడియో వైరల్

Name: Columnar Cactus శాస్త్రీయ నామం: సెరెస్ ప్టెరొ గోనస్ Scientific Name: Cereus pterogonus Lem Synonym (s) : Cereus repandus (L.) Mill. కుటుంబం: క్యాక్టేసి Family: Cactaceae కోలజెమ్మెడు పండును వేర్వేరు భాషల్లో ఏమని పిలుస్తారంటే.. ఇంగ్లీష్: సెంటి నేల్ క్యాక్టస్, డాగ్ టేల్ క్యాక్టస్, హెడ్జ్ క్యాక్టస్ తమిళం: సిప్పాల్ కథలై; మలయాళం: పుచ్చముళ్ళు; బెంగాలీ: మానస తెలుగు: కోలజెమ్మెడు, జెమ్మడు, నిటారు జెమ్మెడు. వేరే భాషల్లో దీనికి గుర్తింపు తక్కువ. గ్రామాల్లో ఉండే జెమ్మెడు రకాలలో కోలజెమ్మెడు ఒకటి. ఊర్లలో చాలామందికి తెలిసిన చెట్టు. ఈ జెమ్మెడులో కూడా డ్రాగన్ ఫ్రూట్ మాదిరిగా మే నుంచి నవంబర్ మాసం వరకు అంచెలంచెలుగా పూత–కాత వస్తుంది. దీన్ని నైట్ బ్లూమింగ్ సెరెస్ అని కూడ అంటారు. దీనిలో దాదాపు 33 జాతులు ఉన్నాయని అంచనా. ఉనికి: ఇవి మెట్ట ప్రాంత మైదానాలు, అడవుల్లో ఎక్కువగా పెరుగుతాయి. నిటారుగా గుంపులుగా పెరుగుతాయి. దాదాపు 3–6 మీటర్ల ఎత్తువరకు పెరగగలవు. వీటికి కణుపులు ఉంటాయి. వీటి ఉనికి ఎక్కువగా ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణమండలపు ప్రాంతాల్లో ఉంది. దీనికి డ్రాగన్ పండు చెట్టుకు అతిదగ్గరి పోలిక ఉంది. దీనికి ముళ్లతో కూడుకున్న ఆరు నుంచి ఎనిమిది భుజాలు ఉంటాయి. వీటి స్వస్థలం, బ్రెజిల్, ఊరుగామ్, అర్జెంటీనా. వీటి ఉనికి దక్షిణ అమెరికా, ఇండియా, చైనా, శ్రీలంక, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా ఉంది. ఇండియాలో చాలా రాష్ట్రాలలో వీటి ఉనికి ఉంది. నల్లమల అడవులతో ΄ాటు మైదానపు ప్రాంతాలు, పొలం గట్లు తదితర చోట్ల పెరుగుతుంది. ఈ చెట్లు వాతావరణ మార్పులను తట్టుకోగలవు. పోషక ఔషధ నిధులు కోలజెమ్మెడు చెట్లను పొలం చుట్టూ జీవ కంచెగా పెంచుతారు. వీటిని అందం కోసం కుండీలలో పెంచుకోవచ్చు. పండ్లను తింటారు, చప్పటి రుచి ఉంటాయి. కాని నల్లమల అడవుల్లో ఈ పండ్లను జనం తినరు

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. బుధవారం నాడు ఏకంగా 76,464 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 36,913 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.94 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది.టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.27 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 2.63 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో మొత్తం 3,494 మంది శ్రీవారి వైద్య సేవను అందుకున్నారు. రద్దీ నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.కాగా.. తిరుమలలో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, భక్తుల భద్రతను మరింత పటిష్టం పర్చడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే దిశగా టీటీడీ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రోబో డాగ్ ను అందుబాటులోకి తీసుకుని రానుంది. ఈ క్వాడ్రుపెడ్ రోబో పనితీరును టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి.. తిరుమల పద్మావతి అతిథి గృహం వద్ద పరిశీలించారు.Tirumala: తిరుమలలో శరవేగంగా.. : టీటీడీ తక్షణ ఆదేశాలు జారీఅటవీ ప్రాంతాల్లో మనుషులు వెళ్లలేని, ప్రమాదకర ప్రదేశాల్లో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించడానికి ఈ రోబోను వినియోగించే అవకాశాలపై ఆరా తీశారు. ఇందులో ఆప్టికల్ కెమెరా, థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 360 డిగ్రీల లైడార్, వివిధ సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అమర్చారు. వీటి సహాయంతో చీకటి, పొగమంచు వంటి పరిస్థితుల్లోనూ వన్యప్రాణుల కదలికలను గుర్తించడం సాధ్యపడుతుంది.అడకత్తెరలో కేంద్రం: వరుస దెబ్బలు- వెన్ను చూపక తప్పట్లేదు.. !!వన్యప్రాణులు, మనుషులు, వాహనాలు, పశువులను గుర్తించి వర్గీకరించే సామర్థ్యం.. ఇందులో అమర్చిన ఆర్టిఫిషియల్
తిరుమలలో వన్యప్రాణుల కదలికల పర్యవేక్షణ, శ్రీవారి భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా గురువారం తిరుమల పద్మావతి అతిథి గృహం వద్ద నాలుగు కాళ్ల రోబోట్ డాగ్ పనితీరును టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి పరిశీలించారు. అటవీ ప్రాంతాల్లో మనుషులు వెళ్లేందుకు ఇబ్బందికరమైన, ప్రమాదకరమైన ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేందుకు ఈ రోబోట్ డాగ్‌ను వినియోగించేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు.ఈ రోబోట్ డాగ్లో ఆప్టికల్ కెమెరా, థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 360 డిగ్రీల లైడార్, సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నాయి. వీటి సహాయంతో చీకటి, పొగమంచు వంటి సమయాల్లోనూ వన్యప్రాణుల కదలికలను గుర్తించి పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. రోబోట్‌లోని ఏఐ వ్యవస్థ పెద్ద జంతువులు, మనుషులు, వాహనాలు, పశువులను గుర్తించి వర్గీకరించే సామర్థ్యం కలిగి ఉంది. వన్యప్రాణుల కదలికలను గుర్తించినప్పుడు జియో-ట్యాగ్డ్ అలర్ట్‌ను పంపించడం.. లైవ్ వీడియో, థర్మల్ ఫీడ్‌ను కంట్రోల్ రూమ్, పెట్రోలింగ్ సిబ్బందికి అందించేలా దీనిని రూపొందించారు.దీని ద్వారా అలిపిరి కాలిబాటకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణుల సంచారాన్ని ముందుగానే గుర్తించి భక్తులను అప్రమత్తం చేయవచ్చని టీటీడీ భావిస్తోంది. అలాగే ఈ సమాచారాన్ని అటవీ, విజిలెన్స్, భద్రతా సిబ్బందికి వేగంగా స్పందించేందుకు ఈ రోబోట్ డాగ్ ఉపయోగపడుతుందని భావిస్తు్న్నారు. వన్యప్రాణులు భక్తుల వైపు వచ్చినప్పుడు రోబోట్‌లోని సౌండ్, లైట్ యూనిట్లను ఉపయోగించి... వాటిని తిరిగి అటవీ ప్రాంతం వైపు మళ్లించేందుకు ఉన్న అవకాశాలను కూడా టీటీడీ పరిశీలిస్తోంది. అటవీ ప్రాంతాల్లో రోబోట్ డాగ్ ద్వారా సేకరించే సమాచారాన్ని విశ్లేషించి..అవసరమైన ప్రాంతాల్లో సిబ్బంది పెట్రోలింగ్ సమయాలు, నిఘాను మెరుగుపరచవచ్చని టీటీడీ భావిస్తోంది

మన చిన్నతనంలో వీధుల్లోకి ఎలుగుబంటిని తీసుకువచ్చి, డప్పులు వాయిస్తుంటే అది కాళ్లు గాలిలోకి లేపి ఊగుతుంటే చూసి సంబరపడని వారుండరు. కానీ, ఆ అమాయక ప్రాణి చేసినది నాట్యం కాదు.. తట్టుకోలేని నరకయాతనతో పెట్టిన కేకలని మనలో ఎంతమందికి తెలుసు? మొఘలుల కాలం నుంచి అంటే దాదాపు 400 ఏళ్లుగా కలందర్ అనే సంచార తెగవారు ఈ ఎలుగుబంట్లను ఆడించడాన్నే తమ ప్రధాన జీవనోపాధిగా మలుచుకున్నారు. అయితే ఆ వినోదం వెనుక ఎంతటి ఘోరమైన క్రూరత్వం దాగుందో తెలిస్తే గుండె తరుక్కుపోతుంది.ముక్కుకు సూది గుచ్చి.. గుండెను పిండేసిన బాధ!ఈ ఆట కోసం కలందర్లు అడవుల్లోకి వెళ్లి తల్లి ఎలుగుబంటిని దారుణంగా చంపేసేవారు. తల్లిని కోల్పోయిన పసి ఎలుగుబంటి పిల్లలను తీసుకొచ్చి శిక్షణ ఇచ్చేవారు. ఎలాంటి మత్తు మందు ఇవ్వకుండానే.. ఎలుగుబంటి ముక్కు భాగాన్ని దళసరి సూదితో గట్టిగా పొడిచి, దానికి గొలుసు లేదా తాడు కట్టేవారు. ఎద్దులకు ముక్కుతాడు వేసినట్లుగా ఆ తాడును గట్టిగా పైకి గుంజినప్పుడల్లా.. ఆ దారుణమైన నొప్పిని తట్టుకోలేక ఎలుగుబంటి గాలిలోకి ఎగిరేది. లోపల ప్రాణం పోయేంత నొప్పి ఉంటే, బయట జనం మాత్రం అది డాన్స్ చేస్తోందని భావించి చప్పట్లు కొట్టేసేవారు. పంటి గాయాలు చేయకుండా ఉండటానికి వాటి కోరపళ్లను సుత్తితో విరగ్గొట్టేవారు.అడవి ప్రాణుల కోసం కదిలిన ఇద్దరు మనుషులు!తరతరాలుగా సాగుతున్న ఈ దారుణాన్ని గమనించిన కార్తీక్ సత్యనారాయణ్, శేషమ్మ అనే ఇద్దరు వ్యక్తులు చలించిపోయారు. ఈ క్రూరత్వానికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని నిశ్చయించుకుని 1995లో వైల్డ్ లైఫ్ SOS (Wildlife SOS) అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. వాస్తవానికి మన దేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం - 1972, 1998లో వచ్చిన చట్ట సవరణల ద్వారా ఎలుగుబంట్లను బంధించడం, ప్రదర్శించడం చట్టవిరుద్ధం చేశారు.శృంగారంలో పాల్గొంటే ట్యాక్స్, ఇన్సూరెన్స్, పెన్షన్.. వ్యభిచారానికి చట్టబద్ధతకానీ ఈ చట్టాలు వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా చాలా ప్రాంతాల్లో ఎలుగుబంట్ల డాన్స్

Amazon River : దక్షిణ అమెరికా ఖండంలో ప్రవహించే అమెజాన్ నది కేవలం ఒక నీటి ప్రవాహం మాత్రమే కాదు, అది ఈ భూగోళానికి జీవనాడి. ప్రపంచంలోనే అత్యధిక నీటి ప్రవాహం కలిగిన నది ఈ అమెజాన్. దట్టమైన అడవుల గుండా ప్రయాణం, అరుదైన జీవరాశులు, విస్మయపరిచే సహజ వింతలతో నిండిన ఈ నది గురించి తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. పెరూ దేశంలోని ఆండిస్ పర్వతాల్లో పుట్టే ఈ అమెజాన్ నది బ్రెజిల్ లో అట్లాంటిక్ మహా సముద్రంలో కలుస్తుంది. మధ్యలో మరో దేశం కొలంబియాలో కూడా ఈ నది ప్రవహిస్తుంది. ఇలా మూడు దేశాల గుండా దాదాపు 6,400 కిలోమీటర్ల (4,000 మైళ్ళు) దూరం ప్రయాణిస్తుంది. ప్రపంచంలోని అన్ని నదుల నుండి సముద్రాల్లో కలిసే నీటిలో 15 నుండి 20 శాతం ఈ అమెజాన్ నదివే. ఇలా ప్రపంచంలో అత్యధిక నీటి ప్రవాహం గల ఇలాంటి నదిపై ఒక్కటంటే ఒక్క బ్రిడ్జ్ లేకపోవడం ఆశ్చర్యకరం. వేల కిలోమీటర్ల పొడవునా ప్రవహించే అమెజాన్ నదిపై ఒక్కటంటే ఒక్క వంతెన (Bridge) కూడా లేకపోవడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. దట్టమైన వర్షాధార అడవులు ఉండటం, తీరం వెంట జనాభా చాలా తక్కువగా నివసించడం వల్ల ఇక్కడ వంతెనల అవసరం పడలేదు. పైగా వర్షాకాలంలో ఈ నది వెడల్పు విపరీతంగా పెరిగిపోతుంది. నది ఒడ్డున ఉన్న మట్టి చాలా మెత్తగా ఉండటం వల్ల ఇక్కడ వంతెనలు నిర్మించడం భౌగోళికంగా కూడా కష్టంతో కూడుకున్న పని. ఇక్కడి ప్రజలు రవాణా కోసం ఎక్కువగా పడవలు, ఫెర్రీలనే ఉపయోగిస్తారు. అమెజాన్ నది ప్రవాహ పరిమాణం (Water Discharge) విషయంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని సముద్రాల్లోకి కలిసే మొత్తం మంచి నీటి ప్రవాహంలో దాదాపు 20 శాతం నీరు ఒక్క అమెజాన్ నది నుంచే వస్తుంది. ఈ నది గుండా సెకనుకు ప్రవహించే నీటి పరిమాణం దాదాపు

మానుకోట జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలో చిరుతపులి కనిపించిందని ఓ రైతు తెలపడంతో తీవ్ర కలకలం రేపుతోంది. కేసముద్రం(మహబుబాబాద్): మానుకోట జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలో చిరుతపులి కనిపించిందని ఓ రైతు తెలపడంతో తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామ శివారుల్లోని ఓ గ్రానైట్ క్వారీ వైపు వ్యవసాయ భూమి ఉన్న గండికోట కుమార్ తన పొలం వద్దకు వెళ్లగా చిరుతపులి కనిపించిందని గ్రామస్తులకు తెలిపాడు. సోమవారం సాయంత్రం తన పొలం వద్ద దూరంగా చిరుతపులిని చూసిన కుమార్ తీవ్ర భయాందో ళనకు గురయ్యాడు. తన పెంపుడు కుక్కతో సహా సమీపంలోని ఒక బావిగుంతలో దాక్కున్నట్లు పేర్కొన్నాడు. పులి వెళ్లిపోయిన తర్వాత తన పొలంలోని పాదముద్రలను ఫోన్లో ఫోటో తీసి గ్రామంలోని వాట్సాప్ గ్రూపులో పోస్టు చేయడంతో కలకలం రేపుతోంది. ఈ పులి ఆయనకు గత రెండు రోజులుగా కనిపిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలాఉండగా మూడు రోజుల క్రితం గూడూరు మండలం బొల్లెపల్లి ప్రాంతంలోనూ చిరుత కనిపించిందని అటవీశాఖాధికారులకు సమాచారం అందింది. అయితే అటవీశాఖాధికారులు వెతికినప్పటికీ పులిజాడ కనిపించలేదని తెలిసింది. ఈ విషయంపై అటవీశాఖ సిబ్బంది మాట్లాడుతూ అర్పనపల్లి లో పాదముద్రలు లభించినట్లు గ్రామస్తులు సమాచారం అందించారని, ఇది అడవిపిల్లి పాదముద్రలు కూడా అయి ఉండొచ్చన్నారు. కాగా.. ఈ విషయంపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తామని వెల్లడించారు. బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే
Lakshmi Mittal Ukraine Factory Attack : రష్యా-ఉక్రెయిన్ నడుమ సాగుతున్న యుద్ధం మొదలై నాలుగేళ్లు గడుస్తున్నా.. వారు మాత్రం పోరాటం ఆపడం లేదు. ఏ ఒక్కరూ వెనక్కి తగ్గకుండా.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ దాడులు మరింత ఉద్ధృతమయ్యాయి. ఈ ఘర్షణల క్రమంలోనే భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ లక్ష్మీ మిత్తల్‌కు చెందిన భారీ స్టీల్ ప్లాంట్‌పై రష్యా క్షిపణి విరుచుకుపడింది. ఉక్రెయిన్‌లోని క్రివి రిహ్ నగరంలో ఉన్న ఆర్సెలార్ మిత్తల్ మైనింగ్ అండ్ మెటలర్జికల్ కాంప్లెక్స్ లక్ష్యంగా ఈ దాడి జరిగ్గా... ఈ ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.ఉక్రెయిన్‌లోనే అత్యంత పెద్ద స్టీల్ తయారీ సంస్థపై దాడిఉక్రెయిన్లోనే అత్యంత పెద్ద స్టీల్ తయారీ సంస్థగా ఉన్న ఆర్సెలార్ మిత్తల్ కాంప్లెక్స్‌పై జరిగిన ఈ దాడి వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. రష్యా క్షిపణి ధాటికి ఫ్యాక్టరీలోని కీలకమైన కోర్ ఎనర్జీ రంగాలు, బ్లాస్ట్ ఫర్నేస్ విభాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా ప్లాంట్ పరిధిలో ఉక్కు ఉత్పత్తి పాక్షికంగా నిలిచిపోయినట్లు సదరు సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై కూడా రష్యా విరుచుకుపడింది. ఈ దాడుల ప్రభావంతో నగరంలోని అత్యంత పెద్ద బుక్ మార్కెట్లో భారీగా మంటలు చెలరేగాయి. పౌర సదుపాయాలే లక్ష్యంగా పుతిన్ సేనలు దాడులకు తెగబడుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తీవ్రంగా మండిపడ్డారు.ఉక్రెయిన్ డ్రోన్ల దాడితో.. రష్యా ప్రతీకార చర్యలుగత కొన్ని రోజులుగా రష్యాలోని సైనిక కర్మాగారాలు, ఇంధన మౌలిక సదుపాయాలను ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకుంటోంది. దీనివల్ల రష్యా ప్రభుత్వం తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. ఆదివారం రష్యా వ్యాప్తంగా ఉక్రెయిన్ వందలాది డ్రోన్లతో దాడికి దిగింది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఉక్రెయిన్ జరిపిన అతిపెద్ద గగనతల దాడుల్లో ఇది కూడా ఒకటి కాగా.. ఈ ఘటనల్లో

ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ స్వస్థలమైన క్రివి రిహ్‌లోని ఆర్సెలార్ మిట్టల్ మైనింగ్ అండ్ మెటలర్జికల్ కాంప్లెక్స్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. భారత సంతతికి చెందిన బిలియనీర్ లక్ష్మీ మిట్టల్ యాజమాన్యంలోని ఈ ప్లాంట్ ఉక్రెయిన్‌లోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి కేంద్రం. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్ సరఫరా, బ్లాస్ట్ ఫర్నేస్‌లకు తీవ్ర నష్టం వాటిల్లడంతో ఫ్యాక్టరీలో ఉత్పత్తిని పాక్షికంగా నిలిపివేసినట్లు యాజమాన్యం ధ్రువీకరించింది.Russia- Ukraine war: రష్యా ఖేల్ ఖతం.. 1000 కుపైగా డ్రోన్ లతో విధ్వంసంరష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు రష్యా భూభాగంపై ఉక్రెయిన్ చేపట్టిన వందలాది డ్రోన్ దాడులకు ప్రతీకారంగానే రష్యాఈ చర్యకు పూనుకుంది. రష్యాపై కీవ్ జరిపిన దాడులలో దాదాపు 822 డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని రష్యా ప్రకటించింది. అయినప్పటికీ ఉక్రెయిన్ జరిపిన దాడుల వల్ల రష్యా ప్రాంతాల్లో ఆరుగురు మరణించినట్లు మాస్కో ప్రాంత గవర్నర్ ఆండ్రీ వోరోబ్యోవ్ వెల్లడించారు.మాస్కో, రోస్టోవ్ ప్రాంతాల్లో నష్టం మాస్కో వైపు వచ్చిన దాదాపు 600 డ్రోన్లలో ఒక మూడొంతుల వరకు నగర సరిహద్దుల్లోనే ధ్వంసమయ్యాయి. కానీ ఓ ప్రైవేట్ ఇంటిపై పడిన డ్రోన్ దాడిలో 83 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. రష్యాలోని ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం వైల్డ్‌బెర్రీస్ గోదాంపై కూడా దాడి జరగడంతో భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. ఇక రష్యా నైరుతి ప్రాంతమైన రోస్టోవ్పై 150కి పైగా డ్రోన్లతో జరిపిన దాడుల్లో ఐదుగురు మరణించగా.. అనేక ఇళ్లు, రైల్వే స్టేషన్ దెబ్బతిన్నాయి.ప్రముఖ డ్రోన్ తయారీ సంస్థ సీఈఓపై హత్యాయత్నం!యుద్ధంలో మారుతున్నవ్యూహాలు గత నాలుగున్నర ఏళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో ప్రస్తుతం నేరుగా భూతలంపై పోరాటాలు తగ్గిపోయాయి. శాంతిచర్చలు కూడా నిలిచిపోవడంతో ఇరుదేశాలు సుదూర ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణి దాడులకు మొగ్గు చూపుతున్నాయి. ప్రధానంగా సైనిక

రష్యాలో తాజాగా జరిగిన డ్రోన్ దాడి అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. భారీ స్థాయిలో చెలరేగిన మంటల తాలూకు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంటర్నెట్ డెస్క్: రష్యాలో తాజాగా జరిగిన డ్రోన్ దాడి అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. భారీ స్థాయిలో చెలరేగిన మంటల తాలూకు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మాస్కో ప్రాంతంలోని ఆన్లైన్ రీటెయిలర్ వైల్డ్ బెర్రీస్‌కు చెందిన ఒక గోదాముపై ఆదివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. తమకు తెలిసినంత వరకూ ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని మాస్కో ప్రాంతీయ గవర్నర్ తెలిపారు. మాస్కోకు దక్షిణాన 45 కిలోమీటర్ల దూరంలోని కొలెడీనో అనే ప్రాంతంలోని వైల్డ్‌బెర్రీస్ సంస్థ గోదాముపై ఈ దాడి జరిగింది. డ్రోన్ దాడి అనంతరం భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిపర్వతం బద్దలైనట్టు దట్టమైన పొగలు మిన్నంటాయి. డోమోడిడోవో ప్రాంతంలోని మరో గోదాముపై కూడా దాడి జరిగినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి రష్యాపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడికి దిగినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అనేక డ్రోన్స్‌ను మార్గమధ్యంలోనే అడ్డుకున్నామని రష్యా ప్రకటించింది. మొత్తం 822 డ్రోన్స్‌ను ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. మాస్కో దిశగా 600 డ్రోన్స్ వచ్చాయని నగర మేయర్ తెలిపారు. వైల్డ్ బెర్రీస్ సంస్థకు రష్యా అమెజాన్‌గా పేరుంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వారికి రకరకాల వస్తువులను భారీ స్థాయిలో డెలివరీ చేస్తుంటుంది. అయితే, వైల్డ్‌బెర్రీస్ సంస్థ సాయంతో మిలిటరీ సామగ్రిని రష్యా తరలిస్తోందని ఉక్రెయిన్ కొంతకాలంగా ఆరోపిస్తోంది. గతంలో పలుమార్లు వైల్డ్ బెర్రీస్ సంస్థ గోదాములను ఉక్రెయిన్ టార్గెట్ చేసింది. రష్యా మాత్రం ఈ ఆరోపణలను పలుమార్లు ఖండించింది. ఒమన్ చర్చలు వేరు.. హోర్ముజ్ తెరవడం వేరు: ఇరాన్ హోర్ముజ్‌పై ఇరాన్ కీలక నిర్ణయం.. అమెరికాకు గట్టి కౌంటర్

విశాఖపట్నంలోని నేవల్ క్వార్టర్స్‌లో ఉండే ఒక యువకుడు రోజూ మాదిరిగా స్పోర్ట్స్ ప్రాక్టీస్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. షూస్ వేసుకుని, పక్కనే ఉన్న తన స్పోర్ట్స్ బ్యాగులో గ్లౌస్ సర్దుకునేందుకు దానిని చేతిలోకి తీసుకున్నాడు. అయితే బ్యాగు పట్టుకునేసరికి లోపల ఏదో కదులుతున్న అలికిడి వినిపించింది. వెంటనే జిప్ తెరిచి చూసి అవాక్కయ్యాడు. బ్యాగులోపల అత్యంత ప్రమాదకరమైన ‘రక్తపింజరి’ పాము తిష్ట వేసి ఉంది. దీంతో ఆ యువకుడు భయంతో గట్టిగా కేకలు పెట్టాడు. కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై స్థానిక స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. తక్షణమే అక్కడకు చేరుకున్న నాగరాజు, ఎంతో చాకచక్యంగా ఆ విషసర్పం నుంచి కుటుంబ సభ్యులను రక్షించారు. పామును సురక్షితంగా డబ్బాలో బంధింది అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ పాము కాటు వేస్తే శరీరంలో రక్తం గడ్డకట్టి, అంతర్గత రక్తస్రావంతో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. వర్షాకాలం, చలికాలంలో ఇలాంటి విషసర్పాలు ఆశ్రయం కోసం దుస్తులు, బ్యాగుల్లోకి చేరే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో! నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్ ఏటా వెయ్యి కోట్ల గుడ్లు వృథా.. భారత్‌పై ఎన్ఈసీసీ సంచలన నివేదిక! 10వ తరగతి అర్హతతో రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక! నిర్మాణంలో ఉన్న శివుని విగ్రహం.. పరీక్షించేందుకు వచ్చిన నాగుపాము!

స్వాతంత్ర్య సంబరాల వేళ గుజరాత్ అటవీ శాఖ ఒక అద్భుతమైన పర్యావరణ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశానికి స్వాతంత్ర్యమొచ్చి 80 ఏళ్లు పూర్తయిన శుభసందర్భాన్ని పురస్కరించుకుని, ఒకప్పుడు కళకళలాడి కాలక్రమేణా బోసిపోయిన బన్నీ గడ్డిభూములకు మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇందులో భాగంగా ప్రముఖ జామనగర్ వంతారా పునరావాస కేంద్రం సహకారంతో ఏకంగా 20 కృష్ణజింకలను కచ్‌లోని సహజ సిద్ధమైన అటవీ ప్రాంతంలోకి సురక్షితంగా వదిలిపెట్టారు.ఆడ, మగ జింకల కొత్త ప్రయాణంఈ విడతలో మొత్తం 5 మగ జింకలు, 15 ఆడ జింకలను అడవిలో విడిచిపెట్టారు. జామనగర్లోని వంతారా కేంద్రాం నుంచి వీటిని కచ్ ప్రాంతానికి తీసుకురావడానికి ముందు కేంద్ర జూ అథారిటీ నుంచి అన్ని అనుమతులు సాధించారు. సుదూర ప్రయాణంలో జింకలకు ఎలాంటి హాని కలగకుండా ప్రత్యేక వెటర్నరీ వైద్యుల సమక్షంలో, పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే అత్యంత జాగ్రత్తగా ఇక్కడికి తరలించారు.జీవావరణ వ్యవస్థకు కొత్త ఊపిరిఒకప్పుడు ఈ బన్నీ గడ్డిభూముల్లో కృష్ణజింకలు, చింకారా, నీల్గాయ్ వంటి జంతువులు విరివిగా సంచరించేవి. అయితే కాలక్రమేణా వాటి సంఖ్య తగ్గిపోవడంతో ఇక్కడి పర్యావరణ సమతుల్యత దెబ్బతింది. ఇప్పుడు ఈ 20 జింకల రాకతో ఇక్కడ ఆహారపు గొలుసు మళ్లీ బలోపేతం కానుంది. భవిష్యత్తులో క్రూర మృగాలకు తగినంత ఆహారం లభించడంతో పాటు, గడ్డిభూముల సహజ సమతుల్యత దారిన పడుతుందని అధికారులు భావిస్తున్నారు.70 ఏళ్ల తర్వాత అడవిలోకి అడుగుపెట్టిన రాక్షస పులి..ప్రాజెక్ట్ చీతా దిశగా మరో అడుగుభారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చీతా వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యాలకు ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడనుంది. శాస్త్రీయ పద్ధతులు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అటవీ ప్రాంతాలను తిరిగి అభివృద్ధి చేయవచ్చని ఈ ప్రయోగం నిరూపించింది. రాబోయే రోజుల్లో బన్నీ ప్రాంతం మళ్లీ పచ్చటి జీవవైవిధ్యంతో కళకళలాడుతుందని అటవీ శాఖ తీవ్ర ఆశాభావం వ్యక్తం చేస్తోంది.చీతాల రాజ్యంలో సరికొత్త రికార్డు.. స్వేచ్ఛా వనంలోకి మరో

చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం టీఎస్ అగ్రహారంలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. గ్రామంలోని పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు వరి, టమాటా పంటలను తొక్కి నాశనం చేశాయి. చిత్తూరు జిల్లా, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం టీఎస్ అగ్రహారంలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. గ్రామంలోని పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు వరి, టమాటా పంటలను తొక్కి నాశనం చేశాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట పొలాల్లోకి వచ్చిన ఏనుగులు బోరు పైపులను సైతం ధ్వంసం చేయడంతో సాగునీటి సౌకర్యానికి కూడా నష్టం వాటిల్లిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయిన ఏనుగుల గుంపు పంట పొలాల నుంచి వెళ్లడం లేదని అన్నదాతలు చెబుతున్నారు. ఏనుగులను పొలాల్లోకి రానివ్వకుండా కట్టడి చేయడంలో అటవీ శాఖ అధికారులు విఫలమవుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. బాణసంచా, టపాకాయలు పేల్చి ఏనుగులను తరిమేందుకు ప్రయత్నించినా అవి బెదరడం లేదని వాపోతున్నారు. ఏనుగుల దాడులతో పంటలు, బోరు పైపులు ధ్వంసమై తీవ్రంగా నష్టపోయామని.. తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏనుగుల సంచారాన్ని అరికట్టేందుకు శాశ్వత పరిష్కారంగా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని ‘నిబంధనల ప్రకారమే జగన్‌ను ములాఖత్‌కు అనుమతించాం’ తిరుపతిలో ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం

వర్షాకాలం... వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారుతుంది. చుట్టూ పరిసరాలు ఆకుపచ్చగా మారిపోతాయి. ఆకుపచ్చని కూరగాయలు మార్కెట్‌ను ముంచెత్తుతాయి. అలా వానాకాలంలో ఆరోగ్య అతిథిగా పలకరించేది బొంత కాకరకాయ. ఈ కూరగాయ రుచిలో మేటి. ఆరోగ్యానికీ ఎంతో మంచిది. అరచేతిలో ఇమిడిపోయే బొంతలో అణువణువూ సుగుణాలు ఎన్నో. అలా వానలు మొదలవ్వగానే... వంటింట్లోంచి వచ్చే ఘుమఘుమల్లో ఇట్టే తేడా కనిపిస్తుంది. అల్లం, వెల్లుల్లి, పుదీనా తదితరాల వాడకం ఎక్కువవుతుంది. మార్కెట్లో గుమ్మడికాయ, కాకరకాయ, బెండకాయ, పొట్లకాయ లాంటి కూరగాయల హవా మొదలవుతుంది. అయితే ఏడాది పొడవునా దొరికే వీటిని పట్టించుకోకుండా... వానాకాలపు ఆరోగ్య అతిథి కోసం తెగ వెదుకుతుంటారు గృహిణులు. అదే బొంత కాకరకాయ.... కొన్ని ప్రాంతాల్లో బోడ కాకరకాయ, అడవి కాకరకాయ అంటారు. కేవలం మాన్సూన్ సీజన్లోనే కనిపించే బొంత కాకరకాయ ఎంతో అపురూపమైన కూరగాయ. ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్య కారణాలతో ఈ సీజన్లో వీటిని తప్పక తింటుంటారు. ఒక్కో చోట ఒక్కో పేరు... భారతదేశం ఎంతో వైవిధ్యమైన దేశమని చెప్పడానికి బొంత కాకరకాయను చూపొచ్చు. ఎందుకంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో దీనిని పిలుస్తుంటారు. తెలుగువాళ్లు అడవి కాకరకాయ, బోడ కాకరకాయ, బొంత కాకరకాయ అంటారు. అదే హిందీలో - కాకోడా, మరాఠీలో - కంటోలి, గుజరాతీలో - కంటోలా, తమిళంలో- మూకు పావక్కాయ్, మలయాళంలో - కొట్టుపావక్కా, కన్నడలో - మాడహాగలకాయి... ఇలా వీటికి ఎన్నో పేర్లు. దీని తోలుపై మెత్తని ముళ్లు ఉండడం వల్ల ఇంగ్లీష్‌లో ‘స్పైనీ గార్డ్’ అంటారు. దేశమంతా ఈ కూరగాయ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ... మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రజలు అమితంగా బొంత కాకరకాయ రుచుల్ని ఆస్వాదిస్తారు. మల్టీ విటమిన్లకు చిరునామా... పేరును బట్టి బొంత కాకరకాయ, మామూలు కాకరకాయలాగానే చేదుగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. నిజానికి ఇవి రెండూ ఒకే కుటుంబానికి చెందినా కూడా కాకరకాయంత చేదు ఇందులో

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Wild Bears Video Watch: ఆధారంగా అడవి జంతువులతో పాటు ముఖ్యంగా ఎరుగుబంట్లు వంటి క్రూర మృగాల పేర్లు వింటేనే భయంతో అందరూ ఎంతో వణికిపోతూ ఉంటారు. అలాంటిది.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక పూజారి ఏకంగా అడవి ఎలుగుబంటలకు చేతులతో పార్లేజీ బిస్కెట్లను తినిపిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆయన ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఒక హనుమంతుడి ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన అడవి ఎలుగుబంట్లకు పూజారి ఎలాంటి భయం లేకుండా అక్కడే కూర్చుని.. ఆ మూడింటికి పార్లేజీ బిస్కెట్లు చేతులతో తినిపిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో రెండు ఎలుగుబంట్లు అతడు అందించిన బిస్కెట్లను అద్భుతంగా తింటున్నాయి. అంతేకాకుండా మరో చిన్న ఎలుగుబంటి మాత్రం.. ఆ పూజారి తలభాగం పైకి ఎక్కి.. అతను ఇచ్చిన బిస్కెట్‌ను తినడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.. వాటికి ఆ పూజారి ఎంతో ఆప్యాయంగా బిస్కెట్లు పెట్టడం చూసిన చాలామంది.. ఆశ్చర్యపోతూ వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. అయితే, ఈ వీడియో చూసిన వన్యప్రాణి సంరక్షకులు సైతం.. సోషల్ మీడియా వినియోగదారులకు, అడవిలో జీవించే వారికి కొన్ని ప్రత్యేకమైన సూచనలు తెలుపుతున్నారు.. ఈ తరహా అలవాట్లు మూగజీవాలకే కాకుండా మానవాళికి కూడా తీవ్ర ముప్పు కలిగిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు

ప్రపంచంలో అడవి జంతువులకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. జంతువుల వేట, వాటి మధ్య జరిగే పోరాటం, ప్రకృతి అందాలకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో అడవి జంతువులకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. జంతువుల వేట, వాటి మధ్య జరిగే పోరాటం, ప్రకృతి అందాలకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అడవి జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు ఆశ్చర్యంతో పాటూ ఉత్కంఠను కలిగిస్తుంటాయి. అడవిలో అత్యంత వేగవంతమైన, చాకచక్యమైన వేటాడే కృర మృగాల్లో చిరుతపులి ఒకటి. తన వేగం, బలం, సమయస్ఫూర్తితో తన వేట కొనసాగిస్తుంది. తాజాగా ఓ చిరుత వేటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో.. చిరుత తన వేట కోసం అడవి పందిని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. తొలుత తల్లి పందిని దాని పిల్లకు దూరంగా తీసుకెళ్లిన చిరుత.. ఆ తర్వాత అవకాశం రాగానే.. పింది పిల్లలు ఉన్న గోతిలోకి దూరింది. అనంతరం ఒక్కసారిగా చిరుత పిల్లపై దాడి చేసి, పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే మొదట ఓ పంది పిల్ల తప్పించుకున్నప్పటికీ, మరో పంది పిల్ల చిరుతకు చిక్కింది. పంది పిల్లను నోట కరుచుకున్న చిరుత.. అక్కడి నుంచి తాపీగా వెళ్లిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చిరుత వేట మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం

రష్యాలో అతిపెద్ద ఆన్లైన్ వాణిజ్య సంస్థ అయిన 'వైల్డ్‌బెర్రీస్'కు చెందిన పలు గిడ్డంగులపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేయడంతో భారీగా నష్టం వాటిల్లింది. ఈ పరిణామం సంస్థ వ్యవస్థాపకురాలు, రష్యాలో అత్యంత సంపన్న మహిళగా పేరున్న టట్యానా కిమ్‌కు పెద్ద సవాలుగా మారింది. ఇంటర్నెట్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ ప్రభావం రష్యాలోని కీలక వాణిజ్య సంస్థలపై కూడా తీవ్రంగా పడుతోంది. రష్యాలో అతిపెద్ద ఆన్లైన్ వాణిజ్య సంస్థ అయిన 'వైల్డ్‌బెర్రీస్'కు చెందిన పలు గిడ్డంగులపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేయడంతో భారీగా నష్టం వాటిల్లింది. ఈ పరిణామం సంస్థ వ్యవస్థాపకురాలు, రష్యాలో అత్యంత సంపన్న మహిళగా పేరున్న టట్యానా కిమ్‌కు పెద్ద సవాలుగా మారింది (Tatyana Kim Wildberries). ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్లో వైల్డ్‌బెర్రీస్‌కు చెందిన కీలక సరఫరా, నిల్వ కేంద్రాలు దెబ్బతిన్నాయి. రష్యా వ్యాప్తంగా ఉన్న సంస్థ లాజిస్టిక్స్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరిగినట్లు సమాచారం. దీంతో సంస్థ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. అలాగే వైల్డ్‌బెర్రీస్‌పై ఆధారపడే వేలాది మంది వ్యాపారులపై కూడా ప్రభావం పడింది. దాడుల కారణంగా పలు గిడ్డంగుల్లో నిల్వ ఉన్న వస్తువులు ధ్వంసమయ్యాయి. దీంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులు తమ సరుకును కోల్పోయారు. ఆర్డర్ల పంపిణీలో జాప్యం ఏర్పడటంతో వినియోగదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు (Ukraine Drone Attack). వైల్డ్‌బెర్రీస్ గిడ్డంగులు రష్యా యుద్ధానికి అవసరమైన వస్తువుల సరఫరాలో ఉపయోగపడుతున్నాయని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది (Wildberries Warehouses). అందువల్ల వాటిని లక్ష్యాలుగా చేసుకున్నామని చెబుతోంది. అయితే రష్యా ఈ వాదనను తిరస్కరిస్తోంది. ఇవి పౌర వాణిజ్య మౌలిక వసతులని, వాటిపై దాడులు చేయడం వల్ల సాధారణ వ్యాపారులు, వినియోగదారులే నష్టపోతున్నారని తెలిపింది. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు జేపీసీకి.. విపక్షాల నిరసనల మధ్య కీలక పరిణామం.. భారత్‌పై వంద శాతం సుంకాలు.. ట్రంప్, మోదీ పరిష్కరించుకుంటారు: అమెరికా ప్రతినిధి

Pawan Kalyan: ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా ఏనుగుల సంరక్షణపై కీలక సందేశం ఇచ్చారు. ఏనుగులు కేవలం అడవి జంతువులు మాత్రమే కాదని, అవి అడవులకు సంరక్షకులు, పర్యావరణ సమతుల్యతకు ప్రతీకలని పేర్కొన్నారు. ఏనుగులను తరతరాలకు ప్రకృతిని గౌరవించేలా స్ఫూర్తినిచ్చే విధంగా సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఏనుగులు, వాటి ఆవాసాలు, ఏనుగు కారిడార్ల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ ద్వారా ఏనుగుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో వన్యప్రాణి సంరక్షణకు మరింత ప్రాధాన్యత లభిస్తోందని అన్నారు. ఏనుగుల సంరక్షణకు సహకరిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వన్యప్రాణుల రక్షణకు పలు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కుంకీ ఏనుగుల వినియోగంతో పాటు H.A.N.U.M.A.N. కార్యక్రమం ద్వారా వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన సిబ్బంది, అత్యాధునిక రెస్క్యూ మౌలిక వసతులు, టెక్నాలజీ, ర్యాపిడ్ రెస్పాన్స్ వ్యవస్థలను ఉపయోగించి ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని పవన్ తెలిపారు. మానవులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణలను తగ్గించడంతో పాటు సమర్థవంతమైన రక్షణ చర్యలు చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. సురక్షిత గ్రామాలు.. రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలు తమ లక్ష్యమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఏనుగుల ఆవాసాలను, వాటి సహజ సంచార మార్గాలను కాపాడటం ద్వారా పర్యావరణ సమతుల్యతను పరిరక్షించవచ్చని తెలిపారు. భవిష్యత్ తరాలు ప్రకృతిని గౌరవించేలా ఏనుగుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. “ఏనుగులను కాపాడండి.. అడవులను కాపాడండి.. భవిష్యత్తును కాపాడండి” అనే సందేశంతో ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ తన సందేశాన్ని ముగించారు

అడవి మృగాలతో అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదమని నిరూపించే షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పొలాల్లోకి వచ్చిన ఏనుగును బెదిరించి తరిమేయాలని చూసిన గ్రామస్థులకు గజరాజు ఊహించని షాక్ ఇచ్చింది. టార్చ్ లైట్ వేయగానే ఆవేశంతో జనంపైకి దూసుకొచ్చింది. ఇంటర్నెట్ డెస్క్: నీటితో నిండిన వరి పొలంలో ఓ ఏనుగు చేసిన హంగామాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. బురదమయమైన పొలంలోకి దూసుకొచ్చిన గజరాజును జనం టార్చ్‌లైట్లతో భయపెట్టి వెనక్కి పంపాలని చూశారు. అయితే, ఆ లైట్లు చూసి ఆగ్రహానికి గురైన ఏనుగు ఒక్కసారిగా గ్రామస్థుల మీదకు ఆవేశంగా దూసుకొచ్చింది. ఏనుగు ఆకస్మిక దాడితో దిగ్భ్రాంతి చెందిన ప్రజలు.. ప్రాణాలు దక్కించుకోవడానికి చెల్లాచెదురుగా పరుగులు తీశారు. ఈ ఉత్కంఠభరిత దృశ్యాలు వీడియోలో నమోదు కాగా, వన్యప్రాణుల వద్ద అప్రమత్తంగా ఉండకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో ఈ ఘటన స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ అధికారి డాక్టర్ పి.ఎం. ధకాటే మాట్లాడుతూ.. ‘ఏనుగులు వేగంగా పరుగెత్తలేవని.. వాటిని భయపెట్టడం లేదా ఒక మూలకు నెట్టడం వల్ల అవి ఆవేశంతో దాడికి దిగుతాయి. వన్యప్రాణులు పొలాల్లోకి లేదా జనావాసాల్లోకి వచ్చినప్పుడు వాటికి వీలైనంత దూరంగా ఉండాలి. అవి సురక్షితంగా వెళ్ళిపోవడానికి తగిన మార్గాన్ని వదిలిపెట్టాలి. ఏనుగులను రెచ్చగొట్టడం ప్రాణాలకే ప్రమాదం’ అని అన్నారు

ఏనుగుల సంరక్షణకు కట్టుబడి ఉన్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పవన్ స్పందిస్తూ.. ఏనుగుల ఆవాసాలు, కారిడార్ల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అమరావతి, ఆగస్టు 12: ఏనుగుల సంరక్షణకు కట్టుబడి ఉన్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పవన్ స్పందిస్తూ.. ఏనుగుల ఆవాసాలు, కారిడార్ల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఏనుగు కేవలం అడవిలో జీవి మాత్రమే కాదని, పర్యావరణ సమతులత్యకు ప్రతీక అన్నారు. భారతదేశ వారసత్వంలో ఏనుగులు అంతర్భాగమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కుంకీ ఏనుగులు, H.A.N.U.M.A.N. చొరవతో వన్యప్రాణుల రక్షణ రక్షణను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తామని పవన్ వెల్లడించారు. శిక్షణ పొందిన సిబ్బంది, రెస్క్యూ మౌలిక వసతులు, సాంకేతికతతో వేగవంతంగా స్పందించే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సురక్షిత సమాజాలు, రక్షిత అడవులు, ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యమని స్పష్టం చేశారు. ఏనుగులను కాపాడాలి.. అడవులను రక్షించాలి.. భవిష్యత్తును భద్రపరచాలి అంటూ ఎక్స్‌లో పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు. వేంకటేశ్వర స్వామిని అవమానించిన వారిపై క్రిమినల్ కేసులు: భానుప్రకాశ్ రెడ్డి వైసీపీ హయాంలో గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు.. సిట్ ఏం తేల్చిందంటే

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ఓ అరుదైన పాము కనిపించింది. బాండెడ్ క్రెయిట్గా గుర్తించిన అటవీ అధికారులు ఖానాపురం(వరంగల్): వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ఓ అరుదైన పాము కనిపించింది. స్థానికులు వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు దాన్ని చూసి బాండెడ్ క్రెయిట్ అనే పాముగా గుర్తించారు. పసుపు, నల్లని చారికలతో పొడవుగా ఉండే ఈ విషసర్పాలు చైనా, నేపాల్, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం దేశాలతో పాటు భారతదేశంలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఎక్కువగా ఉంటాయన్నారు. తెలంగాణలో కనిపించడం చాలా అరుదని, ఇక్కడికి ఎలా వచ్చిందో తెలియడం లేదని అన్నారు. ఇవి ప్రధానంగా నీటి లభ్యత ఉండే ప్రాంతాల్లో ఉంటాయని, చీమల పుట్టలు, పొదల్లో నివసిస్తాయని తెలిపారు. అనంతరం దాన్ని తీసుకెళ్లి పాకాల అడవుల్లో వదిలేశారు. మెట్రో ఫేజ్-1 రుణసేకరణ బాధ్యత ఎస్బీఐ క్యాప్స్‌దే

Sri Sathya Sai: కదిరి అటవీశాఖ అధికారుల మెరుపు దాడి: 7 మంది వేటగాళ్లకు రిమాండ్! ఈ వార్తకు సంబంధించిన

తమిళ సినీ నటుడు చియాన్ విక్రమ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక రీల్ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వివాదానికి దారితీసింది. అందులో ఆయన లార్ గిబ్బన్ అనే అరుదైన ప్రైమేట్తో సరదాగా సమయం గడుపుతూ కనిపిస్తారు. ఈ దృశ్యాలు బయటకు వచ్చిన వెంటనే వన్యప్రాణి రక్షణ చట్టాలపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా తమిళనాడు అటవీ శాఖ అధికారులు దీనిపై సమగ్ర విచారణను ప్రారంభించారు. ఆగస్టు 9న విక్రమ్ ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ దృశ్యాలు చెన్నైలోని ఇంజంబాక్కం ప్రాంతంలో ఉన్న ఆయన బంధువుల నివాసంలో తీసినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ జీవి విక్రమ్ కుమార్తె మామ, ప్రముఖ వ్యాపారవేత్త సి.కె. రంగనాథన్‌కు చెందినదిగా సమాచారం వెలువడింది. అయితే చట్టపరమైన ప్రశ్నలు తలెత్తడంతో విక్రమ్ 24 గంటల వ్యవధిలోనే ఆ వీడియోను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించారు. చెన్నై వన్యప్రాణి వార్డెన్ కులాల్ యోగేష్ విలాస్, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ రాకేష్ కుమార్ డోగ్రా ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. అధికారులు రంగనాథన్ నివాసానికి వెళ్లి సదరు జీవికి సంబంధించిన ఆధారాలను సేకరించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ అరుదైన జీవి నివాసం మరియు దాని నిర్వహణపై పూర్తి వివరాలు సేకరించే ప్రక్రియ వేగవంతమైంది. ఫలితంగా, ఈ లార్ గిబ్బన్ జూన్ 2026లో మణిపూర్ నుండి ఈరోడ్‌కు చేరుకుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆ తర్వాత ఆగస్టు 5న ఈరోడ్‌కు చెందిన ఒక వ్యక్తి నుంచి రంగనాథన్‌కు బదిలీ అయినట్లు ఫారమ్-I లో నమోదైంది. ఈ నేపథ్యంలో, బదిలీకి సంబంధించిన దరఖాస్తులు తమిళనాడు చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ వద్ద ఇంకా ఆమోదం కోసం పెండింగ్‌లోనే ఉన్నాయి. లార్ గిబ్బన్ ఆగ్నేయాసియా ప్రాంతానికి చెందిన అరుదైన జీవి కావడం వల్ల దీనికి అంతర్జాతీయంగా సీట్లు అపెండిక్స్-I కింద అత్యధిక రక్షణ ఉంటుంది. భారతదేశంలో దీనిని వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972కింద

తమిళ స్టార్ హీరో విక్రమ్ చిక్కుల్లో పడ్డారు. ఓ అరుదైన విదేశీ జాతి కోతితో కలిసి చేసిన వీడియోనే దీనికి కారణం. విమర్శలు రావడంతో సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేసిన 24 గంటల్లోనే విక్రమ్ దానిని డిలీట్ చేశాడు. ఇంతకీ అసలేమైంది? ఏంటి వివాదం? (ఇదీ చదవండి: కలలో శివుడు.. ఇది సాధారణంగా అనిపించలేదు: పూరీ కూతురు) ఆదివారం హీరో విక్రమ్.. అరుదైన జాతికి చెందిన లార్ గిబ్బన్ కోతితో ఆడుకుంటున్న ఓ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇందులో సదరు కోతిని అనుకరిస్తూ విక్రమ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. కొందరు దీన్ని చూసి లైక్ కొట్టగా మరికొందరు మాత్రం వన్యప్రాణి సంరక్షణ అధికారులకు ఫిర్యాదు చేశారు. అరుదైన జాతి కోతి.. విక్రమ్ దగ్గరకు ఎలా వచ్చింది? దీనిని పెంపుడు జంతువులా పెంచుకోవచ్చా అని పలు సందేహాలు రేకెత్తించారు.దీంతో విక్రమ్ తన వీడియోని డిలీట్ చేశాడు. విక్రమ్ తన వియ్యంకుడు(కూతురి మామ), ప్రముఖ బిజినెస్‌మ్యాన్ సీకే రంగనాథన్ ఇంటికి వెళ్లినప్పుడు ఈ కోతితో కలిసి వీడియో చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఆధారంగా అటవీశాఖ అధికారులు విచారణ మొదలుపెట్టినట్లు సమాచారం. సదరు కోతిని రంగనాథన్ ఎక్కడ కొనుగోలు చేశారు? వన్యప్రాణుల అక్రమ రవాణా ముఠా హస్తం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. విక్రమ్ వీడియోలో కనిపించిన కోతి పేరు లార్ గిబ్బన్ (Lar Gibbon). ఇది అంతరించిపోయే దశలో ఉన్న జంతు జాతుల్లో ఒకటి. ఈ జాతికి సిటెస్(CITES) నిబంధనలతో పాటు భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కూడా రక్షణ ఉంది. అవసరమైన అనుమతులు, పత్రాలు లేకుండా లార్ గిబ్బన్ని పెంపుడు జంతువుగా ఉంచడం చట్టబద్ధమేనా? అని ఈ వీడియో వల్ల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రోజా రీఎంట్రీ సినిమా) కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు) కొలంబియాను కుదిపేసిన రాకాసి భూకంపం..(ఫొటోలు) ‘అగధ’

కెనడాలో కార్చిచ్చులు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. దీంతో అగ్నిప్రమాదం ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇళ్లను, తమ ప్రాంతాలను వదిలి వెళ్లకుండా అక్కడే ఉండి మంటలను ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఇక్కడే ఉండి మంటలను ఎదుర్కొందాం’ అనే అక్కడి స్థానిక ప్రజల ఆలోచన తీరుపై కెనడాలో కొత్త చర్చ మొదలైంది. ఉత్తర అంటారియోలోని గుల్ బే ఫస్ట్ నేషన్(Gull Bay First Nation) ప్రాంతానికి చెందిన 58 ఏళ్ల హ్యూబర్ట్ విగ్వాస్ కూడా ఇలాగే తన ఇంటిని వదిలి వెళ్లేందుకు నిరాకరించారు. అయితే, సమీపంలో కార్చిచ్చు చెలరేగడంతో ఇంటి పైకప్పుపై స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండిపోయిన వృద్ధులను భద్రతా అధికారులు పరామర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకునేందుకు దగర్లోని సరస్సులో నాలుగు పడవలను కూడా సిద్ధంగా ఉంచారు. కానీ ఖాళీ చేయాలన్న అధికారుల ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయనకు సుమారు 800 కెనడియన్ డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్టుగా అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఇటీవల కెనడాలో కార్చిచ్చులు భారీగా పెరిగాయి. 2023లో నమోదైన కార్చిచ్చులు రికార్డు స్థాయిలో విధ్వంసం సృష్టించాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా 750కి పైగా కార్చిచ్చులు చురుకుగా ఉన్నట్లు సమాచారం. మంటల పొగ అమెరికాలోని మిడ్వెస్ట్ ప్రాంతాలకూ చేరనుంది. దీంతో మారుమూల ప్రాంతాల్లోని ప్రజలను రక్షించేందుకు సరిపడా అగ్నిమాపక సిబ్బంది ఉన్నారా? అత్యవసర సమయంలో స్థానికులు కూడా మంటలను ఎదుర్కొనేలా శిక్షణ పొందాలనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటిష్ కొలంబియాలోని ఫోర్ట్ నెల్సన్(Fort Nelson) ప్రాంతంలో సోంజా లెవర్కస్ ఆధ్వర్యంలో స్థానికులకు అగ్నిప్రమాదాలను ఎదుర్కొనే శిక్షణ ఇస్తున్నారు. గత మూడేళ్లలో 400 మందికి పైగా శిక్షణ పొందారు. చిన్న మంటలను అదుపు చేయడం, ఇళ్లను నిప్పురవ్వల నుంచి రక్షించడం, ప్రమాదకర పరిస్థితుల్లో సురక్షితంగా బయటపడే మార్గాలను గుర్తించడం వంటి అంశాలను నేర్పుతున్నారు. అయితే, మంటలు

ఓ వ్యక్తిని ఎలుగుబంట్ల గుంపు చుట్టుముట్టాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు అతడు ఎక్కడు. ఎలుగుబంట్లు కూడా చెట్టుపైకి ఎక్కేందుకు ప్రయత్నించాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే.. మరికొన్ని భయపెట్టే విధంగా ఉంటాయి. తాజాగా ఎలుగుబంటి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అడవిలో ఎలుగుబంట్ల గుంపు చుట్టుముట్టడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టెక్కాడు. హమ్మయ్య.. బతికిపోయాననుకునే లోపే ఎలుగుబంట్లు కూడా చెట్టు వద్దకు వచ్చేశాయి. ఈ క్రమంలో చెట్టు ఎక్కేందుకూ ప్రయత్నించాయి. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అడవిలో ఎలుగుబంట్ల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి వేగంగా ఓ పెద్ద చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చివరకు ఎలుగుబంట్లు కూడా చెట్టు వద్దకు చేరుకున్నాయి. ఆ ఎలుగుబంట్లు అక్కడి నుంచి వెళ్లిపోకుండా చాలా సేపు అక్కడే ఉన్నాయి. అంతటితో ఆగకుండా చెట్టుపైకి ఎక్కేందుకు ప్రయత్నించాయి. ఓ ఎలుగుబంటి అతడికి అత్యంత దగ్గరగా చేరుకుని పాదాల వద్ద ఉన్న బూటును వాసన చూస్తూ, తాకేందుకు ప్రయత్నించింది. ఎలుగుబంట్లు చెట్లను సులభంగా, వేగంగా ఎక్కగలవు. ముఖ్యంగా బ్లాక్ బేర్స్ చెట్లెక్కడంలో ఎంతో నైపుణ్యం కలిగి ఉంటాయి. వాటి బలమైన, పదునైన గోర్లు చెట్టు బెరడును గట్టిగా పట్టుకోవడానికి సహాయపడతాయి. అందుకే ఎలుగుబంటి నుంచి తప్పించుకోవడానికి చెట్టెక్కడం సురక్షితమైన మార్గం కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వీడియో చూస్తుంటే.. ఆ ఎలుగుబంట్లు పెంపుడు జంతువుల్లా అనిపిస్తున్నాయి. అయినా కూడా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యూపీఐ చెల్లింపులు ఉచితమే: ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్రం కన్నెర్ర.. చర్యలు తీసుకోవాలని మెటాకు అదేశం