చర్మాన్ని యవ్వనంగా మార్చే ఆహారాలు
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, క్రాన్బెర్రీ లాంటి పండ్లు తినడం ద్వారా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. ఇవి ప్రీ రాడికల్స్ నుంచి చర్మా్న్ని కాపాడుతాయి. అలాగే నల్ల మచ్చలు, ముడతలు తగ్గిపోయి చర్మం యవ్వనంగా ఉంటుందని PMC రీసెర్చ్ పేర్కొంది. టొమాటోల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. అలాగే చర్మంపై మచ్చలు, ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా యవ్వనంగా ఉంటారు. పాలకూర, మునగాకు, గోంగూర, కాలే వంటి ఆకుకూరల్లో విటమిన్ ఎ, సి,కెతో పాటు క్లోరోఫిల్ ఉంటుంది. ఇది చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మాన్ని ఎల్లపుడూ యవ్వనంగా ఉంచడంలో దోహదపడుతుంది. దానిమ్మ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇవి కాలుష్యం, ఎండ నుంచి చర్మాన్ని కాపాడుతాయి. అలాగే స్కిన్ టోన్ మెరుగుపర్చి మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతాయి. బాదం, వాల్నట్స్, గుమ్మడి, అవిసె, చియా సీడ్స్ వంటి వాటిలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతాయి. చిలగడదుంపల్లోని బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఎగా మారి చర్మాన్ని హెల్తీగా ఉంచుంది. ఎండ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. అలాగే మీ స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. బొప్పాయిలో విటమిన్ ఎ, సి, ఇ ఎక్కువగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. అలాగే స్కిన్ టోన్ మెరుగుపరుస్తాయి. అవకాడో పండ్లలోని విటమిన్ ఇ, హెల్తీ ఫ్యాట్స్ చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్‌గా ఉంచుతాయి. ఇవి ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి చర్మాన్ని కాపాడి మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతాయి. డార్క్ చాక్లెట్లలో కోకో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులోని ఫ్లేవనాయిడ్స్ చర్మానికి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అలాగే చర్మాన్ని హైడ్రేట్ చేసి మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది