
Weekly Horoscope: ఈ రాశులకు ఉద్యోగంలో మార్పులు, ఆర్థిక లాభాలు.. మీ రాశికి ఎలా ఉందంటే..?
Weekly Horoscope: ఈ రాశులకు ఉద్యోగంలో మార్పులు, ఆర్థిక లాభాలు.. మీ రాశికి ఎలా ఉందంటే..?

Weekly Horoscope: ఈ రాశులకు ఉద్యోగంలో మార్పులు, ఆర్థిక లాభాలు.. మీ రాశికి ఎలా ఉందంటే..?

Janmashtami 2026 Holiday: శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. 2026లో జన్మాష్టమి సెప్టెంబర్ 4, శుక్రవారం రోజున వచ్చింది. దీంతో ఈ పండుగ సందర్భంగా స్కూళ్లు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుందా అనే ఆసక్తి చాలామందిలో ఉంది. జన్మాష్టమి సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో సెలవు ఉండే అవకాశం ఉంది. అయితే అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన సెలవు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ, స్కూల్ బోర్డు నిర్ణయాలను బట్టి సెలవు మారవచ్చు. అందుకే విద్యార్థులు తమ స్కూల్ హాలిడే క్యాలెండర్‌ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 4న పలు ప్రాంతాల్లో బ్యాంకు శాఖలు మూసి ఉండనున్నాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, లక్నో, జైపూర్, భువనేశ్వర్, చండీగఢ్, కోచి, పాట్నా, రాంచీ, తిరువనంతపురం, శ్రీనగర్ వంటి నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. బ్యాంకు పనులు ఉన్నవారు ముందుగానే తమ బ్రాంచ్‌కు సెలవు ఉందో లేదో తెలుసుకోవడం మంచిది. అయితే ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి సేవలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. జన్మాష్టమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవు ఇవ్వనున్నారు. ముఖ్యంగా కృష్ణుడి జన్మస్థలమైన మథుర, వృందావన్ ప్రాంతాల్లో వేడుకలు ప్రత్యేకంగా జరుగుతాయి. ఉత్తరప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. అయితే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ స్కూళ్లు, CBSE, ICSE, రాష్ట్ర బోర్డు పాఠశాలలకు సెలవుల విషయంలో తేడాలు ఉండవచ్చు. జన్మాష్టమి కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవుగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలు కూడా కొన్ని ప్రాంతాల్లో మూసి ఉండవచ్చు. దీనిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అధికారిక సెలవుల జాబితానే తుది నిర్ణయంగా భావించాలి. ఈసారి సెప్టెంబర్ 4 శుక్రవారం కావడంతో శని, ఆదివారాలు సెలవుగా ఉండే

సెప్టెంబర్ తొలి వారంలో ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధమైంది. థియేటర్లలో మిస్ అయిన సినిమాల నుంచి సరికొత్త వెబ్ సిరీస్‌ల వరకు పలు ఆసక్తికరమైన టైటిల్స్ డిజిటల్ స్ట్రీమింగ్కు రానున్నాయి. క్రైమ్ థ్రిల్లర్లు, యాక్షన్ డ్రామాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, రొమాంటిక్ కథలు ఇలా ప్రతి రుచికి తగ్గ కంటెంట్ ఈ వారం అందుబాటులోకి రానుంది. వీకెండ్ ప్లాన్ చేసుకునే ముందు ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఏ వెబ్ సిరీస్ బింజ్ వాచ్‌కు బెస్ట్? అన్న వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ జాబితాపై ఓ లుక్ వేయండి. OTT లవర్స్‌కు ఈ వారం మంచి ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ! 🎬📺 ఈ వారం.. కొత్త ఓటీటీ సినిమాలు (𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞) Manorama Max Ananthan Kaadu (Malayalam) 𝐒𝐞𝐩 𝟐 Jio Hotstar Star Wars: The Mandalorian and Grogu (English) 𝐒𝐞𝐩 𝟐 The Court (Tamil) [Weekly Series] 𝐒𝐞𝐩𝟒 Paramount+ Scary Movie (English) 𝐒𝐞𝐩 𝟑 Sunnxt DC (Tamil, Telugu, Malayalam) - 𝐒𝐞𝐩𝟒 Zee5 Veerabhadruni Rahasyam: S1 Part 2 (Telugu) 𝐒𝐞𝐩𝟒 Sony Liv Unmadham (Malayalam, Tamil, Telugu, Kannada, Hindi) - 𝐒𝐞𝐩𝟒 Apple Tv May Day (English) 𝐒𝐞𝐩𝟒 HBO Max Fuze (English) 𝐒𝐞𝐩𝟒 MUBI Erupcja (English) 𝐒𝐞𝐩𝟒 MGM Plus A Tale Of Two Cities Series 𝐒𝐞𝐩6 Shudder Parasomnia (English) 𝐒𝐞𝐩𝟒 Hulu Signal One (English) 𝐒𝐞𝐩𝟒 Prime Video Confinement (English) Rent 𝐒𝐞𝐩𝟏 I Want Your Sex (English) Rent 𝐒𝐞𝐩𝟏 Just Play Dead (English) Rent 𝐒𝐞𝐩𝟏 The Wrong Girls (English) Rent 𝐒𝐞𝐩𝟏 The Runner (English) 𝐒𝐞𝐩 𝟐 Dark Hollow

Vem Narender Reddy: మహబూబాబాద్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణ శిబిరంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. అలాగే వారానికి ఒక ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వేం నరేందర్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిరుద్యోగులకు వరుసగా అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. వచ్చే డిసెంబర్లో మరోసారి పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. పోలీస్ ఉద్యోగాల భర్తీని మూడు విడతల్లో చేపట్టనున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు వివరించడంలో వెనుకంజలో ఉందని వేం నరేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తమవాళ్లు కొంత వెనుకబడ్డారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన అనేక ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. చివరకు జిరాక్స్ సెంటర్లలో కూడా ప్రశ్నపత్రాలు లభించే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రస్తుతం ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు

రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల నుంచి వస్తున్న వినతుల మేరకు ఇప్పటి వరకు నడుస్తున్న రెండు ప్రధాన వీక్లీ రైళ్లను రెగ్యులర్ రైళ్లుగా మార్పు చేస్తూ అధికారులు కీలక ప్రకటన చేసారు. ఈ రైళ్లు ప్రస్తుతం నడుస్తున్న మార్గంలోనే ఇక రెగ్యులర్ సర్వీసులుగా మార్పు చేసారు. ఈ మేరకు షెడ్యూల్ ను ప్రకటించారు. దీనికి సంబంధించి రిజర్వేషన్ సౌకర్యం అందు బాటులోకి వచ్చింది. దీని ద్వారా అటు గుజరాత్, ఇటు బెంగళూరుతో పాటుగా తమిళనాడు వెళ్లే ప్రయాణీకులకు వెసులు బాటు కలగనుంది. ఏపీ ప్రజలకు రైల్వే శాఖ కీలక అప్డేట్. విజయవాడ, రేణిగుంట మీదుగా బెంగళూరు వెళ్లే ట్రైన్ నంబర్ 15302/15301 లాల్ కువాన్ - కేఎస్ఆర్ బెంగళూరు సిటీ ఎక్స్ ప్రెస్ తో పాటుగా రాయచూర్ రేణిగుంట మీదుగా తిరుచురాపల్లి వెళ్లే ట్రైన్ నంబర్ 19418/19420 అహ్మదాబాద్ - తిరుచిరాపల్లి వీక్లీ ఎక్స్ ప్రెస్ రైళ్లను రెగ్యులర్ చేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ రెండు రైళ్లు సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ సేవలు అందించనున్నాయి. ఈ మేరకు ఈ రైళ్ల రూట్, షెడ్యూల్ అధికారులు వెల్లడించారు. ట్రైన్ నంబర్ 15302 లాల్ కువాన్ - కేఎస్ఆర్ బెంగళూరు సిటీ ఎక్స్ ప్రెస్ ప్రతి శనివారం సాయంత్రం 5.45గంటలకు లాల్ కువాన్ స్టేషన్లో బయల్దేరుతుంది. కిచ్చా స్టేషన్ మీదుగా ప్రయాణించి ఆదివారం సాయంత్రం 7.19గంటలకు తెలంగాణలోని సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్ చేరుతుంది. అదే విధంగా అక్కడి నుంచి మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం మీదుగా ప్రయాణించి సోమవారం అర్ధరాత్రి 1.35గంటలకు విజయవాడ జంక్షన్ చేరుకుంటుంది. తిరిగి అక్కడి నుంచి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా ఉదయం 8గంటలకు రేణిగుంట జంక్షన్ చేరుతుంది. 10 నిమిషాల విరామం అనంతరం బయల్దేరి సాయంత్రం 5.25గంటలకు బెంగళూరు చేరుతుంది. ట్రైన్ నంబర్ 15301 లాల్ కువాన్ - కేఎస్ఆర్ బెంగళూరు

Holidays: పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు మరోసారి వరుస సెలవులు రాబోతున్నాయి. ఆగస్టు 21న శ్రావణ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలతో పాటు వివిధ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. దీనికి తోడు శని, ఆదివారాలు కలిసి రావడంతో ఏకధాటిగా మూడు రోజుల లాంగ్ వీకెండ్ ఆస్వాదించే అవకాశం లభించనుంది. శ్రావణ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో వరలక్ష్మీ వ్రతం అత్యంత ముఖ్యమైనది. దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం ఈసారి ఆగస్టు 21వ తేదీ శుక్రవారం నాడు ఈ పవిత్రమైన వ్రతాన్ని ఆచరించనున్నారు. ఈ ప్రత్యేకమైన వేడుకను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు సెలవు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రత్యేకించి మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థినులు ఇళ్లలో పూజలు నిర్వహించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తోడ్పడనుంది. ఈసారి క్యాలెండర్ ప్రకారం వరుస సెలవులు కలసి రావడం విద్యార్థులకు పెద్ద ఊరటనిస్తోంది. ఆగస్టు 21వ తేదీ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం సెలవు ఉండగా, మరుసటి రోజు ఆగస్టు 22 శనివారం కొన్ని బడులకు సాధారణ సెలవు లేదా ఆఫ్ డే మాత్రమే ఉంటుంది. దీనికి తోడు ఆగస్టు 23వ తేదీ ఆదివారం వారపు సెలవు కావడంతో వరుసగా మూడు రోజుల పాటు విద్యాసంస్థలు మూతపడనున్నాయి. దీంతో పండుగ పూజలతో పాటు కుటుంబసమేతంగా ప్రయాణాలు చేసేందుకు ఇది సరైన అవకాశంగా మారింది. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ సంస్థలు, సర్కారీ డిగ్రీ, జూనియర్ కళాశాలలకు ఈ హాలిడే వర్తిస్తుంది. హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలతో పాటు చాలా ప్రైవేటు స్కూళ్లు కూడా ఈ రోజున సెలవు ప్రకటిస్తాయి. అయితే సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ మరియు కొన్ని కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలు మాత్రం తమ యాజమాన్యాల నిర్ణయానికే ప్రాధాన్యత ఇస్తాయి. కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు

హైదరాబాద్‌లో బిజీ లైఫ్‌తో విసిగిపోయారా? వీకెండ్ లో మంచి ప్లేస్ లో ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ టూరింగ్ స్పాట్ల గురించి తెలుసుకోవాల్సిందే. ప్రకృతి అందాలు, కొండలు, జలాశయాలు, చారిత్రక కట్టడాలు, దేవాలయాలు ఇలా భిన్నమైన అనుభూతులను అందించే ప్రాంతాలు హైదరాబాద్‌కు చాలా దగ్గర్లోనే ఉన్నాయి. వీకెండ్ టూర్ కి ఇవి బెస్ట్ అనే చెప్పాలి. మరి లేటేందుకు ఆ పర్యాటక ప్రదేశాలేంటో తెలుసుకోండి. హైదరాబాద్ నుంచి సుమారు 140–150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీదర్‌కి కారులో సాధారణంగా 3 గంటల వరకు ప్రయాణం పడుతుంది. కర్ణాటకలోని ఈ చారిత్రక పట్టణం వీకెండ్ ట్రిప్‌కు చక్కటి ఎంపిక. బీదర్ కోట ఇక్కడ ప్రధాన ఆకర్షణ. భారీ కోట గోడలు, పురాతన నిర్మాణాలు చరిత్రపై ఆసక్తి ఉన్నవారిని ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ నుంచి ఉదయం తొందరగా బయలుదే వెళ్తే ఒక రోజులోనే ప్రధాన ప్రదేశాలను చూసి రావచ్చు. అయితే ప్రశాంతంగా చుట్టుపక్కల ప్రాంతాలను ఆస్వాదించాలంటే ఒక రాత్రి బీదర్‌లో బస చేయడం మంచిది. హైదరాబాద్ నుంచి వరంగల్ దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు మార్గంలో సుమారు 3 నుంచి 3.5 గంటల్లో చేరుకోవచ్చు. కాకతీయుల వైభవానికి అద్దం పట్టే వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయం వంటి ప్రదేశాలు ఈ ప్రయాణానికి ప్రధాన ఆకర్షణలు. టైం ఉంటే వరంగల్ నుంచి రామప్ప ఆలయానికి వెళ్లడం ద్వారా ట్రిప్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకోవచ్చు. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట చాలా సులభంగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి దాదాపు 55–65 కిలోమీటర్ల దూరంలో ఉండే యాదాద్రికి సాధారణంగా గంట నుంచి గంటన్నరలో చేరుకోవచ్చు. ప్రధానంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ దర్శనం కోసం భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆలయ దర్శనంతో పాటు యాదాద్రి పరిసరాలలో ప్రశాంతంగా గడపవచ్చు. పెద్దగా సెలవు తీసుకోలేని వారికి ఇది మంచి ట్రిప్. ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి హైదరాబాద్
సినిమా ప్రియులకు ప్రతి వారం సరికొత్త వినోదాన్ని పంచే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈసారి కూడా భారీ వినోదాల విందుతో సిద్ధమయ్యాయి. ప్రేక్షకులను కట్టిపడేసే రొమాంటిక్ లవ్ స్టోరీలు, వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్ థ్రిల్లర్లు, నవ్వులు పూయించే ఎంటర్టైన్మెంట్ వెబ్ సిరీస్‌లతో ఆగస్టు 17 నుంచి 23 వరకు వివిధ ఓటీటీ వేదికలు ముస్తాబయ్యాయి. వీకెండ్లో ఇంటిల్లిపాదినీ అలరించేందుకు ఏయే ప్లాట్ఫామ్లో ఏయే చిత్రాలు, సిరీస్‌లు రాబోతున్నాయో తెలుసుకుందాం.నెట్ఫ్లిక్స్గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ వారం వరల్డ్‌వైడ్ కంటెంట్‌తో సినీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తెలుగమ్మాయి శాన్వీ మేఘన ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త తమిళ రొమాంటిక్ చిత్రం ‘ప్యార్ ప్రేమ కల్యాణం’ ఆగస్టు 21 నుంచి తెలుగు, తమిళం సహా పలు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి కోలీవుడ్ యువ దర్శకుడు ఎలాన్ దర్శకత్వం వహించారు. వీటితో పాటు క్రైమ్ డ్రామా ఆధారంగా రూపొందిన స్పానిష్ చిత్రం ‘ఫేసింగ్ ఎల్ చాపో’ (ఆగస్టు 21న) విడుదలవుతోంది. వెబ్ సిరీస్‌ల విషయానికి వస్తే.. మంగళవారం (ఆగస్టు 18) నుంచి ‘టేక్ ఎ హైక్’, బుధవారం (ఆగస్టు 19) నుంచి ‘లవ్ ఈజ్ బ్లైండ్: యూకే సీజన్ 3’ అలాగే డాక్యుమెంటరీ తరహాలో సాగే ‘ప్రీ ఫాల్: ఎ రికనింగ్ ఫర్ బోయింగ్’ రానున్నాయి. గురువారం (ఆగస్టు 20) నుంచి ఉత్కంఠభరితమైన ‘ఔటర్ బ్యాంక్స్ సీజన్ 5’, హారర్ థ్రిల్లర్ ‘బ్లడ్ సాక్రిఫైస్’, మరియు ‘ఎస్ అండ్ ఎక్స్’ వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను పలకరించనున్నాయి.జియో హాట్స్టార్సూపర్హీరో, ఇంటర్నేషనల్ సిరీస్ ప్రియులను అలరించేందుకు జియో హాట్‌స్టార్ ముందుకొచ్చింది. డీసీ యూనివర్స్ (DCU) నుంచి జేమ్స్ గన్ షేర్డ్ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక హెచ్‌బీవో సిరీస్ ‘లాంతర్న్స్’ (Lanterns) ఆగస్టు 17 నుంచే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ప్రసారమవుతోంది. దీనితో పాటు సుదీర్ఘ కాలంగా ఆదరణ పొందుతున్న పాపులర్ కామెడీ సిరీస్ ‘ఇట్స్ ఆల్వేస్ సన్నీ

Lalithaa Jewellery IPO | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఆభరణాల తయారీ కంపెనీ లలితా జువెలరీ మార్ట్ పబ్లిక్ ఇష్యూకు తొలిరోజు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. బిడ్డింగ్ విండో తెరుచుకున్న తొలిరోజే 69 శాతం సబ్స్క్రిప్షన్ పూర్తి చేసింది. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం.. 6,27,61,403 షేర్లకు 4,35,37,826 బిడ్లు దాఖలయ్యాయి. రిటెయిల్ ఇన్వెస్టర్లు కోటా 74 శాతం, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల కోటా 67 శాతం, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 61 శాతం సబ్స్క్రిప్షన్ నమోదు చేశాయి. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటికే రూ.508 కోట్ల నిధులను కంపెనీ సమీకరిచింది. రూ.1700 కోట్ల ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఆగస్టు 19న ముగియనుంది. ఒక్కోషేరు ధరల శ్రేణి రూ.190-201గా కంపెనీ నిర్ణయించింది. ఐపీఓ ప్రైస్ బ్రాండ్‌తో పోలిస్తే 15 శాతం అధికంగా గ్రే మార్కెట్ ప్రీమియం పలుకుతోంది. ఆగస్టు 24న మార్కెట్లో లిస్టయ్యే అవకాశం ఉంది. బ్లాక్‌స్టోన్ మద్దతు కలిగిన హోరైజన్ ఇండస్ట్రియల్ పార్క్ ఐపీఓ తొలిరోజు 14 శాతం సబ్స్క్రిప్షన్ అందుకుంది. 25,13,56,273 షేర్లకు గాను 3,52,85,000 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటెయిల్ ఇన్వెస్టర్ల కోటా 19 శాతం, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కోటా కింద 3 శాతం సబ్స్క్రిప్షన్ అందుకుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటికే రూ.1,167.8 కోట్ల నిధులను సమీకరించింది. రూ.2600 కోట్ల ఐపీఓ ఆగస్టు 19న ముగియనుంది. ఒక్కోషేరు ధరల శ్రేణి రూ.57- 60గా కంపెనీ నిర్ణయించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం కూడా మంచి వినోదం అందించేందుకు పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. ఆగస్టు 17 నుంచి వివిధ ఓటీటీలపై ఏకంగా 5 వెబ్‌సిరీస్‌లు, 5 సినిమాలు విడుదల కానున్నాయి. హాలీవుడ్ సూపర్‌హీరో కథ నుంచి క్రైమ్ థ్రిల్లర్లు, కొరియన్ మెడికల్ డ్రామా, తెలుగు రొమాంటిక్ డ్రామా, తమిళ రొమాంటిక్ కామెడీ, డాక్యుమెంటరీల వరకు విభిన్న జానర్లలో ఈ కంటెంట్ అందుబాటులోకి రానుంది. డీసీ యూనివర్స్‌లో మూడో హెచ్‌బీఓ సిరీస్‌గా, జేమ్స్ గన్ షేర్డ్ యూనివర్స్‌లో ఐదో ఎంట్రీగా లాంతర్న్స్ తెరకెక్కింది. డీసీకి చెందిన ప్రముఖ పాత్రల్లో ఒకటైన గ్రీన్ లాంతర్న్ను కొత్త తరానికి పరిచయం చేసేలా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఆగస్టు 17 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇట్స్ ఆల్వేస్ సన్నీ ఇన్ ఫిలడెల్ఫియా సీజన్ 18 ప్రముఖ కామెడీ సిరీస్ ఇట్స్ ఆల్వేస్ సన్నీ ఇన్ ఫిలడెల్ఫియా 18వ సీజన్‌తో తిరిగి రానుంది. ప్యాడీస్ పబ్ మరోసారి కన్ఫ్యూజన్ డ్రామా క్రియేట్ చేయనుంది. కొత్త సీజన్ ఎపిసోడ్లు ఆగస్టు 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియారెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు రొమాంటిక్ డ్రామా చెన్నై లవ్ స్టోరీ. ప్రేమ, అనురాగం, సంబంధాల చుట్టూ సాగే ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైన తర్వాత ఓటీటీలోకి వస్తోంది. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ డ్రామా ఫేసింగ్ ఎల్ చాపో. దొంగిలించిన కారును ఆపే క్రమంలో ఇద్దరు మెక్సికన్ పోలీసు అధికారులు అపఖ్యాతి చెందిన డ్రగ్ లార్డ్ ఎల్ చాపోను ఎదుర్కొంటారు. స్పానిష్ భాషలో రూపొందిన ఈ థ్రిల్లర్ ఆగస్టు 21 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్కు రానుంది. ప్యార్ ప్రేమ కల్యాణం ఒక రొమాంటిక్ కామెడీ. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన పవి పెళ్లి తర్వాత కూడా తన కుటుంబ ఇంటిని వదిలి వెళ్లడానికి ఇష్టపడదు. సంప్రదాయానికి భిన్నంగా
ప్రస్తుత డిజిటల్ యుగంలో కంటెంట్ ఆధారిత చిత్రాలకు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఒకప్పుడు థియేటర్ల వద్ద మాత్రమే తమ ప్రభావాన్ని చూపించగలిగిన చిన్న తరహా చిత్రాలకు ఓటీటీ వేదికలు సరికొత్త జీవం పోస్తున్నాయి. ఈ కోవలోనే వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తెలుగు ఆంథాలజీ ప్రాజెక్ట్ ‘ డార్క్ సీక్రెట్స్ ’ (Dark Secrets) డిజిటల్ ప్రపంచంలో అరుదైన విజయాన్ని నమోదు చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇండియా వ్యాప్తంగా అత్యధిక కొనుగోళ్లు సాధించిన ‘టాప్ 10 పర్చేసెస్’ (Top 10 Purchases in India) విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో రెంట్ పద్ధతిలో (రూ.99) అందుబాటులో ఉంది.* రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్... ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో సూర్య సరికొత్త చరిత్రజాతీయ స్థాయిలో విభిన్న భాషా చిత్రాలను అధిగమించి.. అమెజాన్ ప్రైమ్ వేదికపై హిందీ, తమిళ, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ చిత్రాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ, వాటన్నింటినీ వెనక్కినెట్టి ఒక తెలుగు ఆంథాలజీ మూవీ అగ్రస్థానంలో నిలవడం సాధారణ విషయం కాదు. బలమైన కథ, ఆలోచింపజేసే కథనంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సోషల్ మీడియాలో కూడా మంచి ప్రచారం లభిస్తోంది. డిజిటల్ వీక్షకుల నుంచి వస్తున్న సానుకూల స్పందనతో ఈ చిత్రానికి భారీగా వ్యూస్ నమోదవుతున్నాయి.* చిరంజీవి చేసిన రూ.10వేల సాయం జీవితంలో మర్చిపోను.. ఆయనకు విలన్‌గా నటించడమే నా డ్రీమ్‘డార్క్ సీక్రెట్స్’ ప్రధానంగా మనుషుల అంతరంగంలో దాగి ఉండే రహస్యాలు, చెప్పలేని కోరికలు, సంక్లిష్టమైన భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. "ప్రతి వ్యక్తి అంతరంగంలో బయటపెట్టలేని ఒక రహస్యం ఉంటుంది.. ఒకవేళ ఆ గుట్టు రట్టయితే జీవితాలు ఏ మలుపు తిరుగుతాయి?" అనే ఆసక్తికరమైన అంశాన్ని మూలకథగా తీసుకుని దీన్ని రూపొందించారు. సామాజిక ఒత్తిళ్లు, ఏకాంతం, నిషేధిత అనుబంధాలు, నైతిక

శ్రీశైలం భక్తులకు బిగ్ అలర్ట్. వారాంతపు సెలవులు కావటంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చారు దీంతో.. భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సిఫారసు లేఖలతో వచ్చే వారికి కూడా శ్రీ స్వామి అమ్మవారి అలంకార దర్శనం మాత్రమే అనుమతిస్తున్నారు. క్యూలైన్లో సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చూసేందుకే స్పర్శ దర్శనం రద్దు చేస్త కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భారీ తరలి వచ్చారు. భక్తుల రద్దీ కారణంగా అధికారులు ఆదివారం విరామ బ్రేక్ దర్శనాలు నిలుపుదల చేశారు. సిఫారసు లేఖలతో వచ్చే వారికి కూడా శ్రీ స్వామి అమ్మవారి అలంకార దర్శనం మాత్రమే అనుమతిస్తున్నారు. ఇప్పటికే మనమిత్ర,వాట్సాప్ ఆన్లైన్లో,స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారికి నిర్దిష్ట వేళల్లో స్పర్శ దర్శనానికి అనుమతినిస్తున్నారు. దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్ - దర్శనం టికెట్ల జారీలో కీలక మార్పులు, ఇక నుంచి..!!ఆలయ అధికారుల నిర్ణయాలుఇదే సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా శని,ఆది, సోమవారాలలో ఆర్జిత అభిషేకాలు, కుంకుమ అర్చనలు నిలుపుదల చేశారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. కాగా, శ్రీశైలంమల్లికార్జున స్వామి వారి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తు న్నారు.దీంతో ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉచిత, శీఘ్ర,అతిశీఘ్ర,దర్శనాల క్యూలైన్ల ద్వారా భారీగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. క్యూలైన్ల నిర్వహణను నిరంతరం భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ పాలక మండలి వెల్లడించింది. ఇక.. రద్దీ సమయాల్లో నూ సామాన్యులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. రద్దీ వేళ.. ఆలయ పాలక వర్గం తీసుకొనే నిర్ణయాలకు సహకరించాలని కోరుతున్నారు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. మేష రాశివారికి ఈ వారం ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కొత్త పరిచయాలు ప్రయోజనకరంగా మారుతాయి. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ అనవసర ఖర్చులను నియంత్రించాలి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రేమ సంబంధాల్లో అపార్థాలు తొలగే అవకాశం ఉంది. విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు, కోపంతో మాట్లాడటం మంచిది కాదు. వృషభ రాశివారికి ఈ వారం కుటుంబం, ఆర్థిక వ్యవహారాలు ప్రధానంగా ఉంటాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరగవచ్చు. వ్యాపారులు కొత్త ఒప్పందాల్లో పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఆదాయం బాగానే ఉన్నా ఇంటి అవసరాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో అనుకూలత ఉంటుంది. దాంపత్యంలో ఓర్పు అవసరం. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. తల్లి లేదా ఇంటి పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది. మిథున రాశివారికి ఈ వారం చురుకుదనం, కొత్త ఆలోచనలు, ప్రయాణాలు ప్రధానంగా ఉంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారులకు మార్కెటింగ్, కొత్త క్లయింట్ల ద్వారా ప్రయోజనం ఉంటుంది. మాటల్లో వేగం, కోపం సమస్యలకు దారితీయవచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం. ఆర్థికంగా చిన్న లాభాలు కనిపించినా రిస్క్ తో కూడిన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమలో భావాలను స్పష్టంగా చెప్పడం మంచిది. విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి. కర్కాటక రాశివారికి ఈ వారం ఆత్మవిశ్వాసం, జ్ఞానం పెరుగుతాయి. ఉద్యోగంలో గుర్తింపు లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. ఆదాయ అవకాశాలు ఉన్నప్పటికీ కుటుంబ ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారులకు పాత పరిచయాల ద్వారా మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ, దాంపత్య జీవితంలో అనుకూలత ఉంటుంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పెద్దల

మేషం అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వ్యవహారానుకూలత ఉంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. అనేక పనులతో సతమ తమవుతారు. రావలసిన ధనం అందుతుంది. వెండి బంగారాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో తరచూ సంభాషిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. మీజోక్యం అనివార్యం. దైవకార్యంలో పాల్గొంటారు. వృషభం కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు లావాదేవీలు మీ సమక్షంలో సాగుతాయి. మీ నిర్ణయం ఆమోదయోగ్యమ వుతుంది. కొత్త పనులు చేపడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఆర్థికంగా బాగుంటుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. పనులు సానుకూలమవుతాయి. పత్రాలు అందుకుం టారు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. మిథునం మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు సంప్రదింపులు కొలిక్కివస్తాయి. నిపుణుల సలహా పాటిస్తారు. ధనయోగం ఉంది. ఖర్చులు భారమనిపించవు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహసంబం ధాలు బలపడతాయి. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యో న్ముఖులను చేస్తాయి. మధ్యవర్తులు, కన్సల్టె న్సీలను ఆశ్రయించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆప్తులకు మీ సమస్య తెలియజేయండి. ఆరోగ్యం బాగుంటుంది. కర్కాటకం పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష సంతోషం కలిగించే వార్త వింటారు. మీ శ్రమ ఫలిస్తుంది. స్థిరచరాస్తుల ధనం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. ఉల్లాసంగా గడుపుతారు. మీ సాయంతో ఒకరికి శుభం జరుగుతుంది. పత్రాలు అందుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరు స్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించు కోవద్దు. ధైర్యంగా యత్నాలు సాగించండి. సన్నిహితులతో తరచూ సంభాషిస్తుంటారు. సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఆశావహదృక్పథంతో అడుగు ముందుకేయండి. ఏ విషయాన్నీ సమస్య అనుకోవద్దు. పరిస్థితులు త్వరలో మెరుగు పడతాయి. ఖర్చులు విపరీతం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. అనుకోని సంఘ టన ఎదురవుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు
ఆగస్టు మూడో వారంలో మేష రాశి నుంచి సూర్యుడు పంచమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి. మీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారం చివర్లో మీ భాగస్వామితో నాణ్యమైన సమయం గడిపే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. పరిహారం : సూర్య భగవానుడిని స్మరించుకుంటూ గాయత్రీ మంత్రాన్ని పఠించాలి. వృషభ రాశి వారికి ఆగస్టు మూడో వారంలో అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి నుంచి సూర్యుడు నాలుగో స్థానంలో, ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో సంచారం చేయడం కారణంగా మీకు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబంతో నాణ్యమైన సమయం గడిపే అవకాశం ఉంది. వారం ప్రారంభంలో స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. పరిహారం : ఆదివారం రోజున సూర్య మంత్రాలను జపించాలి. కర్కాటక రాశి వారికి ఆగస్టు మూడో వారంలో శుభప్రదంగా ఉంటుంది. ఇదే రాశిలో గురు గ్రహం మొదటి లగ్నంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడనుంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు సీనియర్ల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వారం చివర్లో మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి లభించొచ్చు. పరిహారం : గురువారాల్లో అవసరం ఉన్న వారికి అరటిపండ్లు, శనగపప్పు దానం చేయాలి. వృశ్చిక రాశి వారికి ఆగస్టు మూడో వారంలో శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీకు గణనీయమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. సూర్యుడు, గురుడి ప్రభావంతో మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం

ఈ వీకెండ్ లో ఏడు సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో నాలుగు స్ట్రయిట్ సినిమాలు కాగా మూడు అనువాద చిత్రాలు. ఆగస్ట్ సెకండ్ వీకెండ్ థియేటర్లలో స్ట్రయిట్ సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు సైతం సందడి చేయబోతున్నాయి. నాలుగు డైరెక్ట్ తెలుగు సినిమాలు వస్తుంటే, వాటికి దీటుగా మూడు అనువాద చిత్రాలు రాబోతున్నాయి. సూర్య హీరోగా సితార ఎంటర్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి తెరకెక్కించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' అందులో ఒకటి. మరొకటి ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లో స్వర్గీయ ఆర్.బి. చౌదరి నిర్మించిన 'మకుటం'. ఈ మూవీ కోసం తొలిసారి హీరో విశాల్ దర్శకుడి అవతారమెత్తాడు. ఈ రెండు అనువాద చిత్రాలతో పాటే ఇంగ్లీష్ సినిమా 'ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్' తెలుగులో వస్తోంది. శుక్రవారం వస్తున్న సినిమాల్లో అందరూ దృష్టి సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' మీదనే ఎక్కువగా ఉంది. గత కొంతకాలంగా సరైన విజయం లేక సతమతమౌతున్న సూర్యకు ఈ యేడాది 'కరుప్పు8 రూపంలో మంచి విజయం లభించింది. ఆ వెనుకే 'విశ్వనాథ్ అండ్ సన్స్' రావడం సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు కలిసి వచ్చిన అంశం. యూత్ ను 'ప్రేమలు' చిత్రంతో మెస్మరైజ్ చేసిన మమిత బైజు నాయికగా నటించిన ఈ సినిమాలో రాధిక, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ దీనికి సంగీతం సమకూర్చాడు. ఈ సినిమాతో పాటే వస్తున్న విశాల్ 'మకుటం' చిత్రానికీ జీవీ ప్రకాశ్ కుమారే సంగీత దర్శకుడు. ఇందులో అంజలి, దుషార విజయన్ కథానాయకులుగా నటించారు. ఇక ఈ వీకెండ్ లో వస్తున్న మరో అనువాద చిత్రం 'ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్'. డేవిడ్ రాబర్ట్ ఈ ఎడ్వంచర్ థ్రిల్లర్ కు దర్శకత్వం వహించారు. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నిర్మించిన 'ది ఎండ్

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ తిరుపతికి ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ వరకు రైలు సర్వీసులు Tirupati Special Trains: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే సంతోషకరమైన వార్త అందించింది. దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తుండటంతో తిరుపతి రైల్వే మార్గంలో తీవ్ర రద్దీ నెలకొంటోంది. ప్రయాణికుల రద్దీని నియంత్రించడంతో పాటు భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు ప్రత్యేక, వీక్లీ రైళ్ల(Tirupati Special Trains)ను అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలోనే పండుగలు, సెలవుల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం-తిరుపతి మార్గంలో సరికొత్త వీకెండ్ స్పెషల్ రైలును అందుబాటులోకి తెచ్చింది. Dwcra Women: ఏపీ డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్.. తక్కువ వడ్డీకే బ్యాంకు లోన్లు.. రాయితీపై ఈ-ఆటోలు, ఈ-స్కూటీలు విశాఖపట్నం-తిరుపతి ప్రత్యేక రైలు: రైల్వేశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తిరుపతి-విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్ (08509) ఆగస్ట్ 10 నుండి సెప్టెంబర్ 10 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి ఆదివారం, గురువారాల్లో తిరుపతిలో ఉదయం 9.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం-తిరుపతి (08510) రైలు ఆగస్ట్ 17 నుండి సెప్టెంబర్ 11 వరకు ప్రతి సోమ, శుక్రవారాల్లో రాత్రి 7.40 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు సాయంత్రం 6.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 22 కోచ్‌లతో నడిచే ఈ రైలు ఏపీలోని పలు జిల్లాల ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనుంది. చర్లపల్లి, తమిళనాడు వేడుకలకు మరిన్ని ప్రత్యేక రైళ్లు: శ్రీవారి భక్తులతో పాటు ఇతర ప్రయాణికుల కోసం సంబల్పూర్-చర్లపల్లి (08309) ప్రత్యేక రైలును ఆగస్ట్ 14న నడపనున్నారు. ఇది మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. మరోవైపు తమిళనాడులోని వేళాంకణ్ణి చర్చి వార్షిక ఉత్సవాల దృష్ట్యా ఆగస్ట్ 26 నుండి

స్వాతంత్ర్య దినోత్సవ వీకెండ్‌ను పురస్కరించుకుని ఈ వారం థియేటర్లలో సినిమాల సందడి నెలకొంది. ఆగస్టు 14 గురువారం ఒక్కరోజే ఏడు కొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. విభిన్న కథాంశాలతో తెరకెక్కిన ఈ వారం చిత్రాల వివరాలు: తమిళ హీరో సూర్య కథానాయకుడిగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మమితా బైజు కథానాయికగా నటించగా, రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. పిస్టల్ షూటర్ సంజయ్ విశ్వనాథ్ (సూర్య) జీవితంలో కుటుంబ భావోద్వేగాలు, అనుకోకుండా ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. సీనియర్ దర్శకుడు, నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై కాశి విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించారు. శ్రావణ్ రెడ్డి, ఉల్కా గుప్తా కీలక పాత్రల్లో నటించారు. అల్లు సినిమాస్‌లో పెయిడ్ ప్రిమియర్లు జరుపుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. యాక్షన్ హీరో విశాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘మకుటం’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్బీ చౌదరి నిర్మించగా, దుషార విజయన్, అంజలి కథానాయికలుగా నటించారు. విశాల్ విభిన్న గెటప్పులలో కనిపించబోతున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ ఆగస్టు 14న విడుదల కానుంది. వీటితో పాటు వైవిధ్యమైన కథాంశాలతో వస్తున్న ‘పల్లాబురుసు’, ‘హుషార్ పిట్టలు’, ‘ఆవారాపన్ 2’, మరియు ‘బట్వారా 1947’ చిత్రాలు కూడా అదే రోజు థియేటర్లలో విడుదలవుతున్నాయి. మొత్తం ఏడు చిత్రాలు ఒకే రోజు పోటీపడుతుండటంతో ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద ఏ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాల్సి ఉంది

తిరుపతికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ కీలక అప్డేట్. విశాఖ నుంచి తిరుపతికి మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చారు. విశాఖ నుంచి ఇప్పటికే తిరుపతికి వెళ్తున్న రెగ్యులర్ రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు కొనసాగుతోంది. దీంతో.. ప్రయాణీకుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు కొత్తగా మరో రైలును ప్రవేశ పెట్టారు. కాగా.. విశాఖ నుంచి త్వరలోనే బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ రైలును ప్రారంభించేందు కు కసరత్తు జరుగుతోంది. ఈ రైలును సైతం తిరుపతి మీదుగా రాకపోక లు కొనసాగించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.విశాఖ నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణీకుల కోసం రైల్వే కీలక ప్రకటన చేసింది. విశాఖ నుంచి తిరుపతికి ప్రస్తుతం వీక్లీ ఎక్స్ ప్రెస్ గా ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. రద్దీ.. ఆదరణ పరిశీలన చేసిన తరువాత రెగ్యులర్ సర్వీసు గా మార్చే అంశం పరిశీలించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. కాగా.. ఈ రైలు నెంబర్ 08509 తిరుపతి- విశాఖ వీక్లీ ఎక్స్ ప్రెస్ సెప్టెంబర్ 10వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రతీ ఆదివారం, గురువారం తిరుపతిలో ఉదయం 9.50 గంటలకు బయల్దేరి.. తర్వాతి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ఇక ఇదే రైలు విశాఖపట్నం-తిరుపతి(08510) ఆగస్ట్ 17 నుంచి సెప్టెంబర్ 11 వరకు సర్వీసులు అందించనుంది. ప్రతీ సోమ, శుక్రవారాల్లో విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రాత్రి 7.40 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు సాయంత్రం 6.45 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.శ్రీవారి భక్తులకు అరుదైన అద్భుత అవకాశం- మళ్లీ దక్కేనా..!!రైలు రూట్ - షెడ్యూల్కాగా, ఈ రైలులో 22 కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు మరియు రేణిగుంట రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు నిలుపుదల (హాల్ట్) సౌకర్యం కల్పించారు. దీనివల్ల ఉత్తరాంధ్ర మరియు కోస్తాంధ్ర ప్రాంత ప్రయాణికులకు తిరుపతి ప్రయాణం మరింత సులభతరం కానుంది. వీకెండ్లో సాధారణ రైళ్లలో

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది తరచూ వస్తూ ఉంటారు. దీంతో తిరుపతి రైల్వే మార్గంలో ట్రైన్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఈ రూట్లో ఎప్పటికప్పుడు నడుపుతోంది. ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా స్పెషల్ రైళ్లు, వీక్లీ రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇక సెలవులు, పండుగ రోజుల్లో మరిన్ని రైళ్లను తీసుకొస్తుంది. ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు ఈ ప్రత్యేక రైళ్లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రైల్వేశాఖ చెబుతోంది. ఇక తిరుమల వెళ్లే ప్రయాణికులకు మరో వీకెండ్ స్పెషల్ ట్రైన్ అందుబాటులోకి వచ్చింది. తిరుపతి-విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్(08509) తీసుకొచ్చింది. ఆగస్ట్ 10వ తేదీ నుంచి సెప్టెంబర్ 10 వరకు నెల రోజుల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు షెడ్యూల్ విషయానికొస్తే.. ప్రతీ ఆదివారం, గురువారం తిరుపతిలో ఉదయం 9.50 గంటలకు బయల్దేరి.. తర్వాతి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ఇక ఇదే రైలు విశాఖపట్నం-తిరుపతి(08510) ఆగస్ట్ 17 నుంచి సెప్టెంబర్ 11 వరకు సర్వీసులు అందించనుంది. ప్రతీ సోమ, శుక్రవారాల్లో విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రాత్రి 7.40 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు సాయంత్రం 6.45 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ట్రైన్లో 22 కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ఏపీలోని పలు ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు ఈ రైళ్లు ఉపయోగపడతాయని, ప్రయాణికులు ఈ అవకాాశాన్ని ఉపయోగించుకోవాలని రైల్వేశాఖ తెలిపింది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక సంబల్పూర్- చర్లపల్లి(08309) ప్రత్యేక రైలు ఆగస్ట్ 14న ఉదయం 11.45 గంటలకు బయల్దేరి.. ఈ నెల 15వ తేదీ ఉదయం 11.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ ట్రైనులో మొత్తం 20 కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. అటు తమిళనాడులో ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబర్

ఆగస్ట్‌లో వరుసగా లాంగ్ వీకెండ్స్. 15, 16 తేదీల్లో స్కూళ్లకు సెలవులు. ఐటీ, ప్రభుత్వ ఉద్యోగులకు పండగే. Holidays: ఆగస్ట్ మాసం వచ్చిందంటే చాలు వరుస పండగలు, జాతీయ పర్వదినాలతో క్యాలెండర్ కళకళలాడుతుంటుంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో విద్యార్థులతో పాటు ఉద్యోగులకు కూడా ఈ నెలలో భలేగా కలసి వస్తోంది. ఇప్పటికే ఆగస్ట్ 8 (రెండో శనివారం), 9 (ఆదివారం) తో పాటు తెలంగాణలో బోనాల మరుసటి రోజు (ఆగస్ట్ 10) సెలవు (Holidays)రావడంతో మూడ్రోజుల లాంగ్ వీకెండ్‌ను జనం ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మరోసారి వీకెండ్‌తో కలిపి వరుస సెలవులు రానుండటంతో ప్రయాణాలు, పిక్నిక్లు ప్లాన్ చేసుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. Medigadda Case: మేడిగడ్డ కేసులో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్‌కు మళ్లీ సమన్లు.. సెప్టెంబర్ 9పైనే అందరి చూపు ఆగస్ట్ 15, 16న మళ్లీ వరుస హాలిడేస్: వచ్చే ఆగస్ట్ 15న దేశవ్యాప్తంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ రోజున పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ జెండా ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు ముగిసిన వెంటనే విద్యార్థులకు సెలవు ఇస్తారు. సాధారణ తరగతులు ఏవీ ఉండవు. మరుసటి రోజు ఆగస్ట్ 16న ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజుల పాటు సెలవు లభించనుంది. పాఠశాల విద్యార్థులకే కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్, ఐటీ ఉద్యోగులకు కూడా ఈ శని, ఆదివారాలు పూర్తిస్థాయిలో వీకెండ్ హాలిడేస్‌గా మారుతున్నాయి. మణిపూర్‌లో ప్రత్యేక సెలవు.. ఏపీ, తెలంగాణలోనూ పండగే: ఇదిలా ఉండగా, ఆగస్ట్ 13న మణిపూర్ రాష్ట్రంలో ఆంగ్లో-మణిపురి యుద్ధ అమరవీరుల స్మారకార్థం 'పేట్రియాట్స్ డే' సందర్భంగా అక్కడి ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది. దీంతో అక్కడ ఆగస్ట్ 13, 15, 16 తేదీల్లో హాలిడేస్ వచ్చాయి. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆగస్ట్ 15, 16 తేదీలలో రెండు రోజులు వరుసగా సెలవులు రానుండటంతో విద్యాసంస్థలు, కార్పొరేట్ వర్గాలు ఈ లాంగ్ వీకెండ్‌ను ఆస్వాదించేందుకు ప్రణాళికలు

ప్రతిసారీ వీకెండ్ వస్తే చాలు.. రొటీన్ మాల్స్, సినిమా థియేటర్లు, ట్రాఫిక్ గొడవలతో చిరాకు వస్తోందా? కొద్దిరోజులు ల్యాప్‌టాప్‌లు, ఆఫీస్ డెడ్‌లైన్స్ పక్కనపెట్టి ప్రశాంతమైన ప్రదేశంలో ఫ్రెష్ ఎయిర్ పీల్చాలని ఉందా? అయితే వేల రూపాయలు ఖర్చు పెట్టి కేరళ కోవలం లేదా విదేశాల్లోని మాల్దీవ్స్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ గుండెకాయ లాంటి దిండిబ్యాక్వాటర్స్, అలాగే విజయవాడలోని 'భవానీ ఐలాండ్' సందర్శిస్తే చాలు.. మీకు కచ్చితంగా విదేశీ రిజార్టులో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. చుట్టూ కొబ్బరితోటలు, పచ్చని కొండలు, నీటిపై తేలియాడే హౌస్బోట్లు.. ఒకే ఒక్క ట్రిప్‌తో మీ వారమంతా ఉన్న స్ట్రెస్ దూదిపింజలా ఎగిరిపోతుంది. కోనసీమ ప్రాంతంలోని దిండి వద్ద రాజమండ్రి/అమలాపురం పరిసరాల్లో ప్రవహించే గోదావరి పాయలు, నీలిరంగు బ్యాక్‌వాటర్స్ అచ్చం కేరళ ఆలేప్పి తరహాలోనే ఉంటాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ప్రైవేట్ రిసార్టులు నడిపే హౌస్‌బోట్ ప్రయాణం ఈ ట్రిప్ సూపర్ ఉంటుంది. గంటల తరబడి నీటిపై ప్రయాణిస్తూ, ఏకాంతంగా డెక్ మీద కూర్చుని చల్లటి గాలిని ఆస్వాదిస్తుంటే వచ్చే కిక్కే వేరబ్బా. బోట్లోనే ఏపీ స్పెషల్ ఘుమఘుమలాడే వెజ్ అండ్ నాన్ వెజ్ భోజనం ఆస్వాదించవచ్చు. ఫ్యామిలీతో లేదా లైఫ్‌పార్ట్‌నర్‌తో కలిసి నైట్ స్టే చేయడానికి కూడా ఈ హౌస్బోట్లు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటే, ప్రకాశం బ్యారేజీ బ్యాక్‌వాటర్స్‌లోని భవానీ ఐలాండ్ మీకు రివర్ ఐలాండ్ అనుభూతిని ఇస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద నదీ ద్వీపాల్లో ఒకటైన ఈ ఐలాండ్‌కు వెళ్లాలంటే పున్నమి ఘాట్ నుంచి 6 నిమిషాల బోట్ జర్నీ చేయాలి. కృష్ణానది నీటి నడుమ పచ్చని చెట్లు, మడ అడవుల మధ్య ఉండే ఈ ద్వీపం ఒక మినీ వాటర్ పార్క్‌లా ఉంటుంది. కుటుంబంతో కలిసి వీకెండ్ స్పెండ్ చేయడానికి రిసార్టులు, సైక్లింగ్ ట్రాక్‌లు, రివర్ వాటర్ స్పోర్ట్స్, కయాకింగ్ వంటి అనేక అడ్వెంచర్ రిక్రియేషన్స్

ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాల మాదిరే ఓటీటీలోనూ ఆసక్తికరమైన కంటెంట్ ప్రేక్షకులను పలకరించబోతోంది. ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాల మాదిరే ఓటీటీలోనూ ఆసక్తికరమైన కంటెంట్ ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ వారం కూడా ప్రపంచవ్యాప్తంగా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, లయన్స్‌గేట్ ప్లే, యాపిల్ టీవీ+ సహా వివిధ ఓటీటీ ప్లాట్‌ఫాంలపై స్ట్రీమింగ్కు రాబోతున్నాయి. ముఖ్యంగా ‘కాక్టెయిల్ 2’, ‘రీచర్’ సీజన్ 4 సహా పలు క్రేజీ చిత్రాలు, సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. ఆగస్టు 10 నుంచి 16 వరకు ఏయే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ఏయే ఓటీటీ వేదికలపై అందుబాటులోకి రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం

School Holidays : తెలుగు రాష్ట్రాల విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈ ఆగస్ట్ లో భారీ సెలవులు వస్తున్నాయి. పండగలు, ప్రత్యేక వేడుకలు, జాతీయ పర్వదినాల సందర్భంగా సెలవులున్నాయి... ఆసక్తికరంగా ఇవి వీకెండ్ తో కలిసిరావడంతో వరుస సెలవులుగా మారుతున్నాయి. ఇలా గత మూడ్రోజులుగా సెలవులు కొనసాగుతున్నాయి... ఆగస్ట్ 8 రెండో శనివారం, 9 ఆదివారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సెలవుంటే ఆగస్ట్ 10న బోనాల తర్వాతరోజు తెలంగాణవ్యాప్తంగా సెలవుంది. ఇలా ఏపీలో 2, తెలంగాణలో 3 రోజులు వరుసగా సెలవులు వచ్చాయి. అయితే ఈ వీకెండ్ తో సెలవుల పరంపర ముగియలేదు... వచ్చే వీకెండ్ కూడా ఇలాగే వరుసగా రెండ్రోజులు హాలిడేస్ కలిసి వస్తున్నాయి... దీంతో విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరి గంతేసే పరిస్థితి. ఆగస్ట్ 15, 16 రెండ్రోజులు దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో సెలవులున్నాయి... ఏరోజు ఎందుకు సెలవో ఇక్కడ తెలుసుకుందాం. ఆగస్ట్ 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం... ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత విద్యార్థులకు సెలవే. కొన్ని స్కూళ్లలో కేవలం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి... అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇంటికి వెళ్లిపోతారు... ఎలాంటి తరగతులు ఉండవు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అధికారిక సెలవు ఉంటుంది. అయితే ఈసారి స్వాతంత్య్ర దినోత్సవం వీకెండ్ సెలవుతో కలిసి వస్తోంది... కాబట్టి మరోసారి వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి. ఆగస్ట్ 15 శనివారం ఇండిపెండెంట్ డే, ఆగస్ట్ 16 ఆదివారం సాధారణ సెలవు... ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా రెండ్రోజుల సెలవులున్నాయి... వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారుతోంది. కేవలం విద్యార్థులకే కాదు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలవు ఉంటుంది. కార్పోరేట్, ఐటీ ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవానికి లేకున్నా ప్రతి శని, ఆదివారం సెలవే. ఇలా విద్యార్థులకు, ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులకు ఈ వీకెండ్ రెండ్రోజులు సెలవే... కాబట్టి కుటుంబమంతా

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదం మరింత పెరగనుంది. ఆగస్టు 10 నుంచి 16 వరకు పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, రియాలిటీ షోలు వివిధ ఓటీటీ లపై స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ నటించిన ‘కాక్టెయిల్ 2’, మలయాళ యాక్షన్ థ్రిల్లర్ ‘కట్టాలన్’, కంగనా రనౌత్ నటించిన ‘భారత్ భాగ్య విధాత’ వంటి సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. లెస్లీ మాన్విల్లే, సియారన్ హిండ్స్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో స్టెల్లా, గెర్రీ అనే రిటైర్డ్ దంపతులు గ్లాస్గోలోని తమ ఇంటి నుంచి ఆమ్స్టర్డామ్కు అనుకోని విహారయాత్రకు బయలుదేరుతారు. ఈ ప్రయాణంలో వారు తమను తాము మరోసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కామెడీ స్పెషల్‌గా రూపొందిన ఈ కార్యక్రమంలో రోరీ స్కోవెల్ తనదైన ఉత్సాహభరితమైన, ఊహించని కామెడీ శైలిలో ఇంట్లోకి దొంగలు చొరబడే పరిస్థితి, బైబిల్ కథను వినోదాత్మకంగా ప్రదర్శించడం, మరణించిన తన తండ్రి చివరి కోరికను నెరవేర్చడం వంటి అంశాలపై మాట్లాడతారు. రెండేళ్లపాటు చిత్రీకరించిన మూడు భాగాల డాక్యుమెంటరీ సిరీస్ ఇది. ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ జోసే మౌరిన్హో జీవితం, కెరీర్‌ను ఈ సిరీస్‌లో చూపించనున్నారు. జ్లాటన్ ఇబ్రహిమోవిచ్, ఇకర్ కాసియాస్, ఫ్రాంక్ లాంపార్డ్ తదితర ఫుట్‌బాల్ ప్రముఖులు కూడా ఇందులో కనిపించనున్నారు. ఓ మాజీ నేరస్థుడి కుమార్తె కనిపించకుండా పోవడంతో అతడి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడంతో పాటు అండర్‌వరల్డ్‌లోని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ అతడు పోరాడే కథతో ఈ యాక్షన్ చిత్రం తెరకెక్కింది. ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ డేట్ : ఆగస్టు 13 తనకు బిడ్డ కావాలనే కోరికతో పాటు కుటుంబం, సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిడితో ఓ మహిళ గర్భవతిగా ఉన్నట్లు నాటకం ఆడుతుంది. ఆ తర్వాత ఆమె ఓ నేరంలో చిక్కుకుంటుంది. మెక్సికోలో 2009లో జరిగిన ఘటనల
Upcoming IPOs: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పండగే. భారతీయ ప్రాథమిక మార్కెట్ ఈవారం పబ్లిక్ ఇష్యూలతో కళకళలాడనుంది. ప్రముఖ ఇ-కామర్స్ ఎనేబుల్మెంట్ ప్లాట్ ఫామ్ షిప్‌రాకెట్, ప్రముఖ డెయిరీ బ్రాండ్ మిల్కీ మిస్ట్ వంటి దిగ్గ కంపెనీలతో సహా మొత్తం 9 కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. ఈ కంపనీలు అన్నీ కలిసి రూ.7,681 కోట్లు సమీకరించేందుకు మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. లిస్టింగ్ గెయిన్స్ కోసం పెట్టుబడి పెట్టాలనుకునే వారికిఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. మరి ఏ కంపెనీ ఎప్పుడు వస్తుంది? అనే వివరాలు తెలుసుకుందాం.ఈ జాబితాలో మోల్బియో డయోగ్నిస్టిక్స్ (Molbio Diagnostics), ధూత్ ట్రాన్స్మిషన్, మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్, ఫాస్కినేట్ టెక్స్టైల్స్, షిప్‌రాకెట్, బెహారీ లాల్ ఇంజినీరింగ్, ప్రమోదిని మెడికేర్, క్యూ అండ్ టీ ఫుడ్స్, షామ్ ఫామ్ వంటివి ఉన్నాయి. ఈ కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ఆగస్టు 10 నుంచి 12వ తేదీల మధ్య సబ్స్క్రిప్షన్ ప్రారంభిస్తున్నాయి. ఆగస్టు 14 వరకు సబ్స్క్రిప్షన్ కొనసాగనుంది. అలాగే వీటితో పాటు ఈ వారం ఏకంగా 8 కంపెనీలు మార్కెట్ల లిస్టింగ్ కానున్నాయి.అతిపెద్ద ఐపీఓ ఇదేఈ వారం వస్తున్న పబ్లిక్ ఇష్యూల్లో ధూత్ ట్రాన్స్మిషన్ అతిపెద్ద ఐపీఓగా నిలిచింది. ఈ పబ్లిక్ ఇష్యూ ఆగస్టు 10వ తేదీన మొదలై 12వ తేదీతో ముగుస్తుంది. ఈ మెయిన్‌బోర్డ్ ఐపీఓ షేరు ధరలు రూ.829- 871గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద రూ.3066.89 కోట్లు సమీకరించనుంది. ఇందులో తాజా షేర్ల జారీ ద్వారా రూ.1400 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.1,666.89 కోట్లు సమీకరించనుంది. ప్రస్తుతం ఈ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం 29 శాతంగా ఉంది.Read Also: Zepto IPO: ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్.. రూ.11000 కోట్ల జెప్టో ఐపీఓ.. మరో 5 కంపెనీలకూ సెబీ ఆమోదంమిల్కి మిస్ట్ డైరీ ఫుడ్ ఐపీఓమిల్కి మిస్ట్ డైరీ ఫుడ్ లిమిటెడ్ (Milky Mist Dairy Food IPO) పబ్లిక్

వారమంతా డెస్క్ ముందు కూర్చుని, ల్యాప్‌టాప్ స్క్రీన్లు చూస్తూ, సేమ్ రొటీన్ లైఫ్‌తో బోర్ కొట్టేసిందా? అయితే, వీకెండ్ మైండ్ బ్లాకింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు ఒక సూపర్ డెస్టినేషన్ రెడీగా ఉంది. బీచ్‌లు చూడటానికి వేల కిలోమీటర్లు ప్రయాణించి వేరే రాష్ట్రాలకో లేక విదేశాలకో వెళ్లాల్సిన పని లేదు. హైదరాబాద్‌కు జస్ట్ 150 నుంచి 170 కిలోమీటర్ల దూరంలో, కారు లేదా బైక్ స్టార్ట్ చేస్తే 3-4 గంటల్లో చేరుకునే రేంజ్‌లోనే 'తెలంగాణ మాల్దీవ్స్' వైబ్స్ వేయిటింగ్ చేస్తున్నాయి. అదే నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ – ఏలేశ్వరం గట్టు. చుట్టూ కొండలు, మధ్యలో నీలిరంగు అలలు, పచ్చని నల్లమల అడవులు.. ఒకే ఒక్క ట్రిప్‌లో వైల్డ్ లొకేషన్స్, బోటింగ్, హిస్టరీ, క్రూయిజ్ విజువల్స్ అన్నీ ప్యాక్ అయి ఉన్నాయి. సాగర్ డ్యామ్ వద్దకు చేరుకోగానే అసలైన అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. తెలంగాణ టూరిజం వాళ్లు ఆఫర్ చేసే లాంచ్ రైడ్‌లో కూర్చుంటే వచ్చే చల్లటి గాలులు, వాటర్ స్ప్లాషెస్ నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఇస్తాయి. దాదాపు 45 నిమిషాల పాటు సాగే ఈ మోటార్ బోట్ ప్రయాణంలో నీటి మధ్యలో నుంచి చూస్తుంటే చుట్టూ కనిపించే నల్లమల కొండల వ్యూస్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి. నీటి మట్టం కరెక్ట్‌గా ఉన్నప్పుడు నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు దాదాపు 120 కిలోమీటర్ల సుదీర్ఘమైన 6 గంటల క్రూయిజ్ ప్రయాణం కూడా అందుబాటులో ఉంటుంది. నందికొండ, ఏలేశ్వరం, సేలేశ్వరం, తూర్పు కనుమల మీదుగా సాగే ఈ వాటర్ ప్రయాణం ప్రశాంతతను వెతుక్కునేవారికి అల్టిమేట్ ఛాయిస్. లైఫ్ జాకెట్స్ తొడుక్కుని నీటి అలలపై ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో కలిసి రీల్స్, ఫోటోలు దిగుతుంటే ఆ కిక్కే వేరని చెప్పాలి. బోటింగ్ కేవలం వ్యూస్ కోసమే అనుకుంటే పొరపాటే.. ఈ ప్రయాణం మిమ్మల్ని నేరుగా 'నాగార్జునకొండ' దీవికి తీసుకెళ్తుంది. నీటి మధ్యలో కొండపై రూపుదిద్దుకున్న ఈ మ్యూజియం ఒక చారిత్రక అద్భుతం

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి ఊరట చెందుతారు. నిరుద్యోగులు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆత్మీయుల రాక ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ విషయంలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా కాస్త మెరుగైన పరిస్థితులుంటాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తారు. కొన్ని రంగాల వారికి శుభవార్తలు అందుతాయి. సన్నిహితుల ప్రోత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల పరీక్ష ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో నష్టాల నుంచి తెలివిగా బయట పడతారు. ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. కొన్ని రంగాల వారికి ఆశలు అంతగా ఫలించవు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక లాభాలు అందుతాయి. భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. మీ నిర్ణయాలు ఇంట్లో అందరికి నచ్చుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విద్యార్థుల పరీక్ష ఫలితాలు కొంత